షాక్.. OnePlus 3 రిపేర్ ఖర్చు రూ.48,000

వన్‌ప్లస్ 3 ఓనర్ Aklank Jainకు ఫోన్‌ రేపేరింగ్ విషయంలో ఊహించని షాక్ ఎదురైంది. ఫోన్ కొన్నది రూ.28,000కే అయితే రిపేర్ బిల్లు రూ.48000 వచ్చింది.

|

ఫోన్ కింద పడటమనేది ఓ పీడకల లాంటిది. క్రిందపడిన ఫోన్‌లలో దాదాపుగా 60 నుంచి 70 శాతం ఫోన్‌లు ఎందుకు పనికిరాకుండా పోతాయి. వీటిని రిపేర్ చేయించుకోవటం కంటే కొత్త ఫోన్ కొనుక్కోవటం మేలు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకునే కథలా మాత్రం ఫైనల్ ట్విస్ట్ అలా ఇలా ఉండదు. వన్‌ప్లస్ 3 ఓనర్ Aklank Jainకు ఫోన్‌ రేపేరింగ్ విషయంలో ఊహించని షాక్ ఎదురైంది. వివరాల్లోకి వెళితే...

షాక్.. OnePlus 3 రిపేర్ ఖర్చు రూ.48,000

Aklank Jain వినియోగిస్తోన్న వన్‌ప్లస్ 3 స్మార్ట్‌ఫోన్‌ పై ఆఫీసులో ప్రమాదవశాత్తూ నీళ్లు ఒలికాయి. దీంతో ఫోన్ టర్నాఫ్ అయ్యింది. ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికి ఫోన్ రీస్టార్ట్ అవ్వకపోవటంతో Servify అనే ఆన్‌లైన్ రిపేరింగ్ సర్వీసును జెయిన్ ఆశ్రయించారు. కొద్ది రోజుల తరువాత Servify ప్రతినిధుల నుంచి జెయిన్‌కు మెయిల్స్ అందాయి, ఫోన్ రిపేరింగ్ నిమిత్తం మీరు క్లెయిమ్ చేసుకున్న రూ.6000 ఇన్సూరెన్స్ కంటే రిపేరింగ్ ఛార్జ్ ఎక్కువవుతుందని తెలిపారు.

షాక్.. OnePlus 3 రిపేర్ ఖర్చు రూ.48,000

ఫోన్ రిపేరింగ్ నిమిత్తం మొత్తం రూ.48,030 ఖర్చవుతుందని వారు ఎస్టిమేట్ ఇవ్వటంతో జెయిన్ ఒక్కసారిగా షాకయ్యారు. వాస్తవానికి జెయిన్ ఈ ఫోన్‌ను రూ.28,000 పెట్టి కొనుగోలు చేసారు. రిపేర్ బిల్లును చూసి ఒక్కసారిగా బిత్తరపోయిన జెయిన్ తన సమస్యకు పరిష్కారం చూపాలంటూ వన్‌ప్లస్‌కు వివిధ ఛానల్స్ ద్వారా ఫిర్యాదు చేసారు. వన్‌ప్లస్‌ కంపెనీ ఈ ఘటన పై విచారణ జరిపితేగానీ వాస్తవాలు వెలుగులోకిరావు.

Best Mobiles in India

English summary
A OnePlus 3 Owner Was Charged A Bill Of Rs 48,000 To Repair His Water-Damaged Smartphone!. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X