బిగ్ ఆయిల్,బిగ్ డేటా..జియో ఇన్‌సైడ్ నిజాలు

By Hazarath
|

ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా అందరి నోటా ఒకటే మాట..అదే జియో..ఈ పదం ఇప్పుడు ఎంత పాపులర్ అంటే అంత పాపులర్..ఉచితంతో ముఖేష్ అంబాని దేశం మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు..అయితే ఆ ఉచితం వెనుక ఉన్న ప్రయోజనాలు ఎవరికీ తెలియదు..కాని ఉచితం అనగానే దేశం యావత్తూ జియో అంటూ కలవరిస్తోంది..అయితే జియో ద్వారా ముఖేష్ కు వచ్చే ఆదాయం ఏంటీ..అసలెలా వస్తుందనే దానిపై కొన్ని ఆసక్తికర విషయాలు మీతో షేర్ చేస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

డేటా ఆఫర్ల సునామి..కష్టమర్లకు ప్రతిరోజూ పండగే

#1

#1

దేశ మంతా జియో ఫీవర్ లో మునిగిన వేళ మీడియా మొత్తం దాన్ని కవర్ చేస్తున్న వేళ దేశంలో ఓ ఆసక్తికర పరిణామం జరిగింది అదేంటో తెలుసా..పెట్రోలు ధరలు పెరగడం..మరి దీనికి జియోకి సంబంధం ఏంటి అంటే చాలానే ఉంది.

#2

#2

పెట్రోలియంలో రిలయన్స్ దే ఆధిపత్యం అని వేరే చెప్పనక్కరలేదు.. దేశంలో మెజార్టీ భాగం రిలయన్స్ ఆధీనంలోనే ఉంది. కాబట్టి లీటర్ పెట్రోల్ కి మూడు రూపాయల ముప్పైఎనిమిది పైసలు, డీజిల్ కు రెండు రూపాయల అరవై ఏడు పైసలు పెరిగాయి.

#3

#3

అయితే దీనికి కారణం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారల్ కి పెరిగిందని చెప్తారు.. అయితే ఇదంతా బాగానే ఉన్నా గతంలో కూడా ఇలా ముడి చమురు ధరలు సగానికి పైగా తగ్గినప్పుడు పెట్రోలు ధరలు తగ్గాలి కదా అని అలా జరగలేదు. పెట్రోలుపై పన్ను రేట్లు పెంచి ప్రజల వీపుపై పెట్రోలు వాత పెట్టారు.

#4

#4

ఇప్పుడు తాజాగా రిలయన్స్ జియోతో ఇచ్చే ఆఫర్ల వల్ల కంపెనీకి అయ్యే ఖర్చు ఆదాయంలో అయిదో వంతు..కంపెనీ జియో ఆఫర్లపై రూ. 10 వేల కోట్లు ఖర్చు పెడితే పెట్రోల్ ధరల పెంపు వల్ల అదే కంపెనికి రూ. 50 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఓ అంచనా..

#5

#5

ఇదే విషయాన్ని అంబాని మార్చిలో చమత్కరించారు.రిలయన్స్ డేటా అనేది న్యూ ఆయిల్ అని ఇంటిలిజెంట్ డేటా అనేది పెట్రోల్ అని చమత్కరించారు. అయితే ఈ విషయాన్ని జనాలు అంతగా పట్టించుకోవపోవడంతో అది కాస్తా తెర వెనక్కి వెళ్లిపోయింది.

#6

#6

అయితే మార్కెట్లోని కొంతమంది విశ్లేషకుల ప్రకారం జియోపై రిలయన్స్ ఎంత ఖర్చు పెట్టినా దానికి డబుల్ వేరే మార్గాల ద్వారా రాబట్టుకునే అవకాశం రిలయన్స్ కు ఉందని చెబుతారు. అయితే జియో పూర్తి స్థాయిలో వస్తే గాని ఎలా ఆదాయం వస్తుందనేది చెప్పేలేము. అంతవరకు వేచి చూడాల్సిందే.

Best Mobiles in India

English summary
Here Write From big oil to big data inside Mukesh Ambanis 20 billion start-up

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X