బీఎస్ఎన్ఎల్ ఉచిత కాల్స్ జనవరి నుంచేనా?

రిలయన్స్ జియోను ధీటుగా ఎదర్కొనేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

|

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియోకు పోటీగా 2017 నుంచి ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. జియో అందిస్తోన్న వెల్‌కమ్ ఆఫర్ డిసెంబర్ 31, 2016తో ముగుస్తోన్న విషయం తెలసిందే.

Read More : బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ ఏది?

BSNL అదించబోయే ఉచిత వాయిస్ కాల్స్..

BSNL అదించబోయే ఉచిత వాయిస్ కాల్స్..

ఆ తరువాతి నుంచి జియో యూజర్లు రిలయన్స్ ఆఫర్ చేస్తున్న టారిఫ్ ప్లాన్‌లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. డేటాకు మాత్రమే డబ్బులు చెల్లిస్తే చాలని, వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితమని జియో ప్రకటించిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్, ఈ ఉచిత కాల్స్ ఆఫర్ ను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. BSNL అదించబోయే ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్స్ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం..

నెట్‌వర్క్‌ల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించినట్లయితే

నెట్‌వర్క్‌ల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించినట్లయితే

జియో పూర్తిస్థాయి 4జీ ఎల్టీఈ నెట్‌‌వర్క్‌ను ఆఫర్ చేస్తోంది. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ ఇప్పుడిప్పుడే 4జీ నెట్‌వర్క్‌‌కు మారుతోంది. జియో వాయిస్ కాల్స్ అందించేందుకు VoLTE టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేయబోయే ఉచిత వాయిస్ కాల్స్ వినియోగదారులకు ఏ విధంగా రీచ్ అవుతాయనే దాని పై ఇంకా స్పష్టత లేదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నెట్‌వర్క్ డ్రాపింగ్ సమస్యలు..
 

నెట్‌వర్క్ డ్రాపింగ్ సమస్యలు..

రిలయన్స్ జియో భారతదేశపు మొట్టమొదటి LTE-only నెట్‌వర్క్ కావటం. ఈ సౌలభ్యతతో జియో సిమ్ యూజర్లు నెట్‌వర్క్ డ్రాపింగ్ సమస్యలను ఫేస్ చేసే అవకాశముండదు. ఇది ఖచ్చితంగా రిలయన్స్ జియోకు కలిసొచ్చే అంశం. ఇదే సమయంలో జియో పోటీగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేయబోయే ఉయిత వాయిస్ కాల్స్ నాణ్యత ఎలా ఉంటుందనేది ప్రశ్నార్థకం!

 2జీ, 3జీ, యూజర్లకు కూడా..

2జీ, 3జీ, యూజర్లకు కూడా..

బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేయబోలే ఉచిత వాయిస్ కాల్స్ 2జీ, 3జీ, యూజర్లకు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది ఖచ్చితంగా బీఎస్ఎన్ఎల్ కు కలిసొచ్చే అంశం.

2017 నుంచి అత్తి తక్కువ ధరల్లోనే ..

2017 నుంచి అత్తి తక్కువ ధరల్లోనే ..

బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్స్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు కూడా అందుబాటులో ఉంటాయట. ప్రస్తుతం తాము జియో పనితీరును పూర్తిగా పరిశీలన చేస్తున్నామని, జియో తరహాలోనే 2017 నుంచి అత్తి తక్కువ ధరల్లోనే లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫ్రీ వాయిస్ కాల్స్‌ను వినియోగదారులకు చేరువ చేస్తామని ఆయన చెప్పారు.

జియో కంటే తక్కువ రేట్లకు

జియో కంటే తక్కువ రేట్లకు

జియో కంటే తక్కువ రేట్లకు ఉచిత వాయిస్ కాల్స్ అందించేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలిపిన వివరాల ప్రకారం ఈ టారిఫ్ ప్లాన్స్ విలువ రూ.2 నుంచి రూ.4 మధ్య ఉండొచ్చు. రూ.6,000కే సరికొత్త Redmi ఫోన్‌?

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
BSNL to offer Free Voice Calls that Cheaper Than Jio Data Tariffs?. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X