శక్తివంతమైన బడ్జెట్ ఫోన్.. రెడ్మీ నోట్ 4 రివ్యూ

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Xiaomi దూసుకుపోతోంది.

|

షియోమీ (Xiaomi) నుంచి 2016లో విడుదలైన రెడ్మీ నోట్ 3 ఫోన్ ఏ స్థాయిలో సంచలనం రేపిందో మనందరికి తెలుసు. శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో సరికొత్త ఒరవడికి నాంది పలికిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఏకంగా 25 లక్షల మంది కొనుగోలు చేసారు. ఇప్పటికి ఈ ఫోన్‌లకు మార్కెట్లో డిమాండ్ ఉంది.

శక్తివంతమైన బడ్జెట్ ఫోన్.. రెడ్మీ నోట్ 4 రివ్యూ

Read More : మార్చి 31 తరువాత మరో బంపర్ ఆఫర్..?

రెడ్మీ నోట్ 3 ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయి ఇంచుమించుగా 10 నెలలు కావొస్తున్న నేపథ్యంలో, ఈ ఫోన్‌కు సక్సెసర్ వర్షన్ అయిన రెడ్మీ నోట్ 4ను షియోమీ మార్కెట్లో లాంచ్ చేసింది. రెడ్మీ నోట్ 3తో పోలిస్తే పలు డిజైనింగ్ మార్పులతో పాటు అప్‌గ్రేడెడ్ ఇంటర్నల్ స్పెక్స్‌తో మార్కెట్లోకి దూసుకొచ్చిన రెడ్మీ నోట్ 4 రివ్యూను ఇప్పుడు చూద్దాం..

డిజైనింగ్ పరంగా చూస్తే

డిజైనింగ్ పరంగా చూస్తే

డిజైనింగ్ పరంగా చూస్తే రెడ్మీ నోట్ 3, రెడ్మీ నోట్ 4లు మొదటి చూపులో ఒకేలా అనిపిస్తాయి. నోట్ 3 తరహాలోనే నోట్ 4 కూడా 5.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదనంగా ఈ ఫోన్ డిస్‌ప్లే పై 2.5డి కర్వుడ్ గ్లాస్‌ను షియోమీ పొందుపరిచింది. రెడ్మీ నోట్ 3లో కర్వుడ్ గ్లాస్ ఉండదు. నోట్3 మాదిరిగానే నోట్ 4 కూడా సమానమైన స్ర్కీన్ రిసల్యూషన్ (1080*1920)ను కలిగి ఉంది. పీపీఐ (పిక్సల్స్ పర్ ఇంచ్) విషయానికి వచ్చేసరికి నోట్ 4 ఫోన్ 403 పీపీఐను కలిగి ఉంటుంది.

 క్యాండీ బార్ డిజైన్‌

క్యాండీ బార్ డిజైన్‌

రెడ్మీ నోట్ 4 ఫోన్ క్యాండీ బార్ డిజైన్‌తో వస్తోంది. యునిమెటల్ బాడీ డిజైన్‌తో ఇటీవల మార్కెట్లోకి వస్తోన్న చాలా వరకు ఫోన్‌లలో ఈ తరహా డిజైన్‌ను మీరు చూడొచ్చు. రెడ్మీ నోట్ 4 ఫోన్ అంచులు మరింత గుండ్రంగా అనిపిస్తాయి. బరువు విషయానికి వచ్చేసరికి
రెడ్మీ నోట్ 4 ఫోన్ ను 174 గ్రాముల బరువుతో తీర్చిదిద్దారు.

హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి
 

హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి

హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి వాల్యుమ్ రాకర్స్ అలానే పవర్ బటన్‌లను ఫోన్‌కు కుడి వైపు ఏర్పాటు చేసారు. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను ఫోన్‌కు ఎడమ వైపు ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ క్రింద భాగంలో రెండు స్పీకర్స్‌తో పాటు ఒక మైక్రోయూఎస్బీ పోర్టును అమర్చటం జరిగింది. టీవీ, ఏసీ వంటి డివైస్‌లకు ఈ ఫోన్‌ను రిమోట్ కంట్రోలర్‌లా ఉపయోగించుకునేందుకు వీలుగా పై భాగంలో IR blasterను ఏర్పాటు చేసారు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఫోన్ పై భాగంలోనే ఉంటుంది. ఇదే సమయలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరా మాడ్యుల్ క్రింద అమర్చారు.

హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానల్‌

హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానల్‌

ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానల్‌తో పాటు 2.5డి కర్వుడ్ గ్లాస్ రెడ్మీ నోట్ 4 ఫోన్‌కు ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటుంది. రెడ్మీ నోట్ 4 ఆఫర్ చేసే 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, డీసెంట్ వ్యూవింగ్ యాంగిల్స్‌తో పాటు నేచురల్ కలర్స్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, ఎండ వాతవరణంలో ఫోన్‌లోని టెక్స్ట్‌ను చదవటం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తోంది. రిఫ్లెక్టివ్ ప్యానల్ కారణంగా ఇలా జరుగుతుండొచ్చు.

ర్యామ్ ఇంకా స్టోరేజ్

ర్యామ్ ఇంకా స్టోరేజ్

ర్యామ్ ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 మూడు ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999.

Qualcomm Snapdragon 625 ఆక్టా కోర్ ప్రాసెసర్

Qualcomm Snapdragon 625 ఆక్టా కోర్ ప్రాసెసర్

Qualcomm Snapdragon 625 ఆక్టా కోర్ ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. 14nm తయారీ ప్రాసెస్ ఆధారంగా ఈ చిప్‌సెట్‌ను అభివృద్ది చేసారు. ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన లెనోవో పీ2 స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే తరహా చిప్‌సెట్‌ను ఉపయోగించటం జరిగింది. Adreno 506 GPU ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

వేగవంతమైన మల్టీటాస్కింగ్

వేగవంతమైన మల్టీటాస్కింగ్

గిజ్‌బాట్ బృందం పరిశీలించిన 4జీబి ర్యామ్ వేరియంట్ చాలా స్మూత్‌గా పనిచేస్తోంది. యాప్స్ మధ్య మల్టీటాస్కింగ్ బాగుంది. 20 నిమిషాలు పాటు గేమ్స్ ఆడినప్పటికి హీటింగ్ కనిపించలేదు. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 ఫోన్ 4జీ విత్ VoLTE సపోర్ట్‌తో వస్తోంది. కాబట్టి నిశ్చింతగతా జియో సిమ్‌ను వాడుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి

రెడ్మీ నోట్ 4, Android 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన MIUI 8 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. ఈ ప్లాట్‌ఫామ్ కలర్‌ఫుల్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే. షియోమీ తన రెడ్మీ నోట్ 4 ఫోన్ కోసం సెకండ్ స్పేస్ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్‌లో రెండేసి చొప్పున వాట్సాప్, హైక్ వంటి యాప్స్‌ను రన్ చేసుకోవచ్చు.

ప్రైమరీ కెమెరా విషయానికి వచ్చేసరికి..

ప్రైమరీ కెమెరా విషయానికి వచ్చేసరికి..

రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. f/2.0 aperture, డ్యుయల్ టోన్ ఫ్లాష్ లైట్ వంటి ఫీచర్లను ఈ కెమెరా కలిగి ఉంది. నోట్ 3 ప్రైమరీ కెమెరాతో పోలిస్తే నోట్ 4 కెమెరా బాగున్నప్పటికి కాంట్రాస్ట్ లెవల్స్ అంతగా గొప్పగా లేవు. డేలైట్ కండీషన్ లో ఈ కెమెరాతో చిత్రీకరించిన పలు ఫోటోలు ఓవర్ గా ఎక్స్ పోజ్ అవ్వటమే ఇందుకు కారణం. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లోపించటం, తక్కువ స్ధాయిలో లైట్నిగ్ పనితీరు వంటి అంశాలు రెడ్మీ నోట్ 4 కెమెరాను ప్రధాన అవరోధంగా నిలిచాయి.

ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి

ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి

రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. మంచి లైటింగ్ కండీషన్‌లలో ఈ కెమెరా అద్బుతంగా పనిచేస్తోంది. ఇవి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేయడానికి చాలా బాగుంటాయి.

బ్యాటరీ కెపాసిటీ..

బ్యాటరీ కెపాసిటీ..

బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్, 4100mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. జాగ్రత్తగా వాడుకుంటే రెండు రోజుల పాటు ఈ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఫోన్ హెవీగా వాడటం మొదలు పెడితే ఒక్క రోజులోనే బ్యాటరీ మొత్తం
దిగిపోతుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 4 review: Xiaomi's budget legacy continues. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X