జియో మరో సంచలనం : త్వరలో జియో స్మార్ట్ కార్..

జియో నుంచి సంచలనం రేపబోయే ఫీచర్ ఏదైనా ఉందంటే అది ఇదే కావచ్చు. మీరు మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే కారును కంట్రోల్ చేసే విధంగా ముందు ముందు టెక్నాలజీని జియో తీసుకురాబోతోంది.

By Hazarath
|

ఉచితం అన్న ఒకే ఒక పదంతో దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న జియో త్వరలో మరిన్ని ఆలోచనలతో కష్టమర్ల ముందుకు రానుంది.అతి త్వరలోనే ఈ ప్లాన్లను కష్టమర్ల దగ్గరకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెల్కో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న జియో త్వరలో తీసుకురానున్న ఆలోచనలు ఇంకాస్త ఆందోళనకు గురిచేసినా ఆశ్చర్యపోనవసరం లేదని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జియో నుంచి రానున్న ప్లాన్లు ఏంటో ఓ సారి చూద్దాం.

జియో మళ్లీ షాకిచ్చింది, రూ. 185కే డీటీహెచ్‌ సర్వీస్

జియో స్మార్ట్ కార్

జియో స్మార్ట్ కార్

జియో నుంచి సంచలనం రేపబోయే ఫీచర్ ఏదైనా ఉందంటే అది ఇదే కావచ్చు. మీరు మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే కారును కంట్రోల్ చేసే విధంగా ముందు ముందు టెక్నాలజీని జియో తీసుకురాబోతోంది. జియో ఫై ఫీచర్ తో మీరు మీ కారుకి OBD (on-board diagnostic) ద్వారా కనెక్ట్ కావచ్చు. జియో కారు కనెక్ట్ యాప్ నుంచి మీ ఫోన్ తోనే కారును కంట్రోల్ చేయవచ్చు. దీన్ని మీరు ఆర్డినరీ కార్లైన మారుతి, సుజుకీ, స్విప్ట్, రెనాల్ట్ క్విడ్ కార్లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చని జియో చెబుతోంది.

జియో మనీ

జియో మనీ

ఈ ఫీచర్ త్వరలోనే వినియోగదారుల ముందుకు జియో తీసుకురానుంది. దీని ద్వారా మీరు పేమెంట్ చెల్లింపులు జరుపుకోవచ్చు. పేటీఎమ్ లో ఎలా చెల్లింపులు జరుగుతున్నాయో అలానే జియో మనీ కూడా పనిచేస్తుంది. క్యాష్ తో పనిలేకుండా మొత్తం ఆన్ లైన్ లోనే జరిగే విధంగా ఇది రానుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాయిస్ ఓవర్ వైఫై
 

వాయిస్ ఓవర్ వైఫై

మీరు ట్రావెలింగ్ లో కూడా కాల్స్ చేసుకునే విధంగా జియో వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. స్కైప్ తరహాలో మీరు వాయిస్ ఓవర్ కాలింగ్ ను కైవలం వైపై ద్వారా చేసుకోవచ్చు. ఇది ఏ నెట్ వర్క్ కైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చని జియో చెబుతోంది.

జియో ఫై వైఫై

జియో ఫై వైఫై

మీరు జియో సిమ్ తీసుకోకుండానే జియో నెట్ ఆస్వాదించాలనుకుంటే మీకు జియో త్వరలో ఓ సదుపాయాన్ని కల్పించబోతోంది. జియో ఫై ద్వారా మీరు జియో నెట్ ని ఏ సిమ్ కైనా వాడుకోవచ్చు. ఈ మేరకు జియో రంగం సిద్ధం చేస్తోంది. మీకు ఓటీపీ పాస్ వర్డ్ యాక్సస్ చెయడం ద్వారా జియో ఫై కనెక్ట్ అవుతుందని జియో చెబుతోంది.

జియో స్మార్ట్ హోమ్

జియో స్మార్ట్ హోమ్

జియో త్వరలో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ తో ఇకపై ఇల్లు మొత్తం స్మార్ట్ మయం కానుంది. అన్నింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ అందే విధంగా దీన్ని బయటకు తెచ్చేందుకు జియో ప్రయత్నాలు చేస్తోంది.

డిజిటల్ విప్లవం వైపు పరుగులు

డిజిటల్ విప్లవం వైపు పరుగులు

జియో 4జీతో దేశం మొత్తం ఇప్పుడు డిజిటల్ విప్లవం వైపు పరుగులు పెడుతోంది. అంతా టెక్నాలజీమయమైపోయింది. మరి రానున్న కాలంలో జియో నుంచి ఇంకా ఏం అద్భుతాలు వస్తాయో ముందు ముందు చూడాలి.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
5 Things That Reliance Jio Could Announce Soon in India read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X