స్టీవ్ జాబ్స్ చివరి కలల ప్రాజెక్ట్..

ఆపిల్ అనే సామ్రాజ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్ కలల ప్రాజెక్ట్ ఒకటి ఉందని తెలుసా.

By Hazarath
|

ఆపిల్ అనే సామ్రాజ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్ కలల ప్రాజెక్ట్ ఒకటి ఉందని తెలుసా..అది పూర్తి కాకుండానే స్టీవ్ జాబ్స్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ బాధ్యతను టిమ్ కుక్ భుజాల మీద వేసుకున్నారు. కుపెర్టినో దగ్గర నిర్మిస్తున్న ఆపిల్ కొత్త ఆఫీసును ఓ సారి చూస్తే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. ప్రాజెక్ట్ హైలెట్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

బడ్జెట్ రేంజ్‌లో మార్కెట్లోకి మరో కొత్త 4జీ వోల్ట్ ఫోన్

ఈ బిల్డింగ్ ప్లానింగ్ ప్రాసెస్‌లో స్టీవ్ జాబ్స్ హస్తం

ఈ బిల్డింగ్ ప్లానింగ్ ప్రాసెస్‌లో స్టీవ్ జాబ్స్ హస్తం

ఈ బిల్డింగ్ ప్లానింగ్ ప్రాసెస్‌లో స్టీవ్ జాబ్స్ హస్తం చాలానే ఉంది. దీనికోసం ఆయన చాలానే కష్టపడ్డారు. 2009లో ఆయన నడుం బిగించారు. 2013లో కుపెర్టినో ప్లానింగ్ కమిషన్ ఈ ప్లాన్ ను ఎలా బయటకు తెస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తే దానికి స్టీవ్ జాబ్స్ మీరు దాని గురించి ఆలోచించకండి ఎలా భాగస్వాములు కావాలో ఆలోచించడం అని చెప్పారు.

ఈ బిల్డింగ్ ప్లాన్ అంతా లండన్ స్క్వయిర్

ఈ బిల్డింగ్ ప్లాన్ అంతా లండన్ స్క్వయిర్

ఈ బిల్డింగ్ ప్లాన్ అంతా లండన్ స్క్వయిర్ ను ఇనస్పిరేషన్ గా తీసుకుని చేయడం జరిగింది. రింగ్ ఆకారంలో ఈ బిల్డింగ్ ను రెడీ చేస్తున్నారు. 2014లో కుపెర్టినో ప్లానింగ్ కమిషనర్ ఫాస్టర్ ఇది ఆర్కిటెక్ లోనే ఓ గొప్ప రికార్డు అంటూ పొగిడారు. పార్క్ అంతా స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ పార్క్ ను పోలి ఉంటుంది.

ఇందులో దాదాపు 13 వేల మంది ఉద్యోగులు

ఇందులో దాదాపు 13 వేల మంది ఉద్యోగులు

ఇందులో దాదాపు 13 వేల మంది ఉద్యోగులు ఉండేందుకు వీలుగా ఉంటుంది. ఫ్లోర్ స్పేస్ దాదాపు 2. 8 మిలియన్ల చదరపు అడుగుల ఉంటుంది.మీటింగ్ కోసమే 80 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు.

10 వేల మంది కూర్చునే విధంగా

10 వేల మంది కూర్చునే విధంగా

10 వేల మంది కూర్చునే విధంగా అండర్ గ్రౌండ్ లో ఆడిటోరియం ఉంటుంది.ఇందుకోసం లక్షా 20 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. ఈ ఆఫీసు కోసం వాడే అద్దాలు ప్రపంచంలోనే ఏ కంపెనీకి వాడనటువంటివి. కర్వ్ గ్లాసెస్ ను వాడారు.

ఇక్కడ అంతా సోలార్ పవర్ మీదనే

ఇక్కడ అంతా సోలార్ పవర్ మీదనే

ఇక్కడ అంతా సోలార్ పవర్ మీదనే నడుస్తుంది. ఇందుకోసం దాదాపు 70 వేల చదరపు అడుగుల్లో సోలార్ ప్యానల్స్ ను నిర్మించారు.

ఈ క్యాంపస్ లో పనికిరాని వాటర్ ని

ఈ క్యాంపస్ లో పనికిరాని వాటర్ ని

ఈ క్యాంపస్ లో పనికిరాని వాటర్ ని తిరిగి రీ సైక్లింగ్ చేసి క్యాంపస్ లోనే చెట్లకే వాడుతారు. ఇందులో రోజుకు లక్షా 57 వేల గ్యాలన్ల నీరు అవసరం అవుతుంది. ఈ నీళ్లను వృధాగా పోనీయకుండా తిరిగి మెక్కలకే వాడే విధంగా ప్లాన్ చేశారు.

ఎంత ఖర్చు అవుతుందో సరిగ్గా చెప్పలేమని..

ఎంత ఖర్చు అవుతుందో సరిగ్గా చెప్పలేమని..

ఈ ప్రాజెక్ట్ కోసం ఆపిల్ కంపెనీ ఖర్చు చేసిన మొత్తం 5 బిలియన్ డాలర్లు.అయితే ఇది అంచనా మాత్రమేనని ఎంత ఖర్చు అవుతుందో సరిగ్గా చెప్పలేమని ఓ ఇంటర్యూలో టిమ్ కుక్ అన్నారు.

Best Mobiles in India

English summary
Apple's Campus 2 repeatedly delayed by emphasis on perfecting small details, profile says read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X