
లండన్: మ్యూజిక్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేసే రోబోట్ శాస్త్రవేత్తలు సృష్టించారు. పేరు ‘షిమీ’.ఈ రోబోలో అమర్చిన చెవుల్లాంటి స్పీకర్లు మ్యూజిక్‌ను చురుగ్గా గ్రహించి, అందుకు అనుగుణంగా రోబోతో స్టెప్పులేయిస్తాయి. చూడటానికి అత్యాధునిక టైబుల్ లైట్ ఆకారంలో దర్శనమిచ్చే ఈ మర యంత్రం అయిదురకాల మోటర్లతో పనిచేస్తుంది. దీని కదలికలన్నింటిని ఈ మోటర్లే నియంత్రిస్తాయి. ఇందులో అమర్చి ఉండే మైక్రోఫోన్‌కు మనమాటలు అర్థమవుతాయి. బ్రేక్, డిస్కో, ర్యాప్, పాప్, తీన్‌మార్.. ఇలా మీరు ఏ సంగీతం వినిపించితే దానికి అనుగుణంగా షిమీ స్పందిస్తుంది. జార్జియా టెక్నాలజీ పరిశోధకులు ఈ రోబోను డిజైన్ చేశారు.






























