గాలి సంగీతాన్ని అందించే పయనీర్ మ్యూజిక్ సిస్టమ్స్

By Super
|
Airplay Music
మ్యూజిక్ అంటే కొంత మంది యువతకు ప్రాణం. అలాంటి యువత కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ ఉత్పత్తులను తయారు చేసేటటువంటి సంస్దలు ప్రతి సంవత్సరం మార్కెట్లోకి కొత్త కొత్త టెక్నాలజీతో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన iHome iW1మ్యూజిక్ సిస్టమ్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మ్యూజిక్ ప్రియుల ఆసక్తిని తనవైపుకి మరల్చుకునే ఉద్దేశ్యంతో పయనీర్ కొత్త టెక్నాలజీతో డుయో స్లిమ్‌లైన్ వైర్ లెస్ ఎయిర్ ప్లే మల్టీ రూమ్ సిస్టమ్స్‌ని X-SMC3-K and X-SMC5-K పేరుతో మార్కెట్లోకి విడుదల చేశాయి.

గతంలో పయనీర్ సంస్ద ఆపిల్ ఉత్పత్తులను కూడా ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. పయనీర్ విడుదల చేసిన కొత్త మ్యూజిక్ సిస్టమ్ అత్యాధునిక ఫీచర్స్‌ని కలిగి ఉండడమే కాకుండా వై-పై కంపాటబులిటీతో పాటు, డిఎల్‌ఎన్ఎ కనెక్టివిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. దీనితోపాటు VTuner Internet Radio and Bluetooth streamingని కూడా సపోర్ట్ చేస్తుంది. టాప్ మోడల్ అయిన X-SMC5-K సిస్టమ్‌లో డివిడి ప్లేయర్‌తో పాటు HD TVకి కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా HDMI outని ఇవ్వడం జరిగింది.

పయనీర్ ఎయిర్ ప్లే సిస్టమ్స్‌లో ఉన్న రెండు ఛానల్ డిజిటల్ ఆంప్లిప్లయర్ వల్ల ఇందులోనుండి వచ్చేటటువంటి మ్యూజిక్ కస్టమర్స్‌ని రాక్ చేసేవిధంగా ఉంటుంది.ఇందులో ఉన్న రెండు ఆంప్లిప్లయర్స్ కూడా డ్యూయల్ పుల్ రేంజి డ్రైవర్స్ అయిన 2X 20W RMS అవుట్ పుట్‌ని కలిగి ఉన్నాయి.కస్టమర్స్ ప్రస్తుతం ఏ ట్రాక్/మీడియా వినిపిస్తుందో అనేదానిని చూపించేందుకు వీలుగా ఇందులో 2.5 ఇంచ్ స్లీక్ ఎల్‌సిడి పుల్ కలర్ డిస్ ప్లేని ఏర్పాటు చేయడం జరిగింది. పయనీర్ మ్యూజిక్ సిస్టమ్స్ కస్టమర్స్‌కు కేవలం ఒక్క వారంటీ విషయంలో మాత్రమే నిరాశకు గురి చేస్తుంది. అందుకు కారణం అన్ని కంపెనీలు కూడా రెండు సంవత్సరాలు వారంటీ ఇస్తుంటే పయనీర్ మాత్రం కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే అందిస్తుంది.

ఎఫ్‌ఎమ్ రేడియో, ఇంటర్నెట్ రేడియోలను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక X-SMC3-K విషయానికి వస్తే ఇందులో నాలుగు పాసివ్ రేడియేటర్స్‌ని అమర్చగా, అదే X-SMC5-Kలో మాత్రం రెండు పాసివ్ రేడియేటర్స్‌ని పొందుపరచడం జరిగింది. పయనీర్ X-SMC5-K and the X-SMC3-K వైర్ లెస్ ఎయిర్ ప్లే సౌండ్ సిస్టమ్స్ చుట్టుకొలతలు 520.4 x 218.3 x 155.6గా కలిగి ఉన్నాయి. X-SMC5-K సిస్టమ్ బరువు 2 కేజిలు ఉండగా, అదే X-SMC3-K బరువు 3.6 కేజీలుగా రూపొందించబడింది.

రెండు సౌండ్ సిస్టమ్స్ కూడా రిమోట్‌ కంట్రోల్‌తో చక్కగా పని చేస్తున్నాయి. ఈ సౌండ్ సిస్టమ్స్‌ని వాడే యూజర్స్ మ్యూజిక్‌ని ఎడిట్ చేసుకొవడంతో పాటు డిస్ ప్లే సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. యూజర్స్ హెడ్ ఫోన్స్ ద్వారా చక్కని అనుభూతిని పోందేందుకు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. పయనీర్ ఎయిర్ ప్లే మ్యూజిక్ సిస్టమ్స్ అక్టోబర్ మాసంలో మార్కెట్లో అమ్మకానికి రానున్నాయి. ఇండియన్ మార్కెట్లో పయనీర్ X-SMC3-K ధర సుమారుగా రూ 19,500 ఉండగా, అదే పయనీర్ X-SMC5-K మ్యూజిక్ సిస్టమ్ ధర సుమారుగా రూ 22,000 వరకు ఉండవచ్చునని అంచనా..

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X