మొబైల్ టవర్స్ సమాచారం ఇక మీ చేతిలో..

మీ లోకేషన్‌లోని మొబైల్ టవర్‌కు సంబంధించి రేడియేషన్ లెవల్స్‌ను చెక్ చేయాలనుకుంటున్నట్లయితే తరంగ్ సంచార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి..

|

తరంగ్ సంచార్ పేరుతో సరికొత్త వెబ్‌సైట్‌ను టెలికం శాఖ మంగళవారం ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా మీ ప్రాంతంలోని మొబైల్ టవర్‌లకు సంబంధించిన వివరాలను తెలుసుకునే వీలుంటుంది. దేశవ్యాప్తంగా 14.6 లక్షల పై చిలుకు బేస్ ట్రాన్సీవర్ స్టేషన్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

Read More : రూ.10,000లో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఫోన్స్, 4G VoLTE సపోర్ట్‌తో..

తరంగ్ సంచార్ సైట్‌లోకి వెళ్లటం ద్వారా..

తరంగ్ సంచార్ సైట్‌లోకి వెళ్లటం ద్వారా..

మొబైల్ యూజర్లు, తరంగ్ సంచార్ సైట్‌లోకి వెళ్లటం ద్వారా తమ ప్రాంతాల్లోని టవర్స్‌కు సంబంధించిన ఆపరేటర్, సపోర్టింగ్ టెక్నాలజీ (2G/3G/4G)ఇంకా ఆ టవర్ విడుదల చేస్తున్న ఎలక్ట్రో మాగ్నటిక్ ఫ్రీక్వెన్సీలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

EMF సేఫ్టీ స్టేటస్ రిపోర్ట్..

EMF సేఫ్టీ స్టేటస్ రిపోర్ట్..

మీ లోకేషన్‌లోని మొబైల్ టవర్‌కు సంబంధించి రేడియేషన్ లెవల్స్‌ను చెక్ చేయాలనుకుంటున్నట్లయితే తరంగ్ సంచార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ పేరు, ఈమెయిల్, అడ్రస్ ఇంకా మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసినట్లయితే టవర్‌కు సంబంధించిన వివరాలతో పాటు EMF సేఫ్టీ స్టేటస్ మీకందుతుంది. ఒకవేళ మీరు, ఆ టవర్‌కు సంబంధించి ఫిజికల్ ఆన్-సైట్ EMF Exposure Measurementను కోరుకుంటున్నట్లయితే టెస్టింగ్ నిమిత్తం రూ.4,000 చెల్లించాల్సి ఉంటుంది.

క్వాలిటీ తగ్గకుండా ఫోటో సైజును తగ్గించటం ఎలా..?

సుప్రీకోర్టు సంచలన నిర్ణయం..
 

సుప్రీకోర్టు సంచలన నిర్ణయం..

బీఎస్ఎన్ఎల్ టవర్ ద్వారా వెలువడిన రేడియేషన్ కారణంగా తాను క్యానర్ బారిన పడ్డానంటూ గ్వాలియర్‌కు చెందిన హరీశ్ చంద్ తివారీ (42) సుప్రీ కోర్డును ఆశ్రయించటంతో అతనికి అనుకూలంగా తీర్పువెలువడిన విషయం తెలిసిందే. ఏడు వారాల్లోగా ఆ టవర్ ను బీఎస్ఎన్ఎల్ డీయాక్టివేట్ చేయాలంటే సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడటం వల్ల..

ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడటం వల్ల..

నిరంతరాయంగా ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడటం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ సంభవించే ప్రమాదముందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో ఫోన్ రేడియేషన్ సమస్య ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది.

ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే వీడియోలు వాటంతటకవే ప్లే అయిపోతున్నాయా..?

 

సెక్యూరిటీ గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నప్పటికి..

సెక్యూరిటీ గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నప్పటికి..

ఫోన్ రేడియోషన్ నుంచి బయటపడేందుకు అనేక మొబైల్ యాక్సెసరీస్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. ఈ సెక్యూరిటీ గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నప్పటికి కొన్ని సందర్భాల్లో ఫోన్‌ను చెవి దగ్గరగా పెట్టుకుని మాట్లాడవల్సి వస్తుంది.

