నిమిషాల్లో అమ్ముడుపోయిన Redmi 4, మళ్లి కొనాలంటే జూన్ 6నే

మొదటి సేల్ మే 23న జరగగా 8 నిమిషాల్లో 2,50,000 యూనిట్లు సేల్ అయ్యాయి.

|

మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ షియోమి Redmi 4 మరోసారి నిమిషాల్లో అమ్ముడుపోయింది. ఈ ఫోన్‌లకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఆన్‌లైన్ సేల్‌లో భాగంగా నిమిషాల వ్యవధిలో మొత్తం ఫోన్‌లు అమ్ముడుపోయాయి. ఈ ఫోన్‌లకు సంబంధించిన మొదటి సేల్ మే 23న జరగగా 8 నిమిషాల్లో 2,50,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. రెండవ సేల్ మే 30న జరిగింది. ఈ సేల్‌లో ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయన్నది తెలియాల్సి ఉంది. తదుపరి సేల్ మే6న జరుగుతుంది. Amazon India అలానే Mi.comలలో మాత్రమే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.

మూడు వేరియంట్‌లలో..

మూడు వేరియంట్‌లలో..

Redmi 4 ఫోన్ మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి 2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది. ధర రూ.6,999. రెండవ వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది. ధర రూ.8,999. మూడవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది. ధర రూ.10,999.

రెడ్‌మి 4 స్పెసిఫికేషన్స్..

రెడ్‌మి 4 స్పెసిఫికేషన్స్..

5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్. ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. కెమెరా 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4100mAh బ్యాటరీ.

రెడ్‌మి 4 vs రెడ్‌మి 4ఏ
 

రెడ్‌మి 4 vs రెడ్‌మి 4ఏ

చాలా మంది యూజర్లు రెడ్‌మి 4ను తీసుకోవాలా లేక రెడ్‌మి 4ఏను తీసుకోవాలా అన్న సందేహంలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం రూ.1000 తేడాతో లభ్యమవుతోన్న ఈ రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లకు సంబంధించి spec comparisonను ఇప్పుడు చూద్దాం..

బాడీ డిజైన్ విషయానికి వచ్చేసరికి

బాడీ డిజైన్ విషయానికి వచ్చేసరికి

రెడ్‌మి 4 ఫోన్‌ మెటల్ బాడీతో వస్తోంది. ఇదే సమయంలో రెడ్‌మి 4ఏ ప్లాస్టిక్ బాడీని కలిగి ఉంటుంది. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఈ రెండు ఫోన్‌లు 5 అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. రెడ్‌మి 4 మోడల్‌కు 2.5డి కర్వుడ్ గ్లాస్ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి

రెడ్‌మి 4 ఫోన్‌ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 చిప్‌సెట్ పై రన్ అవుతుంది. ఇదే సమయంలో రెడ్‌మి 4ఏ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 435 చిప్‌సెట్ పై రన్ అవుతుంది.

ర్యామ్ ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే..

ర్యామ్ ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే..

రెడ్‌మి 4ఏ ఫోన్ కేవలం 2జీబి ర్యామ్ ఇంకా 16జీబి స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో రెడ్‌మి 4 మోడల్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 2జీబి+16జీబి, 3జీబి +32జీబి, 4జీబి+64జీబి స్టోరేజ్.

ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్..

ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్..

రెడ్‌మి 4 ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ స్కానర్ అదనపు ప్లస్ పాయింట్. రెడ్‌మి 4ఏలో ఈ సదుపాయం లోపించింది. ఈ రెండు ఫోన్లు 4G LTE, VoLTE, Wi-Fi, Bluetooth, GPS, USB OTG వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తాయి.

కెమెరా డిపార్ట్‌మెంట్

కెమెరా డిపార్ట్‌మెంట్

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు సమానమైన 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉంటాయి.

ఆపరేటింగ్ సిస్టం..

ఆపరేటింగ్ సిస్టం..

సాఫ్ట్‌వేర్ విషయంలోనూ అంతే, ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు Android 6.0.1 Marshmallow ఆధారంగా డిజైన్ చేసిన MIUI 8 పై యూజర్ ఇంటర్‌ఫేస్ పై బూట్ అవుతాయి. రెడ్‌మి 4 ఫోన్‌కు త్వరలోనే ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్ లభించే అవకాశం ఉంది.

బ్యాటరీ కెపాసిటీ..

బ్యాటరీ కెపాసిటీ..

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్‌మి 4 మోడల్ ఏకంగా 4100mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. ఇదే సమయంలో రెడ్‌మి 4ఏ మోడల్ కేవలం 3120mAh బ్యాటరీని మాత్రమే కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 4 sold out in minutes; next sale slated for June 6. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X