ఇక ఆధార్ కార్డు ద్వారా ఆంధ్రాబ్యాంక్ లావాదేవీలు

ఆంధ్రాబ్యాంక్ యూజర్లు ఇక పై తమ 12 అంకెల ఆధార్ నెంబరును గుర్తుపెట్టుకుంటే చాలు, లావాదేవీలు జరిగిపోతాయి.

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో ఆంధ్రాబ్యాంక్ మరో ముందడుగు వేసింది. మొబైల్ ఫోన్‌ల ద్వారా నగదు లావాదేవీలు నిర్విహించుకుంటోన్న ఆంధ్రాబ్యాంక్ యూజర్లు ఇక పై తమ 12 అంకెల ఆధార్ నెంబరును గుర్తుపెట్టుకుంటే చాలు, లావాదేవీలు జరిగిపోతాయి.

Read More : వారంటీ దెబ్బతినకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను Root చేయటం ఎలా?

ఇక ఆధార్ కార్డు ద్వారా ఆంధ్రాబ్యాంక్ లావాదేవీలు

ఎటువంటి డెబిట్ కార్డ్ లేదా పిన్ నెంబర్ అవసరం ఉండదు. తాము నూతనంగా ప్రారంభించిన ఆంధ్రాబ్యాంక్ ఈ-వ్యాపర్ సేవల్లో భాగంగా ఖాతాదారులు తమ ఆధార్ నెంబర్లతో మొబైల్ ఫోన్‌ల నుంచి బ్యాంక్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చని ఆంధ్రబ్యాంక్ CMD సురేష్ ఎన్ పటేల్ తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కంకణం కట్టుకున్న కేంద్రం ప్రభుత్వం

నగదురహిత ఆర్థిక అభివృద్థికి కంకణం కట్టుకున్న కేంద్రం ప్రభుత్వం, నోట్లకు మాత్రమే కాదు క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డులకు సైతం చరమ గీతం పాడబోతోంది. కేవలం ఆధార్ కార్డ్ నెంబర్ ఆధారంగా అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను నిర్వహించకునే విధంగా సరికొత్త సాంకేతికతను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్‌‌ ధృవీకరణగా..

ఈ నెట్‌వర్క్ పూర్తిస్థాయిలో అందుబాటలోకి వచ్చినట్లయితే స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆధార్ నెంబర్‌ను ఫోన్‌లో ఎంటర్ చేసి ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్‌‌ ధృవీకరణగా ఇవ్వటం ద్వారా తమ ఖాతాలోని డబ్బును ఇతరుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుంది.

ఫింగర్ ప్రింట్ స్కానర్ తప్పనిసరి..

ఈ దిశగా అడుగులు వేస్తోన్న ప్రభుత్వం, ఇక పై దేశంలో తయారు కాబడే అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లలో ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదా ఐరిస్ స్కానర్ సపోర్ట్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆయా కంపెనీలను కోరనునట్లు సమచారం.

సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టే..

ఈ Authenticationతో కూడిన ఫోన్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే నగదు బదిలీ ప్రక్రియ మరింత సులభతరంగా మారి ఆధార్ ఆధారిత లావాదేవీలు ఓ సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టే అవకాశముంది.

12 అంకెల ఆధార్ నంబరు

ఆధార్ ఆధారిత లావాదేవీలకు ఎటువంటి కార్డ్ లేదా పిన్ నెంబర్ అవసరం లేదు. మీకు కేటాయించిన 12 అంకెల ఆధార్ నంబరును గుర్తుపెట్టుకుంటే చాలు.

నగదు చెల్లింపు చేపట్టవచ్చు

స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే వారు తమ ఆధార్ నెంబర్‌తో పాటు వేలిముద్రలు ఆధారంగా చేసుకుని నగదు చెల్లింపు చేపట్టవచ్చు. క్రెడిట్, డేబిట్ లావాదేవీలతో పోలిస్తే ఆధార్ కార్డ్ లావాదేవీలు మరింత సురక్షితం. హ్యాక్ అవుతుంతున్న భయం ఉండదు. మీ వేలి ముద్ర లేదా ఐరిస్ ఎంటర్ చేస్తేనే లావాదేవీ పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

నీతి అయోగ్ కమిటీ

క్యాష్‌లెస్ లావాదేవీలను విజయవంతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నీతి అయోగ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఏడాది పాటు అధ్యయనం చేసి దేశంతో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు సులువైన మర్గాలను అన్వేషిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Andhra Bank launches Aadhar-powered cashless transactions. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting