తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు

దేశంలోనే తొలిసారిగా రాజస్థాన్ లో పైలెట్ సర్వీసుల్ని ప్రారంభించిన ఎయిర్‌టెల్ ఇప్పుడు తన సేవలను దక్షిణాది రాష్ట్రలుకు విస్తరిస్తోంది.

By Hazarath
|

దేశంలోనే తొలిసారిగా రాజస్థాన్ లో పైలెట్ సర్వీసుల్ని ప్రారంభించిన ఎయిర్‌టెల్ ఇప్పుడు తన సేవలను దక్షిణాది రాష్ట్రలుకు విస్తరిస్తోంది. వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో తమ సర్వీసుల్ని మొదలుపెడతామని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఈఓ శశి అరోరా చెప్పారు.

మార్చి తర్వాత మరో రెండు నెలలు పొడిగింపు ?

airtel

ఈ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రజలకు బ్యాంకింగ్ ప్రయోజనాల్ని కల్పిస్తామని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిపి 20,000 రిటైల్ అవుట్లెట్స్ ఏర్పాటు చేస్తామని, కర్ణాటకలో 15,000 వరకూ అవుట్లెట్స్ నెలకొల్పుతామని ఆయన వివరించారు. ఈ అవుట్లెట్స్ ద్వారా నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్ తదితర బ్యాంకింగ్ సర్వీసుల్ని పొందవచ్చని ఆయన తెలిపారు.

అకౌంట్లు హ్యాక్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు : మాల్యా

airtel

మరికొద్దివారాల్లో దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సర్వీసుల్ని ప్రారంభిస్తామన్నారు. రాజస్తాన్లో పైలట్స్ సర్వీసులకు శ్రీకారం చుట్టిన తర్వాత పక్షం రోజుల్లో లక్ష వరకూ సేవింగ్స్ ఖాతాల్ని ఖాతాదారులు తెరిచినట్లు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ప్రకటన తెలిపింది.

జియోకి కౌంటర్, మేము ఫ్రీ కాల్స్ ఇస్తాం !

ఇందులో దాదాపు 70 శాతం ఖాతాలు గ్రామీణ ప్రాంతాల్లోనే తెరిచినట్లు బ్యాంక్ తెలిపింది. ఆ రాష్ట్రంలో 10,000 రిటైల్ అవుట్లెట్స్ను నెలకొల్పింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
After Rajasthan, Airtel Payments Bank set to extend pilot to southern states read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X