మోటరోలా ఫోన్‌లకు కొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్

|

ఆండ్రాయిడ్ 5.0 lollipop ఆపరేటింగ్ సిస్టంకు అప్‌డేటెడ్ వర్షన్‌గా ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఓఎస్‌ను గూగుల్ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోటరోలా, భారత్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 6 మోటో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు కొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్‌ను ప్రకటించింది.

Read More : Google.comను రూ.785కు కొనేసాడు..!

Marshmallow అప్‌డేట్‌ను అందుకునే ఫోన్‌లలో మోటో ఎక్స్ ప్లే, మోటో టర్బో , మోటో జీ (3వ జనరేషన్), మోటో జీ (సెకండ్ జనరేషన్), మోటో ఎక్స్ (సెకండ్ జనరేషన్)లు ఉన్నాయి. త్వరలో విడుదల కాబోతున్న మోటో ఎక్స్ స్టైల్ స్మార్ట్‌ఫోన్ కూడా ఈ కొత్త అప్‌డేట్‌ను అందుకోనుంది.

Read More : రూ.10,000 బడ్జెట్‌లో మీకు నచ్చే ఫోన్‌లు

అక్టోబర్‌లోనే ఈ అప్‌డేట్ ఉంటుందని మోటరోలా పేర్కొంది. ఎప్పుడనేది వెల్లడించలేదు. Android 6.0 Marshmallow అప్ డేట్ లో భాగంగా యూజర్లు యాప్ పర్మిషన్స్, Doze మోడ్, గూగుల్ నౌ ఆన్ Tap, సింపుల్ వాల్యుమ్ కంట్రోల్స్ తదితర కొత్త ఫీచర్లను ఆస్వాదించవచ్చు.

మోటరోలా మోటో ఎక్స్ ప్లే

మోటరోలా మోటో ఎక్స్ ప్లే

స్పెసిఫికేషన్‌లు:

5.5 అంగుళాల డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ 16జీబి /32జీబి, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా ఎఫ్/2.0 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై 802.11 ఏ/జీ/బీ/ఎన్ (డ్యుయల్ బ్యాండ్), బ్లూటూత్ 4.0 జీపీఎస్), 3630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 మోటో ఎక్స్ స్టైల్

మోటో ఎక్స్ స్టైల్

స్పెసిఫికేషన్‌లు

మోటరోలా ఎక్స్8 మొబైల్ కంప్యూటింగ్ సిస్టం, వాటర్ రిపిల్లెంట్ కోటింగ్, 5.7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 440×2560పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8గిగాహెర్ట్జ్ హెక్సా-కోర్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్, అడ్రినో 418 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ 16జీబి /32జీబి/64జీబి, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్2.0 అపెర్చర్, 4కే వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (87 డిగ్రీల వైడ్-యాంగిల్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్ 2.0 అపెర్చర్, 1.4 అల్ట్రా మెగా పిక్సల్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మోటో టర్బో

మోటో టర్బో

స్పెసిఫికేషన్‌లు:

5.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440x2560పిక్సల్స్, 565 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.7గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ మెమరీ, బాలిస్టిక్ నైలాన్ డిజైనింగ్, వాటర్ రిపిల్లెంట్ నానో కోటింగ్, 21 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే (3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ), 3900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (48 గంటల బ్యాటరీ బ్యాకప్). ఈ స్మార్ట్‌ఫోన్‌లో పొందుపరిచిన టర్బో చార్జింగ్ ఫీచర్ 15 నిమిషాల్లో 8 గంటల బ్యాటరీ పవర్‌ను సమకూరుస్తుంది.

 

మోటో జీ3

మోటో జీ3

మోటో జీ3

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ 64 బిట్ స్నాప్ డ్రాగన్ 410 (ఎంఎస్ఎమ్ 8916) ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఆర్ ఫిల్టర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

మోటో ఎక్స్ (సెకండ్ జనరేషన్)

మోటో ఎక్స్ (సెకండ్ జనరేషన్)

మోటో ఎక్స్ (సెకండ్ జనరేషన్)

5.2 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, అడ్రినో 330 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎఫ్/2.25లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

సెకండ్ జనరేషన్ మోటో జీ

సెకండ్ జనరేషన్ మోటో జీ

సెకండ్ జనరేషన్ మోటో జీ

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
6 Motorola smartphones in India set for Android 6.0 Marshmallow update. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X