జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

By Hazarath
|

మార్కెట్లో ఎక్కడో వెనుకన ఉన్న రిలయన్స్ ఒక్కసారిగా జియోతో మార్కెట్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటిదాకా నామమాత్రంగా ఉండి నడిపించిన ముకేష్ అంబాని పూర్తి స్థాయిలో రీ ఎంట్రీ ఇవ్వనుండటంతో ఇప్పుడు మార్కెట్ అంతా అలర్టయ్యే పరిస్థితి వచ్చింది. జియో రాకతో మిగతా కంపెనీల్లో కలవరం మొదలై జియోని ఎదుర్కునేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపధ్యంలో జియో గురించి దాని అధినేత ముకేష్ అంబాని టార్గెట్ గురించి కొన్ని నిజాలు వింటే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. అవేంటో మీరే చూడండి.

జియో కోసం షోరూంల ముందు క్యూ ఎలా ఉందంటే..

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

దేశ వ్యాప్తంగా 4జీ జియో సేవల కోసం ఇప్పటిదాకా రిలయన్స్ పెట్టిన ఖర్చు 20 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 1.35 లక్షల కోట్లు.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

పెట్రోలియం-రిఫైనింగ్ వ్యాపారంలో లాభాల పంట పండుతుండటంతో రిలయన్స్ జియోకి పెట్టుబడుల విషయంలో ఎంతైనా పెట్టేందుకు ముకేశ్ అంబానీ వెనుకాడటం లేదు.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు
 

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

దేశంలో ఉన్న 125 కోట్ల జనాబాలో ఇప్పటికే చాలామంది రిలయన్స్ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అయితే జియో బయటకు వచ్చే నాటికి 10 కోట్ల మందిని జియో నెట్ వర్క్ లోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

ప్రస్తుతం దేశీ టెలికం పరిశ్రమ మార్కెట్ వాటాలో ఐదింట మూడొంతులు దిగ్గజాలైన భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ చేతిలోనే ఉంది. అయితే జియో రాకతో ఇది పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో పూర్తిస్థాయి అరంగేట్రానికి ముందే డేటా నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేచర్యల్లో భాగంగా మూడు దిగ్గజ టెల్కోలు టారిఫ్‌లను తప్పనిసరిగా తగ్గించుకునేలా చేస్తోంది. ఎంత తగ్గించినా దిగ్గజాలకు మాత్రం దడ పుట్టిస్తూనే ఉంది.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో దెబ్బకు వాటిల్లో వాటికే ఇప్పుడు పోటీ మొదలైంది. ఈ ల్కోలు పోటాపోటీగా టారిఫ్‌ల తగ్గింపు, పరిమితి పెంపు వంటి చర్యలతో ధరల పోరుకు తెరతీశాయి.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

బీటా పేరుతో ఎటువంటి మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నా... 90 రోజుల ఉచిత అన్‌లిమిటెడ్ డేటా, వాయిస్ సేవలు అంటూ యూజర్లకు రిలయన్స్ జియో ఇప్పటికే ఆఫర్ ప్రకటించింది. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది అయినా ముందుకు వెళుతోంది.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో ప్రయోగాత్మక సేవలకు ప్రభుత్వానికి పైసా ఆదాయం కూడా లేదు. వినియోగదారులకు మాత్రమే ఆదాయం కనిపించేలా ఉంది.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

పరీక్షల పేరుతో రిలయన్స్ జియో పూర్తిస్థాయి సేవలను ఇస్తోందంటూ సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేసింది.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో 10 కోట్ల మంది యూజర్లను దక్కించుకుంటే ఎక్కడ తమ యూజర్లను కోల్పోవాల్సి వస్తుందోనన్న ఆందోళనలో టెల్కోలు ఉన్నాయి. మార్కెట్ వాటాను చేజార్చుకుంటే మళ్లీ దక్కించుకోవడం కష్టసాధ్యమన్నది ఆయా కంపెనీల కలవరపాటుకు ప్రధాన కారణం.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

రిలయన్స్ జియో కూడా తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చడంతోపాటు ఎదురుదాడి మొదలుపెట్టింది.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

తమ బీటా సేవల్లో వినియోగదారులు ఇతర టెల్కోలకు సంబంధించిన నెట్‌వర్క్‌కు కాల్ చేసినప్పుడు తగిన ఇంటర్‌కనెక్షన్ సేవలను అందించకుండా ప్రస్తుత టెల్కోలు తమపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని, కాల్‌డ్రాప్‌లకు కారణమవుతున్నాయంటూ రిలయన్స్ జియో కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం మొదలెట్టింది.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

సీఓఏఐ, జియోల మధ్య నెలకొన్న ఈ వివాదంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా గందరగోళంలో పడింది. దీని దెబ్బకు మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న అదిపెద్ద స్పెక్ట్రం వేలాన్ని వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీకి టెలికం రంగంలో జియోతో మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు. వచ్చి రావడంతోనే పెను తుఫాన్‌ను తీసుకొస్తున్నాడు.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

వాస్తవానికి నెట్‌వర్క్ విస్తరణపై ఇప్పటికే అన్ని కంపెనీలు వేల కోట్ల రూపాయిలు కుమ్మరిస్తున్నా ఆ స్థాయిలో ఇంకా డేటా వినియోగం మరింతగా పుంజుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

జియో గురించి కళ్లు బైర్లు గమ్మే నిజాలు

షాకింగ్ న్యూస్ ఏంటంటే టెలికం విస్తరణ కోసం మరింతగా రుణం సమర్పించే ప్రణాళికలపై ప్రస్తుత టెల్కోలకు చెందిన మైనారిటీ వాటాదారులు వ్యతిరేక గళం వినిపిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Here Write Mukesh Ambanis hunt for 100 million Jio subscribers is making telecom firms edgy

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X