జియోకి కౌంటర్: BSNL 24 గంటలు ఫ్రీ కాలింగ్, అన్‌లిమిటెడ్ డేటా

By Hazarath
|

బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపింది. బ్రాడ్‌బాండ్ ద్వారా 24 గంటలు ఉచిత కాలింగ్‌తో పాటు అన్ లిమిటెడ్ డేటాతో దుమ్ము రేపేందుకు రెడీ అయింది. ఉచిత ఆఫర్లతో జియో దూసుకుపోతున్న నేపధ్యంలో బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 2 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఈ కాల్స్ వెళతాయని బిఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్లాన్ పొందాలంటే వినియోగదారులు రూ. 1199తో రీ ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు

#1

#1

ఈ ఆఫర్ ద్వారా 10 మిలియన్ల బ్రాడ్‌బాండ్ కష్టమర్లను పెంచుకోవడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ ప్రయత్నిస్తోంది. అందుకే దీని పేరు కూడా ‘BBG Combo ULD 1199 గా నామకరణం చేసింది.

#2

#2

ఈ ప్లాన్ అన్ని చోట్లా అందుబాటులో ఉంటుందని అలాగే కొత్త, పాత కష్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని బిఎస్ఎన్ఎల్ తెలిపింది.

#3

#3

జీరో ఇన్ స్టాలేషన్ ఛార్జీలతో పాటు 2 Mbps అన్ లిమిటెడ్ డేటా ఈ ఆఫర్‌తో లభిస్తుంది. అలాగే ఇండియాలో ఎక్కడికైనా లాండ్ లైన్ నుంచి మీరు వాయిస్ కాల్స్ ఫ్రీగా చేసుకోవచ్చు.

#4
 

#4

దీన్ని సంవత్సరం కింద కూడా ప్రవేశపెట్టింది. సంవత్సరానికి మీరు రూ. 13189 చెల్లించి మీరు సంవత్సరమంతా ల్యాండ్ లైన్ నుంచి ఫ్రీ కాల్స్, అలాగే నెట్ ద్వారా అన్ లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు.

#5

#5

ఇక ఇదే ప్లాన్ రెండు సంవత్సరాలకు కూడా ప్రవేశపెట్టింది. రూ. 25179తో మీరు రెండు సంవత్సరాల వరకు ల్యాండ్ లైన్ నుంచి ఫ్రీ కాల్స్, అలాగే నెట్ ద్వారా అన్ లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు.

#6

#6

ఇక ఇదే ప్లాన్ మూడు సంవత్సరాలకు కూడా ప్రవేశపెట్టింది. రూ. 35970తో మీరు రెండు సంవత్సరాల వరకు ల్యాండ్ లైన్ నుంచి ఫ్రీ కాల్స్, అలాగే నెట్ ద్వారా అన్ లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు

#7

#7

డౌన్‌లోడ్ అప్‌లోడ్ అన్ లిమిటెడ్. ఐపీ అడ్రస్ రిక్వెస్ట్ కోసం సంవత్సరానికి రూ. 2000 అదనంగా చెల్లించాలి. దీంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
BSNL launches Broadband combo at Rs.1199 with 2 Mbps unlimited data and 24 hours free calling across all circles Read more gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X