WannaCry బాధితులు విండోస్ 7 వాడుతున్న వారే..?

వన్నాక్రై రాన్సమ్‌వేర్ గురించి రోజుకో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది.

|

ప్రపంచదేశాలను గడగడలాడించిన వన్నాక్రై రాన్సమ్‌వేర్ గురించి రోజుకో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది. వాస్తావానికి ఈ రాన్సమ్‌వేర్ ప్రభావం.. విండోస్ పాత వర్షన్ ఆపరేటింగ్ సిస్టంలైన విండోస్ ఎక్స్‌పీ, విండో విస్టాల మీద ఎక్కువుగా ఉంటుందని అందరు భావించారు.

ఆ రెండు ఆపరేటింగ్ సిస్టంలే ప్రధాన టార్గెట్

ఆ రెండు ఆపరేటింగ్ సిస్టంలే ప్రధాన టార్గెట్

విండోస్ ఎక్స్‌పీ, విండో విస్టా సేవలన మైక్రోసాఫ్ట్ ఇప్పటికే నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ ఓఎస్‌లకు సిస్టం అలానే సెక్యూరిటీ అప్‌డేట్‌లు పూర్తిగా నిలిచిపాయి. దీంతో వన్నాక్రై రాన్సమ్‌వేర్‌కు ఈ రెండు ఆపరేటింగ్ సిస్టంలే ప్రధాన టార్గెట్ కావొచ్చని అనుకున్నారు.

అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ..

అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ..

అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ వన్నాక్రై రాన్సమ్‌వేర్ విండోస్ 7 యూజర్ల మీదే ఎక్కువుగా విరుచుకుపడినట్లు తెలుస్తోంది. వన్నాక్రై ఎఫెక్టెడ్ విండోస్ వర్షన్స్‌కు సంబంధించి ప్రముఖ సెక్యూరిటీ సంస్థ kASPERSKY ఓ డేటాను విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం చూస్తే విండోస్ 7 64 బిట్ యూజర్లనే వన్నాక్రై రాన్సమ్‌వేర్ టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది.

వన్నాక్రే రాన్సమ్‌వేర్ నుంచి మీ కంప్యూటర్‌ సురక్షితంగా ఉండాలంటే..?

వన్నాక్రే రాన్సమ్‌వేర్ నుంచి మీ కంప్యూటర్‌ సురక్షితంగా ఉండాలంటే..?

ఇంటర్నెట్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న వన్నాక్రే రాన్సమ్‌వేర్ సైబర్ భద్రతకు పెనుముప్పుగా పరిణమించింది. ఈ నేపథ్యంలో వన్నాక్రే రాన్సమ్‌వేర్ నుంచి మీ కంప్యూటర్‌ను సురక్షితంగా ఉంచుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది...

లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లను మీ సిస్టంలోకి అప్లై చేసుకోండి

లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లను మీ సిస్టంలోకి అప్లై చేసుకోండి

ముందుగా మీ కంప్యూటర్‌లోని డేటా మొత్తాన్ని బ్యాకప్ చేసుకోండి. సెక్యూరిటీ బులిటెన్ 2017 ఎంఎస్10-010 పేరుతో మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లను మీ సిస్టంలోకి అప్లై చేసుకోండి. మైక్రోసాఫ్ట్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడ్ అవ్వండి.

అనుమానాస్పద ఈ-మెయిల్స్ జోలికి వెళ్లోద్దు..

అనుమానాస్పద ఈ-మెయిల్స్ జోలికి వెళ్లోద్దు..

అనుమానాస్పద ఈ-మెయిల్స్ తో పాటు వెబ్‌సైట్‌లను మీ కంప్యూటర్ నుంచి క్లియర్ చేసుకోండి. ముఖ్యంగా tasksche.exe ఫైల్ పేరుతో వచ్చే మెయిల్ అటాచ్‌మెంట్‌లను అస్సలు ఓపెన్ చేయకండి.మీ సిస్టంకు రక్షణగా శక్తివంతమైన ఫైర్‌వాల్‌ను ఏర్పాటు చేసుకోండి. లేటెస్ట్ వర్షన్ యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి.

కంప్యూటర్ నుంచి తొలగించటం ఎలా..?

కంప్యూటర్ నుంచి తొలగించటం ఎలా..?

