ఉచిత వైఫైతో ఎయిర్‌టెల్ మరో సంచలనం

115 మెట్రో లగ్జరీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా 6 నెలల పాటు ఫ్రీ వైఫై సర్వీసు

By Hazarath
|

తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర ప్రజలకు ఎయిర్‌టెల్ బంఫరాఫర్ ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసు బస్సుల్లో ఫ్రీ వైఫై సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. అక్కడి ఆర్టీసీ బస్సుల్లో నేటి నుంచి ఫ్రీ వైఫై సర్వీసు అందుబాటులోకి వచ్చింది. టీఎస్ఆర్టీసీ-భారతి ఎయిర్ టెల్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు నేటి నుంచి సిటీ బస్సుల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.

జియో ఉచితంపై సరికొత్త న్యూస్..ఆ రోజే !

airtel

నగరంలో ఎక్కువ రద్దీగా ఉండే మార్గాల్లో ప్రయాణించే 115 మెట్రో లగ్జరీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా 6 నెలల పాటు ఫ్రీ వైఫై సర్వీసును అందించనున్నారు. ఫ్రీ వైఫై ద్వారా బస్సులో ప్రయాణించేవారు ఎవరైనా సరే .. రోజుకు 20 నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలను వినియోగించుకోవచ్చు.ఈ ఉచిత వైఫై సేవలను ఎయిర్ టెల్ అందిస్తున్నప్పటికీ .. ఇతర టెలికాం వినియోగదారులు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు.

ఐఫోన్లలో డిస్‌ప్లే సమస్య నిజమే: షాకిచ్చిన ఆపిల్

ఎయిర్‌టెల్ నుంచి అన్ లిమిటెడ్ కాల్ ఆఫర్ ని పొందండం ఎలాగో ఓ సారి చూడండి

స్పెషల్ ఆఫర్‌లో భాగంగా

స్పెషల్ ఆఫర్‌లో భాగంగా

రిలయన్స్ జియో అన్‌లిమిటెట్ వాయిస్‌ కాల్ ఆఫర్‌కు పోటీగా భారతి ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ స్పెషల్ ఆఫర్‌లో భాగంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా 28 రోజుల పాటు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ 28 రోజుల వ్యవధిలో 18జీబి వరకు 3జీ/4జీ మొబైల్ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు

 

 

కాల్ డ్రాప్ సమస్యలు జియోను వేధిస్తోన్న నేపథ్యంలో..

కాల్ డ్రాప్ సమస్యలు జియోను వేధిస్తోన్న నేపథ్యంలో..

కాల్ డ్రాప్ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో జియో కాల్ టైమింగ్‌ను 30 నిమిషాలకు కుదించిన విషయం తెలిసిందే. కాల్ కనెక్ట్ అయి 30 నిమిషాలు పూర్తికాగానే ఆటోమెటిక్‌గా డిస్కనెక్ట్ కాబడుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌లో ఇలాంటి సమస్య ఉండదు..

ఎయిర్‌టెల్‌ ఆఫర్‌లో ఇలాంటి సమస్య ఉండదు..

ఎయిర్‌టెల్‌ అందించే ఈ ఆఫర్‌లో ఈ విధమైన సమస్య ఉండదు. కాల్స్ నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చు. రూ.2,249 పెట్టి రీఛార్జ్ చేయించటం ద్వారా ఈ ఆఫర్‌ను ఎయిర్‌టెల్ యూజర్లు పొందవచ్చు.

 

 

ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ చేసుకోవచ్చు..

ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ చేసుకోవచ్చు..

28 రోజుల వ్యాలిడిటీతో వర్తించే ఈ ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌టెల్ నెంబర్లతో పాటు వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్, ఆర్‌కామ్, ఎయిర్‌సెల్, డొకోమో వంటి నెట్‌వర్క్‌లకు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు.

 

 

ఈ ఆఫర్‌ను పొందేందుకు ఎయిర్‌టెల్ యూజర్లు ఏం చేయాలంటే..?

ఈ ఆఫర్‌ను పొందేందుకు ఎయిర్‌టెల్ యూజర్లు ఏం చేయాలంటే..?

ముందుగా మీ ఎయిర్‌టెల్ నెంబర్ నుంచి #121*1#కు డయల్ చేయండి. ఆఫర్ మీ నెంబర్‌కు అందుబాటులో ఉందో లేదో తెలిసిపోతుంది.

 

 

స్టెప్ 2

స్టెప్ 2

MyAirtel యాప్‌ను మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయండి. యాప్ ద్వారా మీ ఎయిర్‌టెల్ అకౌంట్‌లోకి లాగిన్ అయిన తరువాత "Special Offer" ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3

స్టెప్ 3

అక్కడ కనిపించే స్పెషల్ ఆఫర్స్ లో భాగంగా Rs.2,249 రీఛార్జ్ ఆఫర్ పై క్లిక్ చేయండి. పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ కార్డ్ వివరాలను ఎంటర్ చేసిన పే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 4

స్టెప్ 4

ఆఫర్ మీ నెంబర్‌కు యాక్టివేట్ అవటానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతుంది.

మీరు గుర్తుపెట్టుకోవల్సిన విషయాలు..

మీరు గుర్తుపెట్టుకోవల్సిన విషయాలు..

ఈ ఆఫర్ ఎంపిక చేసిన ఎయిర్‌టెల్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. కేవలం 3జీ/4జీ నెట్‌వర్క్‌లకు మాత్రమే ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆఫర్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. మళ్లీ ఆఫర్‌ను పొందాలనుకుంటే పైన పేర్కొన్న ప్రొసీజర్‌ ద్వారా మళ్లీ రూ.2,249 పెట్టి రీఛార్జ్ చేయించుకోవల్సి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Airtel and TSRTC tie up to offer complementary Wi-Fi on Metro Luxury Buses in Hyderabad read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X