దూసుకొస్తున్న షియోమి రెడ్‌మి నోట్ 4x

షియోమి నుంచి మరో ఫోన్ దూసుకొస్తోంది. రెడ్‌మి నోట్ 4 రిలీజయిన కొద్ది రోజులకే 4x పేరుతో కంపెనీ మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

By Hazarath
|

షియోమి నుంచి మరో ఫోన్ దూసుకొస్తోంది. రెడ్‌మి నోట్ 4 రిలీజయిన కొద్ది రోజులకే 4x పేరుతో కంపెనీ మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఇమేజ్‌లు లీకయ్యాయి. రానున్న ఈ ఫోన్ గ్రీన్ కలర్ వేరియంట్‌లో వస్తున్నట్లు లీకయిన చిత్రాలు తెలియజేస్తున్నాయి.బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్‌లో రానుంది. రెడ్‌మి నోట్ 4 ఫీచర్లకి కొంచెం అటూ ఇటూగా ఈ ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.

స్టీవ్ జాబ్స్ చివరి కలల ప్రాజెక్ట్..

Redmi Note 4X

ఈ ఫోన్ ఈ రోజు లాంచ్ చేస్తున్నామని ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున అమ్మకాలు మొదలెడతామని కంపెనీ తన సైట్‌లో పొందుపరచింది. ఫీచర్ల విషయానికొస్తే 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే‌తో పాటు 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంది. 2GHz డెకాకోర్ సీపీయుతో పాటు మీడియా టెక్ హీలియో X20 SoCతో వచ్చే అవకాశం ఉంది. అయితే మన ఇండియాలో మాత్రం ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్, అడ్రినో 510 గ్రాఫిక్స్ తో లాంచ్ చేసే అవకాశం ఉంది.

జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌కు మరో ముప్పు

Redmi Note 4X

4జిబి, 2జిబి, 3జిబి ర్యామ్..మూడు రకాల వేరియంట్లలో ఫోన్ రానున్నట్లు తెలుస్తోంది. స్టోరేజ్ విషయానికొస్తే 16 జిబి, 32 జిబి, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో రానుంది.మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 32 జిబి వరకు విస్తరించుకోవచ్చు. 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో పాటు ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ ఉంటాయని కంపెనీ చెబుతోంది.

రూ. 28 వేలకే పిక్సల్ ఫోన్, ఎలాగో తెలుసా..?

Redmi Note 4X

5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాడ్ వైఫై, బ్లూటూత్ 4.2, వంటివి అదనపు ఫీచర్లు. రూ. 12 710 కి వినియోగదారులకు లభ్యమయ్యే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 4X may launch today read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X