ఎయిర్‌టెల్ 4జీ, ఏడాది పాటు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ

|

తన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్లమర్‌ల కోసం భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎంపిక చేసిన అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ స్కీమ్‌లకు మైగ్రేట్ అవటం ద్వారా తమ ఖాతాదారులకు డిసెంబర్ 31, 2017 వరకు ప్రతినెలా 3జీబి 4జీ డేటాను ఉచితంగా అందించనున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.

యిర్‌టెల్ ఉచిత 4జీ ఆఫర్

Read More : రూ.3000 రేంజ్‌లో లేటెస్ట్ 4G VoLTE ఫోన్‌లు ఇవే

4జీ స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్న ఎయిర్‌టెల్ పాత కస్టమర్‌లతో పాటు కొత్త కస్టమర్‌లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ నెల 4న ప్రారంభం కాబోతున్న ఈ ఆఫర్ ఫిబ్రవరి 28, 2017 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రీపెయిడ్ కస్టమర్‌లు నెలకు రూ.345 చెల్లించటం ద్వారా అన్‌లిమిటెడ్ (లోకల్ + ఎస్టీడీ) కాలింగ్‌తో పాటు 1జీబి 4జీ డేటా లభిస్తుంది. దీనికి అదనంగా మరో 3జీబి 4జీ డేటా తోడవుతుంది.

యిర్‌టెల్ ఉచిత 4జీ ఆఫర్

Read More : రూ.9,990కే యాపిల్ ఐఫోన్ 6

రీఛార్చ్ చేయించుకున్న మొదటి సారి మాత్రం మైఎయిర్‌టెల్ యాప్ ద్వారా 3జీబి డేటాను పొందాల్సి ఉంటుంది. తదుపరి నెలల నుంచి రూ.345 రీఛార్జ్ పూర్తవ్వగానే 3జీబి డేటా యాడ్ అయిపోతుంటుంది. ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసరికి 28 రోజులు. సంవత్సరంలో 13 సార్లు ఈ రీఛార్జ్‌ను పొందే వీలుంటుంది.

యిర్‌టెల్ ఉచిత 4జీ ఆఫర్

Read More : ఐటీ రంగాన్ని బెంబేలెత్తిస్తున్న విప్రో,ఇన్ఫోసిస్ లేఖలు

MyPlan Infinity ప్లాన్స్‌లో ఏదో ఒకదాన్ని సెలక్ట్ చేసుకోవట్ ద్వారా ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్‌లు ఉచిత 4జీ డేటాను ఆస్వాదించవచ్చు. ఉదాహరణకు రూ.549 ప్లాన్‌లో ఉన్నట్లయితే అన్‌లిమిటెడ్ (లోకల్ + ఎస్ టీడీ) కాలింగ్‌తో పాటు 3జీబి + 3జీబి 4జీబి డేటా మీకు లభిస్తుంది. అదే రూ.799 ప్లాన్‌లో ఉన్నట్లయితే నెలకు 5జీబి + 3జీబి 4జీబి డేటా మీకు లభిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.9,000 విలువ చేసే ఎయిర్‌టెల్ 4జీ ఇంటర్నెట్‌ను ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel to give 3GB of 4G data for 12 months to new customers. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X