ఉగ్రవాదులను ఏరిపారేస్తున్న బ్రిటన్

By Hazarath
|

బ్రిటన్ పంజా విప్పింది. ఉగ్రవాదులపై అంతు చూడ్డానికి సిరియా బయలుదేరింది. బయలు దేరడమే కాదు ఏకంగా సిరియాలోని ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులను ముమ్మరం చేసింది. దీనికి సంబంధించిన బిల్లును బ్రిటన్ పార్లమెంట్ లో పెట్టిన వెంటనే దానికి అందరూ మద్దతు తెలిపారు. ఉగ్రవాదులను ఏరిపారేయాలని అందరూ ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటలలోనే సిరియాలోని ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసింది. మిగతా కధనం స్లైడర్ లో.

Read more: కార్గిల్ వ్యూహాం: పాక్‌పై భారత్ అణుబాంబు దాడి

రష్యా,ఫ్రాన్స్ లు మాత్రమే సిరియాలో ఉగ్రవాదులతో పోరాడితే

రష్యా,ఫ్రాన్స్ లు మాత్రమే సిరియాలో ఉగ్రవాదులతో పోరాడితే

మొన్నటిదాకా రష్యా,ఫ్రాన్స్ లు మాత్రమే సిరియాలో ఉగ్రవాదులతో పోరాడితే ఇప్పుడు వారికి బ్రిటన్ కూడా తోడయింది. సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) స్థావరాలపై బ్రిటన్ వైమానిక దాడులు నిర్వహించింది. ఉగ్రవాదులు తలదాచుకున్న అనేక స్థావరాలను నేలమట్టం చేసింది.

మధ్యయుగపు రాక్షసులపై బాంబుల వర్షం కురిపించడానికి

మధ్యయుగపు రాక్షసులపై బాంబుల వర్షం కురిపించడానికి

ఇప్పుడు ఐఎస్ఐఎస్ స్థావరాలపై రాయల్ బ్రిటీష్ ఎయిర్ ఫోర్స్ యుద్ద విమానాలు విరుచుకుపడుతున్నాయి. మధ్యయుగపు రాక్షసులపై బాంబుల వర్షం కురిపించడానికి అవకాశం ఇవ్వాలని బ్రిటన్ ప్రధాని కామెరాన్ పార్లమెంట్ లో మనవి చేయగా అందరూ దాన్ని ఆమోదించారు.

ఇస్లామిక్ స్టేట్ అంతు చూడటానికి ఇదే సరైన అవకాశం

ఇస్లామిక్ స్టేట్ అంతు చూడటానికి ఇదే సరైన అవకాశం

అదే విదంగా ఇస్లామిక్ స్టేట్ అంతు చూడటానికి ఇదే సరైన అవకాశం అని పిలుపునిచ్చారు. దీనిపై పార్లమెంట్ లో ఓటింగ్ జరగ్గా 397-223 ఓట్ల తేడాతో కామెరాన్ ప్రభుత్వం ఆమోదం పొందింది. దీంతో ఇస్లామిక్ స్టేట్ స్థావరాల మీద దాడులు చెయ్యాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని గంటలలోనే బ్రిటన్ వైమానిక దాడులు వేగవంతం చేసింది.

ఉగ్రవాదుల స్థావరాల మీద నాలుగు యుద్ద విమానాలు

ఉగ్రవాదుల స్థావరాల మీద నాలుగు యుద్ద విమానాలు

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల స్థావరాల మీద నాలుగు యుద్ద విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. గతంలో కూడా సిరియాలోని అల్ బషర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైమానిక దాడులు నిర్వహించాలని కామెరూన్ పిలుపునిచ్చారు.

ఉగ్రవాదులు ప్యారిస్ లో దాడులు చేసిన నేపద్యంలో

ఉగ్రవాదులు ప్యారిస్ లో దాడులు చేసిన నేపద్యంలో

అయితే పార్లమెంట్ లో ఆమోదం పొందలేదు. తరువాత కామెరూన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇటివల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్యారిస్ లో దాడులు చేసిన నేపద్యంలో వారి అంతు చూడాలని బ్రిటన్ పార్లమెంట్ ఆంగీకారం తెలిపింది.

ఫ్రాన్స్‌ కోరితే బ్రిటన్‌ వాయుసేన విమానాలను

ఫ్రాన్స్‌ కోరితే బ్రిటన్‌ వాయుసేన విమానాలను

ఐఎస్‌పై దాడులకు ఫ్రాన్స్‌ కోరితే బ్రిటన్‌ వాయుసేన విమానాలను వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తామని గతంలోనే బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కెమరాన్‌ ప్రకటించారు. రక్తదాహంతో వున్న ఇస్లామిక్‌ స్టేట్‌ భూతాన్ని ఓడించేందుకు మిత్రదేశం ఫ్రాన్స్‌కు అవసరమైన సహాయం అందించేందుకు తాము సిద్ధంగా వున్నామని చెప్పారు.

ఇప్పటికే రష్యా వైమానిక దాడుల దన్నుతో

ఇప్పటికే రష్యా వైమానిక దాడుల దన్నుతో

అయితే ఇప్పటికే రష్యా వైమానిక దాడుల దన్నుతో సిరియా సైన్యం ఇస్లామిక్‌ స్టేట్‌ మిలిటెంట్లపై క్రమంగా పట్టు బిగిస్తోంది. ఐఎస్‌ మిలిటెంట్లు గతంలో స్వాధీనం చేసుకున్న రెండు పట్టణాలను సిరియా సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది.

