ఎయిర్‌టెల్‌కి జియో దిమ్మతిరిగే షాక్ !

జియో ఫిర్యాదుతో ఎయిర్‌టెల్‌కి పెద్ద ఎదురుదెబ్బనే తగిలింది.

By Hazarath
|

జియో ఫిర్యాదుతో ఎయిర్‌టెల్‌కి పెద్ద ఎదురుదెబ్బనే తగిలింది. ఎయిర్‌టెల్‌ నిర్వహిస్తున్న ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ ప్రమోషనల్ క్యాంపెయిన్ ప్రచారాన్ని ఆపివేయాలని దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ను వ్యాపార ప్రకటనల వాచ్ డాగ్ ఆదేశించింది. రిలయన్స్ జియో ఫిర్యాదుతో ఎయిర్‌టెల్‌కు అడ్వర్ టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్‌సీఐ) ఈ ఆదేశాలు జారీచేసింది.

 

ఫేస్‌బుక్‌లో ఫేక్ పోస్ట్ పెట్టినందుకు రూ. 3కోట్లు జరిమానా

ప్రమోషనల్ క్యాంపెయిన్ ప్రచారాన్ని

ప్రమోషనల్ క్యాంపెయిన్ ప్రచారాన్ని

2017 ఏప్రిల్ 11 వరకు టీవీ కమర్షియల్‌లలో, వెబ్‌సైట్ అడ్వర్‌టైజ్‌మెంట్లో ప్రమోషనల్ క్యాంపెయిన్ ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని లేదా తగిన విధంగా సవరించుకోవాలని ఎయిర్‌టెల్‌కు ఏఎస్‌సీఐ సూచించింది.

సరైన ఆధారాలేమీ లేవని

సరైన ఆధారాలేమీ లేవని

ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ అత్యంత వేగవంతమైనదంటూ కన్సల్టెన్సీ సంస్థ ఊక్లా ఇచ్చిన సర్టిఫికెట్‌కు ఊతంగా సరైన ఆధారాలేమీ లేవని ఆస్కీ ఫాస్ట్‌ ట్రాక్‌ కంప్లయింట్స్‌ కమిటీ (ఎఫ్‌టీసీసీ) అభిప్రాయపడింది.

ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ ' గా

ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ ' గా

బ్రాడ్ బ్యాండ్ టెస్టర్ ఊక్లా ఎయిర్‌టెల్‌ను దేశంలోనే 'ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ ' గా డిక్లేర్ చేసింది. కానీ ఊక్లా టెస్టింగ్ ను తప్పుబడుతూ జియో, ఏఎస్‌సీఐను ఆశ్రయించింది.

జియో ఇన్ఫోకామ్‌ ఫిర్యాదును
 

జియో ఇన్ఫోకామ్‌ ఫిర్యాదును

ఎయిర్‌టెల్‌ ప్రకటనలపై రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఫిర్యాదును సమర్ధిస్తూ ఎఫ్‌టీసీసీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఎయిర్‌టెల్‌ ప్రకటనలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది.

తాము ఆమోదించేది లేదని..

తాము ఆమోదించేది లేదని..

అయితే ఏఎస్‌సీఐ నిర్ణయాన్ని తాము ఆమోదించేది లేదని, నిబంధనల ప్రకారమే తాము దీన్ని వాడుకుంటున్నట్టు అప్పీల్ దాఖలు చేస్తామని ఎయిర్ టెల్ చెబుతోంది.

Best Mobiles in India

English summary
Airtel ads with ‘Fastest Network in India’ claim, ruled misleading by ASCI read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X