BSNLకు దశ తిరుగుతోందా, నెలలో 29 లక్షల కొత్త యూజర్లు

అనుకున్నటార్గెట్ కంటే 2.5 లక్షల కనెక్షన్‌లను ఎక్కువుగా రాబట్టటంతో మార్కెట్ పై బీఎస్ఎన్ఎల్‌ మరింతగా దృష్టిసారించబోతున్నట్లు సమాచారం.

|

ప్రయివేటు ఆపరేటర్లకు పోటీగా అన్‌లిమిటెడ్ ఆఫర్‌లను లాంచ్ చేసి టెలికం సర్కిల్‌లో టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచిన బీఎస్ఎన్ఎల్‌కు కొత్త యూజర్ల తాకిడి పెరుగుతోంది.

Read More : జియో సంచలనం.. రూ.309కే 448జీబి డేటా, 8 నెలలు వాడుకోవచ్చు

29.5 లక్షల కొత్త ప్రీపెయిడ్ యూజర్లు...

29.5 లక్షల కొత్త ప్రీపెయిడ్ యూజర్లు...

keralatelecom.info పోస్ట్ చేసిన కథనం ప్రకారం, ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఒక్క మార్చి నెలలోనే 29.5 లక్షల కొత్త ప్రీపెయిడ్ కనెక్షన్‌లను రాబట్టుకోగలిగింది. అనుకున్న టార్గెట్ కంటే 2.5 లక్షల కనెక్షన్‌లను ఎక్కువుగా రాబట్టటంతో మార్కెట్ పై బీఎస్ఎన్ఎల్‌ మరింతగా దృష్టిసారించబోతున్నట్లు సమాచారం.

ఒక్కో సర్కిల్‌కు ఒక్కో టార్గెట్‌..

ఒక్కో సర్కిల్‌కు ఒక్కో టార్గెట్‌..

మార్చి, 2017కు గాను 2.7 మిలియన్ ప్రీపెయిడ్ కనెక్షన్‌లను రాబట్టే క్రమంలో ఒక్కో సర్కిల్‌కు ఒక్కో టార్గెట్‌ను బీఎస్ఎన్ఎల్ నిర్థేశించుచుకుంది. 22 సర్కిళ్లకు గాను 18 సర్కిళ్లలో తన టార్గెట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

18 సర్కిళ్లలో టార్గెట్ రీచ్..
 

18 సర్కిళ్లలో టార్గెట్ రీచ్..

అండమాన్ నికోబార్, అస్సాం, జార్ఖండ్, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ (పశ్చిమ), ఉత్తర ప్రదేశ్ (ఈస్ట్), ఉత్తరాంచల్, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సర్కిళ్లలో నిర్థేశించిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో కనెక్షన్‌లను బీఎస్ఎన్ఎల్ రాబట్టగలిగింది.

నిరాశపరిచిన తెలుగు రాష్ట్రాలు..

నిరాశపరిచిన తెలుగు రాష్ట్రాలు..

ఆంధ్రప్రదేశ్, చెన్నై, బిహార్, జమ్ము అండ్ కాశ్మీర్ ఇంకా నార్త్ ఈస్ట్ - II సర్కిళ్లలో మాత్రం అనుకున్న కొత్త కనెక్షన్‌లను బీఎస్ఎన్ఎల్ రాబట్టలేకపోయింది.

రూ.339 ప్లాన్‌కు భారీ స్పందన...

రూ.339 ప్లాన్‌కు భారీ స్పందన...

ఇటీవల బీఎస్ఎన్ఎల్ అనౌన్స్ చేసిన రూ.339 ప్లాన్‌కు భారీ స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్లు రూ.339 రీచార్జ్ ప్లాన్‌ను పొందటం ద్వారా 28 రోజుల పాటు ( బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్) అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబి 3జీ డేటాను పొందవచ్చు.

డేటా లభిస్తున్నప్పటికి  కాల్స్ మాత్రం బీఎస్ఎన్ఎల్ పరిధిలోనే..

డేటా లభిస్తున్నప్పటికి కాల్స్ మాత్రం బీఎస్ఎన్ఎల్ పరిధిలోనే..

ఈ ఆఫర్‌లో డేటా ఎక్కువగానే లభిస్తున్నప్పటికి అన్‌లిమిటెడ్ కాల్స్ మాత్రం బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ పరిధిలోనే ఉండటం కొంత మేర నిరుత్సాహపరిచే విధంగా ఉంది.

Best Mobiles in India

English summary
BSNL Activates a Record 2.95 Million Prepaid Connections in March 2017: Report. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X