సంగీతా, బిగ్ సీ స్టోర్‌లలో Redmi Note 4 ఫోన్‌లు

Sangeetha, Big C, LOT మొబైల్ స్టోర్‌లలోకి వెళ్లి అడ్వాన్స్‌గా రూ.1000 చెల్లించటం ద్వారా రెడ్మీ నోట్ 4 ఫోన్‌‌ను తమ పేరు మీద ఆర్డర్ చేసుకోవచ్చు.

|

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న Redmi Note 4 స్మార్ట్‌ఫోన్‌లను ఇక పై ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనూ షియోమీ విక్రయించబోతోంది. మార్చి 18 నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. రెడ్మీ నోట్ 4 ఫోన్ జనవరి 19న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఇప్పటి వరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను 10 లక్షల మంది కొనుగోలు చేసినట్లు సమాచారం.

Read More : మరిన్ని Redmi ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్

దేశవ్యాప్తంగా 750 ఆఫ్‌లైన్ స్టోర్‌లలో..

దేశవ్యాప్తంగా 750 ఆఫ్‌లైన్ స్టోర్‌లలో..

దేశవ్యాప్తంగా 750 ఆఫ్‌లైన్ స్టోర్‌లలో రెడ్మీ నోట్ 4 ఫోన్‌లు అందుబాటులో ఉంటాయని షయోమీ ప్రకటించింది. అయితే, ఈ స్టోర్‌లలో 2జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్ వేరియంట్ రెడ్మీ నోట్ 4 ఫోన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ధర రూ.11,499. ఆన్‌లైన్ మార్కెట్లో ఇదే ఫోన్‌ను Flipkart,Mi.comలు రూ.9,999కి విక్రయిస్తున్నాయి.

 

Sangeetha, Big C, LOT మొబైల్ స్టోర్‌లలో...

Sangeetha, Big C, LOT మొబైల్ స్టోర్‌లలో...

ఆఫ్‌లైన్ స్టోర్‌లలో రెడ్మీ నోట్ 4 ఫోన్‌లకు సంబంధించిన ప్రీ-ఆర్డర్లను షియోమీ ఇప్పటికే ప్రారంభించేసింది. మార్చి 21 వరకు ఈ ముందస్తు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్ లను సొంతం చేసుకోవాలనుకునే యూజర్లు తమకు సమీపంలోని Sangeetha, Big C, LOT మొబైల్ స్టోర్‌లలోకి వెళ్లి అడ్వాన్స్‌గా రూ.1000 చెల్లించటం ద్వారా రెడ్మీ నోట్ 4 ఫోన్‌ ను తమ పేరు మీద ఆర్డర్ చేసుకోవచ్చు.

 

45 రోజుల్లో 10 ఫోన్‌లు..
 

45 రోజుల్లో 10 ఫోన్‌లు..

చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ భారత్‌లో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతోంది. ఈ బ్రాండ్ నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Redmi Note 4 సునాయాశంగా 10 లక్షల అమ్మకాలను క్రాస్ చేసింది. కేవలం 45 రోజుల వ్యవధిలోనే ఈ మార్క్‌ను క్రాస్ చేయటం విశేషం. రెడ్మీ నోట్ 4 అమ్మకాలు జనవరి 23, 2017నంచి ఫ్లిప్‌కార్ట్‌లో పారంభమయ్యాయి.

 

మూడు ర్యామ్ వేరియంట్లలో...

మూడు ర్యామ్ వేరియంట్లలో...

మూడు ర్యామ్ వేరియంట్లలో ... షియోమీ ఇండియా తన రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌లను మూడు ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. డార్క్ గ్రే, బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండే రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

 

 రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్...

రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

మోస్ట్ వాంటెడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

మోస్ట్ వాంటెడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్

మోస్ట్ వాంటెడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ 2016కుగాను భారతదేశపు మోస్ట్ వాంటెడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న షియోమీ (Xiaomi) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతేడాది స్మార్ట్‌ఫోన్ అమ్మకాల పై సుమారు 6,700 కోట్ల వరకు ఆదాయాన్ని రాబట్టుకోగలిగిన షియోమీ రానున్న ఐదు సంవత్సరాల్లో భారతదేశపు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించాలని చూస్తోంది.

భారత్‌లోనే తయారీ..

భారత్‌లోనే తయారీ..

భారత్‌లోనే తయారీ.. భారత్‌లో తమ స్మార్ట్‌ఫోన్ సేల్స్ వాల్యుమ్‌ను మరింతగా పెంచుకునేందుకు షియోమీ ఇండియా తన భవిష్యత్ వ్యూహాలకు పొదునుపెడుతోంది. ఈ క్రమంలో ఉత్పాదక సామర్థ్యాలను పెంచుకునేందుకు మరిన్న ఫోన్ తయారీ ఫ్లాంట్‌లను భారత్‌లో నెలకొల్పబోతున్నట్లు షియోమీ ఇండియా అధిపతి మను జైన్ తెలిపారు.

 

Foxconn భాగస్వామ్యంతో...

Foxconn భాగస్వామ్యంతో...

Foxconn కంపెనీ భాగస్వామ్యంతో Xiaomi ఇప్పిటికే ఓ స్మార్ట్‌ఫోన్ తయారీ ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఏర్పాటు చేసుకుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో ఒకటి లేదా రెండు ప్లాంట్‌లను ఫాక్స్‌కాన్ కంపెనీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసుకోబోతున్నట్టు మును జైన్ తెలిపారు.

 

రెడ్మీ నోట్ 3 సూపర్ హిట్..

రెడ్మీ నోట్ 3 సూపర్ హిట్..

షియోమీ కంపెనీ నుంచి గతేడాది లాంచ్ అయిన రెడ్మీ నోట్ 3 ఫోన్ ఎంత హిట్టయ్యిందో మనందరికి తెలుసు. ఈ ఫోన్ లకు కేవలం కేవలం 10 నెలల వ్యవధిలో 36 లక్షల మంది కొనుగోలు చేసారు. షియోమీ గతేడాది తన Mi అలానే Redmi సిరీస్‌ల నుంచి మొత్తం 4 ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

 

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 4 Will be Available Offline from March 18. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X