మీరున్న లోకేషన్‌ను బట్టి..

మీరున్న లోకేషన్‌ను బట్టి..

ఈ నేపధ్యంలో మీరున్న లోకేషన్‌ను బట్టి ఫోన్ రేడియేషన్‌ను ఓ కంట కనిపెట్టే సరికొత్త స్మార్ట్‌ఫోన్ యాప్ మార్కెట్లో లభ్యమవుతోంది. ఈ యాప్ పేరు ‘మాగ్నా రేడియేషన్ ప్రొటెక్షన్' . గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌‌షాట్‌ తీసుకోవటం ఎలా..?స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌‌షాట్‌ తీసుకోవటం ఎలా..?

 

మాగ్నా రేడియేషన్ ప్రొటెక్షన్ యాప్‌

మాగ్నా రేడియేషన్ ప్రొటెక్షన్ యాప్‌

మాగ్నా రేడియేషన్ ప్రొటెక్షన్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా మీరు ఉన్న ప్రదేశంలో అన్ని ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్‌కు సంబంధించి రేడియేషన్ శాతాన్ని తెలుసుకోవచ్చు. ఒక వేళ మీరు ఉన్న వాతావరణంలో రేడియేషన్ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే యాప్ మిమ్నల్ని అప్రమత్తం చేస్తుంది. అప్పుడు ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్ చేసుకుని దూరంగా ఉంచి మాట్లాడుకోవచ్చు.

తక్కువ సిగ్నల్‌  ఉన్నప్పుడు..

తక్కువ సిగ్నల్‌ ఉన్నప్పుడు..

మీ ఫోన్ నెట్‌వర్క్ తక్కువ సిగ్నల్‌ను కలిగి ఉన్నప్పుడు అత్యధికంగా రేడియేషన్‌ ఉత్పత్తి అవుతుంది. కాబట్టి, మీ మొబైల్ నెట్‌వర్క్ తక్కువ సిగ్నల్‌లో ఉన్నప్పుడు మాట్లాడటం మానుకోండి.

డిస్‌ప్లే పగిలిన టచ్ ఫోన్‌ను ఎలా ఆపరేట్ చేయాలి..?

గంటల తరబడి మాట్లాడకండి

గంటల తరబడి మాట్లాడకండి

సెల్‌ఫోన్‌లను చెవి దగ్గర పెట్టకుని గంటల తరబడి మాట్లాడకండి. హెడ్‌సెట్‌ వాడడం రేడియేషన్‌ ప్రభావం నుంచి మెదడును రక్షించుకోవటానికి ఇది చాలా తేలికైన మార్గం. ఇది ఫోన్‌ యాంటెనా నుంచి తల దూరంగా ఉండేలా చేస్తుంది. బ్లూటూత్‌ కూడా కొంతమేరకు ఉపయోగపడుతుంది.

ఫేస్‌బుక్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయటం ఎలా..?ఫేస్‌బుక్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయటం ఎలా..?

పక్కన పడేసినప్పుడూ...

పక్కన పడేసినప్పుడూ...

మాట్లాడుతున్నప్పుడే కాదు. పక్కన పడేసినప్పుడూ సెల్‌ఫోన్‌ నుంచి రేడియేషన్‌ వెలువడుతుంది. అందుకే దీన్ని తల పక్కనే పెట్టుకొని అలారం గడియారంలా వాడకపోవటమే మంచిది. దీంతో సెల్‌ఫోన్‌ విద్యుదస్కాంత క్షేత్ర ప్రభావం నుంచి మెదడును కాపాడుకోవచ్చు.

మెసేజ్‌లతోనే ముగించేయండి...

మెసేజ్‌లతోనే ముగించేయండి...

సాధ్యమైనంతవరకు మీ సంభాషనలను మెసేజ్‌లతోనే ముగించేయండి. ఈ సమయంలో సెల్‌ఫోన్‌ మెదడుకు దూరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి రేడియేషన్‌ ప్రభావమూ దానిపై పడదు.

Best Mobiles in India

English summary
Customers can track mobile tower radiation by DOT's new portal. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X