ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

|

గూగుల్ తన లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్' ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌ను సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌ను అన్‌లాక్ చేయవల్సిన పని ఉండదు. స్ర్కీన్ లాక్ అయి ఉన్నప్పుడు ఏవైనా నోటిఫికిషేన్స్ వస్తే వాటిని సౌకర్యవంతంగా తెరిచి చూసుకోవచ్చు.

ఇంకా చదవండి: మీ గాడ్జెట్‌లను క్లీన్ చేసుకునేందుకు 10 బెస్ట్ చిట్కాలు

ఫ్లాష్ లైట్, హాట్ స్పాట్, స్ర్కీన్ రొటేషన్ వంటి కంట్రోల్స్‌ను ఈ ఓఎస్ కలిగి ఉంది. 512 ఎంబి ర్యామ్ పై స్పందించే ఫోన్‌లను కూడా ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లు మొదలకుని, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌టీవీల వరకు అన్ని ఆండ్రాయిడ్ ఆధారిత డివైస్‌లను ఈ కొత్త ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ లాలీపాప్ లోని 10 కూలెస్ట్ ఫీచర్లను ఇప్పుడు చూద్దాం..

 ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్ విండోస్ తరహాలోనే గెస్ట్ యూజర్ మోడ్‌ను ప్రవేశపెట్టింది. గెస్ట్‌ యూజర్‌ మోడ్‌‌ను ఉపయోగించటం ద్వారా ఫోన్‌ను ఎక్కువ మంది యూజర్లు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా, మీ ఫోన్‌లోని సమాచారాన్ని ఇతరులు ఎంత వరకు వీక్షించాలో కూడా నిర్ధేశించుకోవచ్చు. మీ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లో కొత్త గెస్ట్‌ను జత చేసుకునేందుకు సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి - యూజర్స్ - యాడ్ గెస్ట్‌లోకి వెళ్లండి.

 ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

Trusted Places పేరుతో సరికొత్త స్మార్ట్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్ కలిగి ఉంది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్‌లో ముఖ్యమైన సమాచారాన్ని స్టోర్ చేసిన లోకేషన్‌లను ఎవరికంటాపడకుండా సురిక్షితంగా ఉంచుకోవచ్చు. Trusted Places ఫీచర్‌లో భాగంగా లొకేషన్‌ను సెట్ చేసుకునేందుకు సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీ ఆప్షన్‌లోకి ప్రవేశించి స్మార్ట్‌లాక్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.

 ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు
 
ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

 బరస్ట్ మోడ్ పేరుతో ప్రత్యేకమైన ఫీచర్‌ను ఈ ఓఎస్‌లో ఏర్పాటు చేసారు. అంటే కెమెరా బటన్‌ను ప్రెస్ చేసి ఉంచినంత సేపూ ఫోటోలను చిత్రీకరిస్తూనే ఉంటుంది.

 ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

భిన్నమైన నోటిఫికేషన్ ప్యానల్‌ను డిజైన్ చేసారు. ఈ సరికొత్త నోటిఫికేషన్ ఫీచర్ ద్వారా ఫోన్ స్ర్కీన్ లాక్ చేసి ఉన్నప్పటికి వివరణాత్మక నోటిఫికేషన్లను తెర పై చూడొచ్చు. పని ప్రాంగణాల్లో ఈ ఫీచర్ ఇబ్బంది అనుకుంటే Settingsలోని Sound and Notificationలోకి ప్రవేశించి When device is Locked - Don't show notifications at allను సెలక్ట్ చేసుకుంటే లాక్ చేసి ఉన్న మీ ఫోన్ స్ర్కీన్ ఏ విధమైన స్పెసిఫికేషన్‌లు కనిపించవు.

 ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లో యాహూ! లేదా ఇతర మెయిల్ సర్వీసులను జీమెయిల్‌కు కాన్ఫిగర్ చేసుకోవాలంటే ముందుగా జీమెయిల్ యాప్‌ను ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి Add accountను ఓపెన్  చేసినట్లయితే Google, IMAP/POP3 services పేర్లతో రెండు ఆప్షన్లు కనిపిస్తాయి వాటిలో రెండవ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా ఇతర ఈమెయిల్ సర్వీసులను జీమెయిల్‌కు కాన్ఫిగర్ చేసుకోవచ్చు.

 ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేకమైన టెక్నాలజీ ఫోన్ బ్యాటరీ మార్పులకు సంబంధించి ఓ నిర్థిష్టమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ‘ఫోన్‌లో మిగిలి ఉన్న బ్యాటరీ చార్జింగ్ ఎంత సేపు వస్తుంది'. ‘బ్యాటరీ చార్జ్ అవటానికి ఎంత టైమ్ పడుతుంది', తదితర బ్యాటరీ సంబంధిత సమచారాన్ని మీ ఫోన్ హోమ్ స్ర్కీన్ పై చూసుకోవచ్చు. ఈ సౌకర్యం ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌లో లోపించింది.

 ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ డివైస్‌లో కొత్త క్యాలెండర్ యాప్ వెనుక భాగంలో సీజనల్ బ్యాక్ డ్రాప్‌లను ఆఫ్ చేయాలనుకుంటే యాప్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి బ్యాక్‌డ్రాప్‌ను టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు.

 ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

లాలీపాప్ ఓఎస్‌ను కలిగి ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్‌‌ను రీబూట్ చేసినప్పటికి బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ ఫోన్‌లో సురక్షితంగా ఉంటాయి.

 ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

 ఆండ్రాయిడ్ లాలీపాప్ డివైస్‌లో ప్లే అయ్యే సినిమాలు 5.1 సౌండ్ ట్రాక్‌లను సపోర్ట్ చేస్తాయి. ఈ ఫీచర్‌ను ఆన్ చేసుకునేందుకు ఫోన్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి Enable Surround Soundను సెలక్ట్ చేసుకుంటే చాలు.

 ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్‌లోని 10 కూలెస్ట్ ఫీచర్లు

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లో డిస్‌ప్లేను ఆన్ చేయవల్సి వస్తే ఫోన్ వవర్ బటన్ దగ్గరకు వెళ్లవల్సిన అవసరం లేదు. డిస్‌ప్లే పై రెండుసార్లు టాప్ చేస్తే చాలు ఫోన్ ఆన్ అవుతుంది

Best Mobiles in India

English summary
10 Coolest Facts About Android 5.0 Lollipop. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X