భారీగా తగ్గనున్న ఐఫోన్ ఎస్ఈ ధర

By Hazarath
|

మీరు ఐ ఫోన్ ఎస్ఈ కొనాలనుకుంటున్నారా.. అయితే మీరు ఇంకో కొన్ని నెలలు ఆగారంటే తక్కువ రేటుకే దాన్ని కొనుక్కోవచ్చు.ఎందుకంటే అప్పుడు ఐ ఫోన్ ఎస్ఈ రేటు భారీగా తగ్గే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు..ప్ర్తస్తుతం భారత మార్కెట్లో రూ.39 వేలుగా ఉన్న దీని ధర రూ. 30 వేలకు పడిపోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేట్టు ఈ ఫోన్ ధర తగ్గించనున్నట్టు తెలుస్తోంది.

Read more : ఐఫోన్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోందా..?

1

1

కారణం ఏంటంటే ఐఫోన్ 5ఎస్ భారత్ మార్కెట్లో మంచి డిమాండ్ పలకడం, ఐఫోన్ ఎస్ఈకి ధర తగ్గుదలకు ఆటంకంగా మారింది.

2

2

2015 చివరి క్వార్టర్ లో ఈ ఐఫోన్ 5ఎస్‌లను కంపెనీ ఎక్కువగా దిగుమతి చేసుకుంది. ఈ స్టాక్ అమ్ముడుపోయే వరకు ఐఫోన్ ఎస్ఈ ధర రూ.39 వేలగానే ఉంచేందుకు కంపెనీ నిర్ణయించింది.

3

3

ఒకవేళ ఇప్పుడే ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గిస్తే 5ఎస్ అమ్మకాలు పడిపోయే అవకాశాలు ఉండటంతో, ఐఫోన్ ఎస్ఈ ధర తగ్గింపుకు మరికొన్ని నెలలు ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

4

4

కాని కొన్ని నెలల్లోనే ఆపిల్ కచ్చితంగా ఐఫోన్ ఎస్ఈ ధరను తగ్గిస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా క్యాష్ బ్యాక్, ఈఎంఐ ఆఫర్లను కూడా ఐఫోన్ ఎస్ఈకి యాపిల్ కల్పించనుంది.

5

5

ఐఫోన్ ఎస్ఈకు ముందు మార్కెట్లోకి వచ్చిన 16జీబీ ఐఫోన్ 6ఎస్ ధర కూడా కొన్ని నెలల్లోనే రూ.62 వేల నుంచి రూ.42 లకు పడిపోయింది.

6

6

ఇదే విధంగా కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన ఐఫోన్ ఎస్ఈ ధరను కూడా ఆపిల్ తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఫోన్ 6ఎస్ కు, ఎస్ఈకి పెద్ద తేడాలు ఏమీ లేవని, ఒకే విధమైన ఫీచర్స్ ను ఈ ఫోన్లు కలిగి ఉన్నాయంటున్నారు.

7

7

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్స్ ఇక్కడ క్లిక్ చేపి పొందగలరు.

https://www.facebook.com/GizBotTelugu/

 

Best Mobiles in India

English summary
Here Write Don't buy Apple iPhone SE now, buy it after a month

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X