కంప్యూటర్‌లో నక్కిఉన్న WannaCry వైరస్‌ను తొలగించాలంటే సిస్టంలోకి సేఫ్ మోడ్‌లో ఎంటర్ కావల్సి ఉంటుంది. ఆ తరువాత సమస్య కేంద్రాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇలా చేసేందుకు ముందుగా కీబోర్డులో Ctrl + Shift + Esc బటన్ లను ప్రెస్ చేసి Task Managerను ఓపెన్ చేయండి.

టాస్క్ మేనేజర్ అనేది..

టాస్క్ మేనేజర్ అనేది..

 టాస్క్ మేనేజర్ అనేది మీ కంప్యూటర్‌కు సంబంధించిన పనితీరు, రన్ అవుతోన్న అప్లికేషన్స్, processes, సీపీయూ యూసేజ్, మెమెురీ ఇన్ఫర్మేషన్, నెట్‌వర్క్ యాక్టివిటీ అండ్ స్టాటిస్టిక్స్, సిస్టం సర్వీసెస్ వంటి వివరాలను క్లుప్తంగా తెలియజేస్తుంది.

అనుమానాస్పద entriesను కనిపెట్టాల్సి ఉంటుంది...

అనుమానాస్పద entriesను కనిపెట్టాల్సి ఉంటుంది...

 మీ కంప్యూటర్‌లో Task Manager ఓపెన్ అయిన తరువాత processes జాబితాలో అనుమానాస్పద entriesను కనిపెట్టాల్సి ఉంటుంది. malicious processes అనేవి ఎక్కువ మొత్తంలో సీపీయూతో పాటు ర్యామ్‌ను ఖర్చుచేస్తుంటాయి. ఇటువంటి processesను గుర్తించిన వెంటనే ఫైల్ లొకేషన్‌ను గుర్తించి ఆ ప్రాసెస్‌ను ఎండ్ చేయండి.

విండోస్ సెర్చ్ బార్‌లో..

విండోస్ సెర్చ్ బార్‌లో..

విండోస్ సెర్చ్ బార్‌లోకి వెళ్లి System Configuration అని టైప్ చేసినట్లయితే కొన్ని రిజల్ట్స్ కనిపిస్తాయి. వాటిలో మొదటి రిసల్ట్‌ను ఓపెన్ చేయండి. స్టార్టప్ టాబ్‌ను పరిశీలించినట్లయితే అక్కడ స్టార్టప్ ప్రోగ్రామ్‌లతో కూడిన జాబితా కనిపిస్తుంది. వాటిలో అనుమానాస్పద ప్రోగ్రామ్స్ ఏమైనా కనిపించినట్లయితే ఆ ఎంట్రీలను అన్‌చెక్ చేసి ఓకే బటన్ పై క్లిక్ చేయండి.

Run విండోను ఓపెన్ చేసి

Run విండోను ఓపెన్ చేసి

 Run విండోను ఓపెన్ చేసి అందులో regedit అని టైప్ చేసి ఎంటర్ బటన్ పై ప్రెస్ చేయండి. ఇప్పుడు Registry Editor ఓపెన్ అవుతుంది. Ctrl + F కమాండ్ ఇవ్వటం ద్వారా సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. సెర్చ్ బార్ లో వైరస్ పేరును ఎంటర్ చేసినట్లయితే, ఆ పేరుతో వైరస్ ఫైల్ ఏమైనా ఉన్నట్లయితే మీకు లొకేట్ కాబడుతుంది. దీంతో వెంటనే ఆ ఫైల్ ను డిలీట్ చేసే వీలుంటుంది.

అప్రమత్తమైన భారత్ సైబర్ భద్రత సంస్థ

అప్రమత్తమైన భారత్ సైబర్ భద్రత సంస్థ

వన్నాక్రే రాన్సమ్‌వేర్ పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు భారత్ సైబర్ భద్రత సంస్థ సీఈఆర్టీ పలు సూచనలు చేసింది. సీఈఆర్టీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లటం ద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. 1800-11-4949 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలను తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ సిస్టం WannaCry రాన్సమ్‌వేర్‌ దాడికి గురైనట్లయితే incident.cert-in.org.inకు మెయిల్ ద్వారా సమచారం ఇవ్వాలని సీఈఆర్టీ కోరుతోంది.

Best Mobiles in India

English summary
Almost All WannaCry Victims Were Running Windows 7. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X