రూపాయికే 1జీబి ఇంటర్నెట్, BSNL సంచలన నిర్ణయం!

|

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎస్ఎల్ (BSNL) మరో సంచలన ఆఫర్‌తో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న తన వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల సంఖ్యను మరింతగా పెంచుకునేందుకు ఓ అన్‌లిమిటెడ్ ప్రమోషనల్ ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ త్వరలో లాంచ్ చేయబోబోతోంది.

Read More : 12జీబి ర్యామ్, 60 మెగా పిక్సల్ కెమెరాతో 8 సిమ్ కార్డ్ లను సపోర్ట్ చేసే ఫోన్ వచ్చేస్తోంది!

#1

#1

ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారుడు కేవలం రూ.249 చెల్లించి నెల మొత్తం మీద 300జీబి ఇంటర్నెట్ ను వినియోగించుకోవచ్చు.రిలయన్స్ జియో, 1జీబి ఇంటర్నట్‌ను రూ.50కు ఆఫర్ చేస్తోన్న నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఈ అన్‌లిమిటెడ్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ తో ముందుకు రావటం విశేషం.

 

#2

#2

Experience Unlimited BB 249 పేరుతో బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేయబోతోన్న ప్రమోషనల్ అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ సెప్టంబర్ 9 నుంచి అమలులోకి రానుంది.

 

#3
 

#3

బృహత్తరమైన ఆలోచనతో తాము లాంచ్ చేయబోతోన్న ఈ ఆఫర్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరిచటంతో పాటు వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సేవల వైపు కొత్త వినియోగదారులను ఆకర్షించిలా చేస్తుందని బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ చైర్మన్ ఇంకా మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు.

 

#4

#4

ఈ ప్లాన్‌లో భాగంగా రూ.249 చెల్లించి నెల మొత్తం మీద 300జీబి ఇంటర్నెట్‌ను 2 Mbps వరకు వేగంతో అపరిమితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

#5

#5

ఒక్కో కనెక్షన్‌కు 6 నెలల పాటు వర్తించే ఈ ఆఫర్‌లో భాగంగా 1జీబి డేటాను రూపాయి కన్నా తక్కువ మొత్తానికి బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేయనుంది.

#6

#6

6 నెలలు పూర్తి అయిన తరువాత కస్టమర్ తన ఛాయిస్‌ను బట్టి రెగ్యులర్ ప్లాన్‌కు మైగ్రేట్ కావల్సి ఉంటుంది.

#7

#7

జియో 4జీకి పోటీగా బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే నేషన్‌వైడ్ అన్‌లిమిటెడ్ 3జీ మొబైల్ డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భాంగా రూ.1,099 చెల్లించినట్లయితే 30 రోజుల పాటు 3జీ డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు.

#8

#8

కొన్ని Existing planలకు సంబంధించి బీఎస్ఎన్ఎల్ డేటా లిమిట్‌ను డబల్ చేసింది. ఉదాహరణకు మీరు రూ.549 ప్లాన్‌లో ఉన్నట్లయితే ఇకనుంచి మీరు 10జీబి 3జీ డేటాను ఆస్వాదించవచ్చు. ఈ 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో భాగంగా గతంలో 5జీబి డేటాను మాత్రమే బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేసేది. అలానే రూ.156 ప్లాన్‌లో ఉన్న యూజర్లు 2జీబి 3జీ డేటాను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 10 రోజులు మాత్రమే.

Best Mobiles in India

English summary
BSNL to Introduce unlimited broadband data at Rs 249. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X