మరిన్ని Redmi ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

రూ.10,000 రేంజ్‌‌లో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ (Xiaomi) నుంచి మరిన్ని Redmiఫోన్‌లు భారత్‌లో విడుదల కాబోతున్నాయి. మార్చి 20న నిర్వహించబోతున్న ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా షియోమీ ఇండియా తన రెడ్మీ 4 సిరీస్ నుంచి మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లు రూ.10,000 రేంజ్‌‌లో అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.

Read More : 200 గంటల బ్యాటరీతో కూల్‌ప్యాడ్ నోట్ 5 లైట్, రూ.8,199కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Redmi Note 4 రికార్డుల మోత...

షియోమీ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Redmi Note 4 సునాయాశంగా 10 లక్షల అమ్మకాలను క్రాస్ చేసింది. కేవలం 45 రోజుల వ్యవధిలోనే ఈ మార్క్‌ను క్రాస్ చేయటం విశేషం. రెడ్మీ నోట్ 4 అమ్మకాలు జనవరి 23, 2017నంచి ఫ్లిప్‌కార్ట్‌లో పారంభమయ్యాయి. రెడ్మీ 4 సిరీస్ నుంచి షియోమీ ఇప్పటి వరకు లాంచ్ చేసిన ఫోన్ లు వివరాలను పరిశీలించినట్లయితే..

షియోమీ రెడ్మీ 4

షియోమీ రెడ్మీ 4 ఫోన్, 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. 2.5డి కర్వుడ్ గ్లాస్ సపోర్ట్, Snapdragon 430 ఆక్టా కోర్ ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,100mAh బ్యాటరీ.

షియోమీ రెడ్మీ 4 ప్రైమ్

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే, Snapdragon 625 ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,100mAh బ్యాటరీ.

రెడ్మీ 4ఎక్స్

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, Snapdragon 430 ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ కెపాసిటీ (32జీబి, 64జీబి), , 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,100mAh బ్యాటరీ.

రెడ్మీ 4ఏ

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. Snapdragon 425 ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,120mAh బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Xiaomi Redmi 4 series to be launched in India on March 20: Specs, price and more. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting