30 వేల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇంటికి..ఎక్కడో తెలుసా ?

అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా వెలుగొందుతున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు షాకిస్తోంది.

By Hazarath
|

అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా వెలుగొందుతున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు షాకిస్తోంది. అయితే అలాంటిదేమీ లేదని కంపెనీ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ మెహతా 'ఎకనామిక్స్‌ టైమ్స్‌' పత్రికతో చెప్పినా, పనితీరు సరిగా లేదనే పేరుతో 25,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇందులో హైదరాబాద్‌ కేంద్రం నుంచి 4,000 మంది ఉంటారని సమాచారం.

మోటో సంచలనం, అతి చిన్న బ్యాటరీతో Moto Z2 Play


పనితీరు సరిగాలేని 6,000 మంది ఉద్యోగులను

పనితీరు సరిగాలేని 6,000 మంది ఉద్యోగులను

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్‌-1బి వీసాల జారీని కఠినం చేయడంతో అమెరికా కంపెనీ అయిన కాగ్నిజెంట్‌ కూడా అక్కడ నియామకాలు పెంచి, భారతలో తగ్గించాలనుకుంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం పనితీరు సరిగాలేని 6,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించే అవకాశం ఉందని ఇటీవల ప్రకటించింది.

తొలగింపులు అంతకంటే భారీగానే ఉంటాయని

తొలగింపులు అంతకంటే భారీగానే ఉంటాయని

అయితే ఈ ఏడాది తొలగింపులు అంతకంటే భారీగానే ఉంటాయని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. పని తీరు సరిగాలేని ఉద్యోగులను ఇంటికి పంపించడం సాధారణమే. అయితే ఏటా వీరి సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో అర శాతం నుంచి ఒక శాతంలోపే ఉంటుంది. ఈ ఏడాది మాత్రం 7 నుంచి 10 శాతం మంది ఉద్యోగులను ఇలా ఇంటికి పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గత మూడు నెలల నుంచి దశల వారీగా

గత మూడు నెలల నుంచి దశల వారీగా

బయటి కంపెనీల నుంచి మంచి ఆఫర్లు వచ్చినా వాటిని కాదనుకుని కాగ్నిజెంట్‌నే నమ్ముకున్న ఉద్యోగులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇంత మంది ఉద్యోగులను ఒక్కసారే బయటికి పంపిస్తే పెద్ద ఎత్తున సమస్యలు వస్తాయనే భయంతో కాగ్నిజెంట్‌ గత మూడు నెలల నుంచి దశల వారీగా ఇలా ఉద్యోగులను బయటికి పంపిస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు.

లేబర్‌ కమిషనర్‌ను

లేబర్‌ కమిషనర్‌ను

ఇదిలా ఉంటే చెన్నైలోనూ కాగ్నిజెంట్‌ ఇదే మాదిరిగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసివేయడంతో వారు అక్కడి లేబర్‌ కమిషనర్‌ను ఆశ్రయించారు. ఇపుడు హైదరాబాద్‌ యూనిట్‌లో వేటు పడే ఉద్యోగులూ లేబర్‌ కమిషనర్‌ను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు.

నష్టపరిహారం చెల్లించే విషయంలోనూ

నష్టపరిహారం చెల్లించే విషయంలోనూ

విధుల నుంచి తొలగించే వారికి నష్టపరిహారం చెల్లించే విషయంలోనూ కాగ్నిజెంట్‌ వివక్ష చూపిస్తోందని ఉద్యోగుల ఆరోపణ. డైరెక్టర్లు, అదనపు డైరెక్టర్ల వంటి పెద్ద ఉద్యోగులకు తొమ్మిది నెలల జీతం ఇచ్చి పంపిస్తుంటే, గొడ్డు చాకిరీ చేసే తమను మాత్రం రెండు నెలల నోటీసుతో ఇంటికి పంపిస్తోందని చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
Cognizant relieving 6,000 Indians to hire in US? Techies up in arms read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X