దుమ్ము రేపుతున్న Bsnl 4జీ అన్‌లిమిటెడ్‌ బిబి 249 ప్లాన్

By Hazarath
|

రిలయన్స్ జియోకి పోటీగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త అన్ లిమిటెడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లలో మీకు 2 ఎంబీపీఎస్ వేగంతో అన్ లిమిటెడ్ 4జీ లభిస్తుంది. తాజాగా ప్రవేశపెట్టిన పథకం'ఎక్స్‌పీరియన్స్‌ అన్‌లిమిటెడ్‌ బిబి 249 ద్వారా ఖాతాదారులు రూపాయి కంటే తక్కువ ధరకే ఒక జిబి డేటా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఈ ఫథకంతో కష్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని కంపెనీ చెబుతోంది.అత్యంత తక్కువ ధరలకే ఈ పథకాలను కష్టమర్లకు అందించేలా తగిన ప్రణాళికలు రూపొందించినట్టు బిఎస్ఎన్‌ఎల్‌ ఎపి సర్కిల్‌ సిజిఎం ఎల్‌ అనంతరామ్‌ తెలిపారు. మరి బిబి249 ప్లాన్ హైలెట్ ఫీచర్స్ ఏంటో ఓ సారి మీరే చూడండి.

75 పైసలకే 1 జిబి డేటా: బిఎస్ఎన్ఎల్ సంచలనం

#1

#1

ఈ ప్లాన్ లో డేటా స్పీడ్ 2 ఎంబిపిఎస్‌ వేగంతో ఉంటుంది. అలాగే 1 ఎంబిపిఎస్‌ పోస్ట్‌ ఎఫ్‌యుపి స్పీడ్‌ ఉంటుంది. ఇది అన్ లిమిలెడ్ 4జీ డేటాను మీకందిస్తుంది.

#2

#2

అది అయిపోయిన తరువాత 1 జిబి డేటా వరకు మీకు అదనంగా అదీ ఉచితంగా ఓ ప్లాన్ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా రూ.1 కంటే తక్కువ ధరకే ఒక జిబి జిబి డేటా డౌన్‌లోడింగ్‌ ని మీరు పొందవచ్చు.

#3

#3

మీరు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఈ అన్ లిమిటెడ్ అప్ లోడింగ్ అలాగే డౌన్ లోడింగ్ ను పొందవచ్చు. ఇది 1 ఎంబీపీఎస్ స్పీడ్ తో మీకు లభిస్తుంది. ఈ ప్లాన్ 6 నెలల వరకు మీరు వాడుకోవచ్చు. అంటే మీకు నెలకు 49 రూపాయల కాస్ట్ అవుతుంది. అదే రోజుకి కేవలం 75 పైసలు మాత్రమే ఛార్జ్ అవుతుంది.

#4

#4

ఈ ప్లాన్ తో రెంట్‌ ఫ్రీ ల్యాండ్‌ లైన్‌ అవకాశం ఉంటుంది. రూ.49 నామమాత్రపు నెలసరి రెంటల్‌తో ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ సేవలు అందుతాయి.

#5

#5

ఈ ఫథకం కింద ల్యాండ్ లైన్ కనెక్షన్ తీసుకునేవారికి ఉచిత ఇన్‌స్టాలేషన్‌తో పాటు, ఉచిత సిమ్‌ అందజేస్తారు.

#6

#6

ఆదివారాలు రోజంతా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా ఫోన్‌ చేసుకునే సదుపాయంతో పాటు మిగతా రోజుల్లోను రోజూ రాత్రి తొమ్మిదింటి నుంచి మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు ఉచితంగా ఫోన్‌ చేసుకునేందుకు అనుమతిస్తారు.

#7

#7

అయితే ఆరు నెలల తర్వాత ఖాతాదారులు ఈ పథకం నుంచి ఆయా ప్రాంతాల్లో ఉండే ఫిక్స్‌డ్‌ మంత్లీ ఛార్జీలు వర్తించే సాధారణ పథకాలకు మారాల్సి ఉంటుంది.

#8

#8

బిల్లులు చెల్లించక డిస్‌ కనెక్ట్‌ అయిన ల్యాండ్‌లైన్‌ ఖాతాదారులు కూడా ఈ పథకం కింద మళ్లీ బిఎస్ఎన్‌ఎల్‌ ల్యాండ్‌లైన్‌ కనెక్షన్‌ తీసుకోవచ్చు.

#9

#9

మొత్తం మీద ఈ పథకం కింద బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ తీసుకున్న వినియోగదారులు ఆరు నెలల తర్వాత నెలకు రూ.470 ఉండే ‘బిబిజి కాంబో అన్‌లిమిటెడ్‌ 470' ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
BSNL 4G Unlimited Broadband Plans: BB249 Internet Data Offers read more gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X