‘సోని’ మీడియా ప్లేయర్.. అనుభూతుల విందు!!!

By Nageswara Rao
|
 Sony NWZ-A866
ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాన్ని మరింత చేరువ చేసిన పోర్టుబల్ మీడియా ప్లేయర్  విప్లవం నలు దిశలా పాకింది. ‘వాక్ మెన్’ను పరిచయం చేసిన సోని ( Sony) మీడియా ప్లేయర్ రంగంలో క్రీయాశీలక మార్పులకు ఆజ్యం పోసింది. ఈ రంగంలో తన సామర్ధ్యాన్ని క్రమేపీ  విస్తరించుకుంటూ ముందుకు సాగుతున్న సొగసరి బ్రాండ్ ‘సోని’ పాకెట్ సైజ్ మీడియా ప్లేయర్‌ను డిజైన్ చేసింది. ‘సోని NWZ-A866’గా విడుదలవుతున్న  ఈ ఎంటర్‌టైన్‌మెంట్ డివైజ్ సౌకర్యవంతమైన ఆడియో, వీడియో అనుభూతులను శ్రోతకు కలిగిస్తుంది. ఈ డివైజ్ సౌలభ్యతతో ఫుల్ లెంగ్త్ సినిమాలను మన్నికైన విజువల్ అనుభూతితో  తిలకించవచ్చు.  సంగీతాన్ని వినసొంపైన బాణిలో ఆస్వాదించవచ్చు.

‘సోని NWZ-A866’ ముఖ్య ఫీచర్లు:

*   32జీబి ఇంటర్నల్ మెమరీ,

* MP3, WAV,AAC,WMV ఫార్మాట్లలోని  ఆడియో ఫైళ్లను ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది,

* MPEG4, WMV ఫార్మాట్లలని వీడియో ఫైళ్లను ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది,

* 2.8 అంగుళాల డిస్‌ప్లే,

*   టచ్ స్ర్కీన్,

*  మీడియా ఫైళ్లను  వేగవంతంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ‘సోని మీడియా గో’ సాఫ్ట్‌వేర్‌ను  డివైజ్‌లో నిక్షిప్తం చేశారు,

*  మరిన్ని ఉపయుక్తవమైన ఫీచర్లను  డివైజ్‌లో లోడ్ చేశారు, ధర రూ.15,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X