నెలకి 300జిబి డేటా, BSNL మరో సంచలనం

ప్రభుత్వ రంగ దిగ్గజం తమ కష్టమర్ల కోసం సంచలన ఆఫర్ ని తీసుకొచ్చింది

Written By:

జియో దెబ్బకి టెల్కోలు ఆఫర్ల మీద ఆఫర్లకు కురిపిస్తున్నాయి. ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్, డొకొమా లాంటి సంస్థలు ఇప్పటికే భారీ ఆఫర్లతో జియోకి పోటీగా వస్తున్నాయి. ఈ బాటలో ఇప్పుడు BSNL కూడా నడుస్తోంది. ప్రభుత్వ రంగ దిగ్గజం తమ కష్టమర్ల కోసం సంచలన ఆఫర్ ని తీసుకొచ్చింది. ఆఫర్ పై ఓ స్మాల్ లుక్కేయండి.

జియోతో పోటీకి వచ్చే ఆఫర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నెలకి రూ. 249 బ్రాండ్ బాండ్ ప్లాన్ ద్వారా

నెలకి రూ. 249 బ్రాండ్ బాండ్ ప్లాన్ ద్వారా కష్టమర్లు 300 జిబి నెల రోజుల పాటు పొందవచ్చు. ఇది ఇంతకుముందు వచ్చిన బిబి అన్ లిమిటెడ్ ప్రయోగంలో భాగమే.

నైట్ 9నుంచి ఉదయం 7వరకు అన్ లిమిటెడ్ కాల్స్

అంతే కాకుండా నైట్ 9నుంచి ఉదయం 7వరకు అన్ లిమిటెడ్ కాల్స్ ని అందిస్తోంది. ఈ ఆఫర్ వచ్చే ఆరు నెలల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత కష్టమర్లు రూ. 499లోకి మారాల్సి ఉంటుంది.

మార్చి నుంచి అందుబాటులో

BSNL సైట్లో కూడా ఆఫర్ మార్చి నుంచి అందుబాటులో ఉందని చూపిస్తోంది. దీన్ని BSNL ఎగ్జిక్యూటివ్ కూడా కన్ ఫర్మ్ చేశారు.

రోజుకి 10 జిబి డేటాను

ఈ ప్లాన్ లో వినియోగదారులు రోజుకి 10 జిబి డేటాను పొందవచ్చు. 2ఎంబీపీఎస్ వరకు స్పీడ్ ఉంటుంది. 10 జిబి డేటా అయిపోయిన తరువాత 1 ఎంబిపిఎస్ తో మీకు డేటా లభిస్తుంది.

కొత్త కష్టమర్లు 1జిబి డేటా ఫ్రీగా పొందే అవకాశాన్ని

BSNL ఇంతకుముందు కూడా కష్టమర్ల కోసం ఓ ఆఫర్ ని తీసుకొచ్చిన విషయం విదితమే. కొత్త కష్టమర్లు 1జిబి డేటా ఫ్రీగా పొందే అవకాశాన్ని BSNL కల్పించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
BSNL's New Plan Offers Up to 300GB Data per Month, Free Night Calls reaad more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting