ఒక్కటైన బిఎన్ఎన్ఎల్, ఫేస్‌బుక్..

ఫేస్‌బుక్ ఇప్పుడు మళ్లీ ఎక్స్‌ప్రెస్ వైఫై‌తో దూసుకొస్తోంది. ఈ సారి గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఫేస్‌బుక్ తన కొత్త ఎత్తుగడలకు తెరలేపినట్లుగా తెలుస్తోంది.

By Hazarath
|

ఫ్రీ బేసిక్స్ పేరిట సామాన్యుడికి కూడా ఇంటర్నెట్ అందిస్తామంటూ గతంలో సంచలనం సృష్టించి అదేస్థాయిలో విమర్శలు మూటగట్టుకున్న ఫేస్‌బుక్ ఇప్పుడు మళ్లీ ఎక్స్‌ప్రెస్ వైఫై‌తో దూసుకొస్తోంది. ఈ సారి గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఫేస్‌బుక్ తన కొత్త ఎత్తుగడలకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. మరి ఫేస్‌బుక్ నుంచి త్వరలో రానున్న ఈ ఎక్స్‌ప్రెస్ వైఫై‌ ఎలాంటి సంచనాలు రేకెత్తిస్తుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

దుమ్ము రేపుతున్న మోడీ గేమింగ్ యాప్స్

ఎక్స్‌ప్రెస్ వైఫైతో

ఎక్స్‌ప్రెస్ వైఫైతో

ఫ్రీ బేసిక్ ద్వారా నెట్ న్యూట్రాలిటీని దెబ్బతీస్తేందనే ఆరోపణలు ఎదుర్కున్న ఫేస్‌బుక్ తాజాగా ఎక్స్‌ప్రెస్ వైఫైతో ముందుకొచ్చింది. ఈ ఎక్స్‌ప్రెస్ వైఫై ద్వారా మీరు మీ మొబైల్స్ కి , సిస్టంకి అత్యంత తక్కువ ధరల్లో కనెక్ట్ కావచ్చని చెబుతోంది.

బిఎస్ఎన్ఎల్ తో జట్టు

బిఎస్ఎన్ఎల్ తో జట్టు

ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఈ ఎక్స్‌ప్రెస్ వైఫై కోసం ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ తో జట్టు కట్టింది రెండు కలిసి సంయుక్త భాగస్వాములుగా ఈ ఎక్స్‌ప్రెస్ వైఫై ని ఇండియాలోని మారూమూల గ్రామాలకు విస్తరించనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రామీణ ప్రాంతాలపై తన దృష్టిని
 

గ్రామీణ ప్రాంతాలపై తన దృష్టిని

ఈ సారి ఫేస్‌బుక్ గ్రామీణ ప్రాంతాలపై తన దృష్టిని పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్స్‌ప్రెస్ వైఫై సేవలను అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు 125 లోకేషన్లలో ఈ వైఫై స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది

డిజిటల్ వోచర్స్ ద్వారా కష్టమర్లు

డిజిటల్ వోచర్స్ ద్వారా కష్టమర్లు

ఇంటర్నెట్ ఆర్గ్ అంటూ అప్పట్లో దూసుకొచ్చిన ఫేస్‌బుక్ అనేక విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ వైఫైని ప్రజల ముందుకు తెస్తోంది. పూర్తి సమాచారం అందుబాటులోకి రానప్పటికీ డిజిటల్ వోచర్స్ ద్వారా కష్టమర్లు డేటా ప్యాక్ లు కొనాల్సి ఉంటుందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో

మరి ఇండియాలో ఏయే లొకేషన్లలో ఈ వైఫైని స్టార్ట్ చేయబోతుందనే వివరాలు ఇంకా చెప్పలేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పవచ్చు.

