జియోకి ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్

ఎవరైనా పేమెంట్ బ్యాంకులో రూ. 10 వేలు డిపాజిట్ చేస్తే వెంటనే మీకు 10 వేల ఉచిత టాక్ టైం లభిస్తుంది.

By Hazarath
|

ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా జియో జియో అంటూ జనాలు కలవరిస్తున్నారు. దీనికి తోడు రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబాని మార్చి 31 వరకు ఉచితమంటూ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ని అందించడంతో టెల్కోలకు దిక్కుతోచడం లేదు. ఎక్కడ కష్టమర్లు జారిపోతారోనని సరికొత్త ఆఫర్లను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ ఇప్పుడు సరికొత్త ఆఫర్ తో ముందు కొచ్చింది.

 

జియోకు మేము అనుమతి ఇవ్వలేదు: కేంద్రప్రభుత్వం

ప్రతీ రూపాయికి తగ్గట్టుగా టాక్ టైం

ప్రతీ రూపాయికి తగ్గట్టుగా టాక్ టైం

ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ తన ఖాతాదారులను ఆకట్టుకునేందుకు బంఫరాఫర్‌ని ప్రకటించింది. తమ బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రతీ రూపాయికి తగ్గట్టుగా టాక్ టైం ను ప్రకటించింది.

10 వేలు డిపాజిట్ చేస్తే 10 వేల ఉచిత టాక్ టైం

10 వేలు డిపాజిట్ చేస్తే 10 వేల ఉచిత టాక్ టైం

దీని ప్రకారం ఎవరైనా పేమెంట్ బ్యాంకులో రూ. 10 వేలు డిపాజిట్ చేస్తే వెంటనే మీకు 10 వేల ఉచిత టాక్ టైం లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎక్కువ వడ్డీ రేట్లు అందించే లక్ష్యంతో
 

ఎక్కువ వడ్డీ రేట్లు అందించే లక్ష్యంతో

వినియోగదారులకు ఎక్కువ వడ్డీ రేట్లు అందించే లక్ష్యంతో ఈ ఆఫర్ ని ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టినట్లుగాఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఎండీ, సీఈఓ శశి అరోరా తెలిపారు..

తొలిసారి డిపాజిట్ చేసే వినియోగదారులకు

తొలిసారి డిపాజిట్ చేసే వినియోగదారులకు

అయితే ఈ ఆఫర్ తొలిసారి డిపాజిట్ చేసే వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే డిపాజిట్ చేసే వ్యక్తికి ఎయిర్‌టెల్ సిమ్ ఉండాలి. ఆసిమ్ కు టాక్ టైం లభిస్తుంది.

 జీవిత కాలంలో ఎప్పుడైనా

జీవిత కాలంలో ఎప్పుడైనా

ఈ టాక్ టైంను మీరు జీవిత కాలంలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. లోకల్ నేషనల్ ఎక్కడికైనా ఈ టాక్ టైం ద్వారా మీరు కాల్ చేసుకోవచ్చు.

7.25 శాతం వడ్డీ

7.25 శాతం వడ్డీ

పైలట్ ప్రాతిపదికన రాజస్థాన్ లో నవంబర్ 23 న ప్రారంభమైన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ 7.25 శాతం వడ్డీ అందిస్తోంది.దీంతోపాటు లక్ష రూపాయల వ్యక్తిగత ప్రమాద బీమా క్పలిస్తోంది.

నాన్ ఎయిర్ టెల్ కస్టమర్లు కూడా

నాన్ ఎయిర్ టెల్ కస్టమర్లు కూడా

నాన్ ఎయిర్ టెల్ కస్టమర్లు కూడా తన ప్రత్యేక ఎయిర్‌టెల్ రీటైల్ కౌంటర్ల ద్వారా ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ ఖాతాను తెరవచ్చని పేర్కొన్న సంగతి తెలిసిందే.

ఎయిర్‌టెల్ నంబర్ నుంచి

ఎయిర్‌టెల్ నంబర్ నుంచి

ఈ సర్వీసులను మీరు మీ మొబైల్ లోని ఎయిర్టెల్ మనీ యాప్ ద్వారా కూడా పొందవచ్చు. మీరు మీ ఎయిర్‌టెల్ నంబర్ నుంచి *400# నంబర్ కు కాని ఐవీఆర్ ద్వారా 400 నంబర్ కు కాని డయల్ చేసి వివరాలు పొందవచ్చు.

బ్యాంకుకు సంబంధించిన సేవలు

బ్యాంకుకు సంబంధించిన సేవలు

హిందీ, ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్‌ల్లో మీకు సేవలు అందుతాయి. దీంతో పాటు 8800688006 ఈ నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా కూడా మీరు బ్యాంకుకు సంబంధించిన సేవలు పొందవచ్చు.

ఎయిర్‌టెల్ అవుట్ లెట్ల ద్వారా

ఎయిర్‌టెల్ అవుట్ లెట్ల ద్వారా

ప్రస్తుతం రాజస్థాన్ లో ఉన్న ఈ సర్వీసు అతి త్వరలో దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ఎయిర్‌టెల్ సన్నాహాలు చేస్తోంది. ఎయిర్‌టెల్ అవుట్ లెట్ల ద్వారా మీరు క్యాష్ డిపాజిట్ చేయడం అలాగే తీసుకోవడం లాంటి కార్యకలాపాలు నిర్వహించువచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Airtel Payments Bank gives you talktime for every rupee in savings deposits; here are other benefits read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X