ఐఎస్‌ మిలిటెంట్లకు, సిరియా సైన్యానికి భీకర పోరు

ఐఎస్‌ మిలిటెంట్లకు, సిరియా సైన్యానికి భీకర పోరు

ఈ క్రమంలో ఐఎస్‌ మిలిటెంట్లకు, సిరియా సైన్యానికి భీకర పోరు కొనసాగిందని సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ సంస్థ వెల్లడించింది. సిరియా సైన్యం, స్థానికుల సాయంతో మ్హీన్‌, హవారిన్‌ పట్టణాలను స్వాధీనం చేసుకున్నదని, దీనితో పాటు సిరియా ఆగ్నేయ దిశలో వున్న హామ్స్‌ నగరంపై పట్టు బిగిస్తోందని స్థానిక మీడియా వెల్లడించింది.

విమానదాడులకు బ్రిటన్‌ సిద్ధమవుతున్న తరుణంలో

విమానదాడులకు బ్రిటన్‌ సిద్ధమవుతున్న తరుణంలో

ఇదిలా ఉండగా సిరియాలోని ఇస్లామిక్‌ స్టేట్‌ స్థావరాలు లక్ష్యంగా విమానదాడులకు బ్రిటన్‌ సిద్ధమవుతున్న తరుణంలో రాజధాని లండన్‌ నగరం యుద్ధవ్యతిరేక ప్రదర్శనలతో హోరె త్తింది.

నాలుగు రోజు ల వ్యవధిలో ఇది రెండో భారీ నిరసన ప్రదర్శన

నాలుగు రోజు ల వ్యవధిలో ఇది రెండో భారీ నిరసన ప్రదర్శన

విమాన దాడుల ప్రతిపాదనను ప్రధాని కెమరాన్‌ పార్లమెంట్‌ లో ప్రవేశపెట్టిన సమయంలోనే లండన్‌ నగరంలో వేలాది మంది ప్రదర్శకులు అధికార కన్జర్వేటివ్‌ పార్టీ, ప్రతిప క్షలేబర్‌ పార్టీ ప్రధాన కార్యాలయాల ముందు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నాలుగు రోజు ల వ్యవధిలో ఇది రెండో భారీ నిరసన ప్రదర్శన కావటం విశే షం.

2001, 2003, 2011 నాటి ఉదంతాలు పునరావృతం కానివ్వొద్దు

2001, 2003, 2011 నాటి ఉదంతాలు పునరావృతం కానివ్వొద్దు

సిరియాపై బాంబులెయ్యొద్దు.. 2001, 2003, 2011 నాటి ఉదంతాలు పునరావృతం కానివ్వొద్దు' అంటూ ఆఫ్ఘని స్తాన్‌, ఇరాక్‌, లిబియా యుద్ధాలలో బ్రిటన్‌ ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ ప్రదర్శకులు నినాదాలు చేశారు.

ఉగ్రవాదులపై దాడులు జరిపేందుకు జర్మనీ మద్ధతు

ఉగ్రవాదులపై దాడులు జరిపేందుకు జర్మనీ మద్ధతు

సిరియా ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులపై దాడులు జరిపేందుకు జర్మనీ మద్ధతు ప్రకటించింది. గత నెల 13న పారిస్‌లో ఐఎస్‌ ఉగ్రవాదులు నరమేథాన్ని సృష్టించి 130 మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.

1200 మంది సైనికులను సిరియాకు పంపేందుకు రష్యా

1200 మంది సైనికులను సిరియాకు పంపేందుకు రష్యా

ఉగ్రవాద నిర్మూలన కోసం తమకు సహకరించాల్సిందిగా ఫ్రాన్స్‌ రష్యాను కోరింది. దీంతో 1200 మంది సైనికులను సిరియాకు పంపేందుకు రష్యా ఒప్పుకుంది. కాగా, దీనికి సంబంధించిన దస్త్రాన్ని పార్లమెంట్‌ ఆమోదం కోసం పంపినట్టు సమాచారం.

యుద్ధ ట్యాంకర్లను అందజేస్తామని ఫ్రాన్స్‌కు హామీ

యుద్ధ ట్యాంకర్లను అందజేస్తామని ఫ్రాన్స్‌కు హామీ

ఉగ్రదాడుల నిర్మూలనలో క్రియాశీలకంగా పాల్గొనలేకపోయినప్పటికీ...యుద్ధ విమానాలను, ఆయుధాలను, యుద్ధ ట్యాంకర్లను అందజేస్తామని ఫ్రాన్స్‌కు హామీ ఇచ్చింది. 

పారిస్‌ ఉగ్రదాడులను ఖండిస్తున్నానని

పారిస్‌ ఉగ్రదాడులను ఖండిస్తున్నానని

ఇక పారిస్‌ ఉగ్రదాడులను ఖండిస్తున్నానని జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ అనేక సార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. జర్మనీ బలగాలను సిరియాకు పంపడం పట్ల ఆమె సుముఖత వ్యక్తం చేస్తున్నారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

Read more about:
English summary
Here Write British advanced Hitech jets at RAF base ready to attack Syria

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X