22 భారతీయ భాషలతో జియాక్స్ మొబైల్స్

ఇక పై జియాక్స్ ఫోన్‌లలో కీప్యాడ్‌ను 22 అధికారిక భారతీయ భాషల్లోకి మార్చుకుని మెసేజెస్ టైప్ చేసుకోవచ్చు.

|

ప్రాంతీయ భాషల్లో మొబైల్ ఫోన్ ఆపరేటింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ జియాక్స్ మొబైల్ (Ziox Mobile), మరో కంపెనీ Reverie లాంగ్వేజ్ టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జియాక్స్ మొబైల్స్ నుంచి ఇక పై విడుదల కాబోయే అన్ని మొబైల్ ఫోన్‌లలో Reverie అభివృద్ధి చేసిన Indic Phonebook, Keyboard Swalekh Flip అనే రెండు లాంగ్వేజ్ యాప్స్ ఇన్‌బిల్ట్గ్‌గా ఉంటాయి.

 
22 భారతీయ భాషలతో జియాక్స్ మొబైల్స్

Indic Phonebook యాప్ ద్వారా జియాక్స్ కస్టమర్‌లు తమ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ను 11 భాషల్లో చదవొచ్చు, సెర్చ్ చేయవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. ఇండిక్ ఫోన్‌బుక్ యాప్ సపోర్ట్ చేసే భాషలు.. తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, గుజరాతీ, కన్నడం, మళయాళం, ఒడియా, పంజాబీ, అస్సామీస్, ఇంగ్లీష్.

 
22 భారతీయ భాషలతో జియాక్స్ మొబైల్స్

Keyboard Swalekh Flip యాప్ అనేది ద్వారా జియాక్స్ కస్టమర్‌లు తన ఫోన్ కీప్యాడ్‌ను 22 అధికారిక భారతీయ భాషల్లోకి మార్చుకుని మెసేజెస్ టైప్ చేసుకోవచ్చు. కీబోర్డ్ స్వలేఖ్ ఫ్లిప్ యాప్ సపోర్ట్ చేసే భాషలు.. తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, గుజరాతీ, కన్నడం, మళయాళం, ఒడియా, పంజాబీ, అస్సామీస్, నేపాలీ, బోడో, డోగ్రి, కొంకణి, మైథిలి, మణిపురి, సంసృతం, కాశ్మీరీ, సింధీ, శాంతాలీ, ఉర్దూ, ఇంగ్లీష్.

Best Mobiles in India

English summary
Ziox mobile empowers its customer to communicate in 22 Indian Languages Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X