తేజస్ యుద్ధ విమానాలు వచ్చేసాయ్!

|

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిన తేజస్ యుద్ధ విమానాలు ఏళ్ల నిరీక్షణ తరువాత భారత వైమానిక దళ అమ్ములపొదలోకి చేరాయి. బెంగుళూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రెండు తేలికపాటి తేజస్ యుద్ధవిమానాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి అడుగు పెట్టాయి. వీటిని మొదటి రెండు సంవత్సరాల పాటు బెంగుళూరులో వినియోగిస్తారు.

తేజస్ యుద్ధ విమానాలు వచ్చేసాయ్!

ఆ తరువాత తమిళనాడులోని సులుర్‌కు తరలిస్తారు. ఈ తేజస్ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెట్(హెచ్ఏఎల్) అభివృద్ధి చేసింది. వీటిని ఫ్లయింగ్ డ్యాగర్స్‌గా పిలుస్తున్నారు. ఆధునిక స్పెసిఫికేషన్‌లతో కూడిన మరో 80 తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను భవిష్యత్‌లో సమకూర్చుకోవాలని భారత వైమానిక దళం భావిస్తోంది. తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సంబంధించి 10 ఆసక్తికర వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : ఓపెన్ సేల్ పై Lenovo Vibe K5

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

స్వదేశీ పరిజ్ఞానంతో ఎయిర్‌క్రాప్ట్‌లను తయారు చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చిన భారత ప్రభుత్వం తొలిసారిగా 1984లో ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీని ప్రారంభించింది.

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

స్వదేశీ పరిజ్ఞానంతో ఎయిర్‌క్రాప్ట్‌లను తయారు చేసుకునేందుకు నెలకొల్పిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ కోసం కేంద్ర ప్రభుత్వం 1986లో 575 కోట్ల నిధులను మంజూరు చేసింది.

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

2001, జనవరి 4న భారతదేశపు మొట్టమొదటి లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ గగనతళంలోకి దూసుకువెళ్లింది. అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కు తేజస్‌గా నామకరణం చేసారు.

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు
 
తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

భారత వైమానిక దళం దగ్గర అప్పటికే అందుబాటులో ఉన్న రష్యన్ మిగ్ - 21 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఫేలవమైన పనితీరుతో అనేక ప్రమాదాలకు కారణం కావటంతో తేజస్ ఎయిర్‌క్రాప్ట్‌ల ఆవశ్యకత అత్యవసరమైంది.

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

తేజాస్ ఎయిర్‌క్రాఫ్ట్.. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, ఎయిర్ టు సర్‌ఫేస్ మిసైల్స్, యాంటీ షిప్ మిసైల్స్, బాంబ్స్ ఇంకా రాకెట్లను హ్యాండిల్ చేయగలదు.

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

తేజాస్ ఎయిర్‌క్రాఫ్ట్ నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే 42శాతం కార్బన్ ఫైబర్, 43% అల్యూమినియం అలాయ్ మిగిలినది టైటానియమ్ అలాయ్‌తో కంపోజ్ కాబడి ఉంటుంది.

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అలానే నావికా దళ అవసరాల నిమిత్తం తేజాస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సింగిల్ సీట్ ఫైటర్ అలానే ట్విన్ సీట్ ట్రెయినర్ వేరియంట్‌లలో అభివృద్థి చేసారు.

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

ఈ ఏడాది ఆరంభంలో తేజాస్ ఎయిర్‌క్రాఫ్ట్ మొట్టమొదటి సారిగా బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో 2016లో పాల్గొంది.

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

తేజాస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను లైటెస్ట్ మల్టీ రోల్ సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్‌గా అభివర్ణిస్తారు.

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు

తేజాస్ ఎయిర్‌క్రాఫ్ట్ గంటకు 2,205 కిలోమీటర్ల గరిష్టవేగంతో ప్రయాణం చేయగలదు.

Best Mobiles in India

English summary
10 facts you probably didn’t know about the newly inducted Tejas LCA. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X