పూర్తిస్థాయి సేవలు అందిస్తుందా

పూర్తిస్థాయి సేవలు అందిస్తుందా

ఈ వైఫై కూడా ఫ్రీ బేసిక్స్ తరహాలో పరిమితమైన సేవలు అందిస్తుందా లేక పూర్తిస్థాయి సేవలు అందిస్తుందా అనేదానిపైన కూడా ఫేస్‌బుక్ యాజమాన్యం స్పష్టత ఇవ్వలేదు. ఫ్రీ బేసిక్ పోగ్రామ్ ఇంటర్నెట్ డాట్ ఆర్గ్ కొన్ని వెబ్సైట్లకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే!

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎంత ఛార్జ్ చేస్తారన్న సంగతి

ఎంత ఛార్జ్ చేస్తారన్న సంగతి

దీంతోపాటు ఎంత ఛార్జ్ చేస్తారన్న సంగతి వెల్లడించలేదు. ఇప్పటివరకూ ఇది ఓ అద్భుతమైన స్థిరమైన మోడల్ అంటూ చెబుతోంది. రేట్ల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు.

ఫ్రీ బేసిక్స్ కు ఢిపరెంట్ కాదని

ఫ్రీ బేసిక్స్ కు ఢిపరెంట్ కాదని

ఫేస్ బుక్ ఈ నెట్ వర్క్ కోసం ISPs కలిసి పనిచేస్తోంది. ఇది ఫ్రీ బేసిక్స్ కు ఢిపరెంట్ కాదని దానిలాగే ఉంటుందని ఫేస్‌బుక్ చెబుతోంది. మొబైల్ డేటాకు టెల్కోలు ఎటువంటి ఆపర్లను అందిస్తున్నాయో అలానే ఉంటుందని తెలిపింది.

ఇంటర్నేట్ సర్వీస్ ప్రోవైడర్లు, స్థానిక మొబైల్ కంపెనీలతో కలిసి

ఇంటర్నేట్ సర్వీస్ ప్రోవైడర్లు, స్థానిక మొబైల్ కంపెనీలతో కలిసి

ఇందుకోసం ఇంటర్నేట్ సర్వీస్ ప్రోవైడర్లు, స్థానిక మొబైల్ కంపెనీలతో కలిసి పనిచేస్తామని ఫేస్‌బుక్ తమ పేజీలో పేర్కొంది. ఇందుకోసం ఓ సాఫ్ట్వేర్ను రూపొందించి, ఆయా కంపెనీలకు అందిస్తామని, ఇందుకోసం లేజర్ డ్రోన్లను ఉపయోగిస్తామని తెలిపింది.

స్థానిక ఇంటర్నెట్ ప్రొవైడర్లను

స్థానిక ఇంటర్నెట్ ప్రొవైడర్లను

దీని ద్వారా స్థానిక ఇంటర్నెట్ ప్రొవైడర్లను మరింత బలోపేతం చేయడంతో పాటు స్థిరమైన రాబడికి తోడ్పడుతుందని ఫేస్‌బుక్ వివరించింది.

ఎలాంటి నెట్ అందుబాటులో లేని ప్రాంతాల్లో

ఎలాంటి నెట్ అందుబాటులో లేని ప్రాంతాల్లో

మొత్తంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి నెట్ అందుబాటులో లేని ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్ను అందించేలా జుకర్ బర్గ్ సంస్థ సమాయత్తం అవుతోంది.

మరేదైనా కోణం దాగి ఉండవచ్చని

మరేదైనా కోణం దాగి ఉండవచ్చని

అయితే ఇందులో మరేదైనా కోణం దాగి ఉండవచ్చని టెక్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జియోకి పోటీగా ఫేస్‌బుక్ బిఎస్ఎన్ఎల్ తో జట్టుకట్టిందా లేక తన నెట్ వర్క్ పెంచుకునే భాగంలో జత కట్టిందా అనే దానిపై స్పష్టత కోసం మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Facebook Express Wifi in India: Your 10-Point Cheatsheet read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X