ఇండియాలో ‘బోస్’ కొత్త స్పీకర్లు!!

Bose launches speaker systems priced up to Rs 1.8 lakh

 

న్యూఢిల్లీ: రెండు కొత్త స్పీకర్ సిస్టమ్స్‌ను బోస్ కంపెనీ బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెండు స్పీకర్ సిస్టమ్స్ – సినిమేట్ 1 ఎస్‌ఆర్(ధర రూ.1,12,388), లైఫ్ స్టైల్ 135(రూ.1,79,882) వారం రోజుల్లో బోస్ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ తెలిపింది. ఏఎం/ఎఫ్‌ఎం ట్యూనర్, ఐపాడ్/ఐఫోన్‌ల కోసం డాక్, 6 హెచ్‌డీ సోర్సెస్ వరకూ మీడియా కన్సోల్ వంటి ఫీచర్లున్నాయని పేర్కొంది. ఈ స్పీకర్లు 6సెం.మీ. ఎత్తు, 93.4 సెం.మీ. వెడల్పు ఉంటాయని తెలిపింది. కంపెనీకి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, బెంగళూరు, చంఢీఘర్, జైపూర్, తదితర నగరాల్లో 31 స్టోర్లు ఉన్నాయి.

Related Posts Plugin for WordPress, Blogger...