ప్రారంభమైన గూగుల్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్

|

గూగుల్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ (జీఓఎస్ఎఫ్ 2014) బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. 2012 నుంచి గూగుల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ డిసెంబర్ 12తో ముగుస్తుంది. మూడు రోజుల పాటు సాగే ఈ ఆన్‌లైన్ కొనుగోళ్ల పండగలో భాగంగా 400లకు పైగా బ్రాండ్‌లు ఆకర్షణీయమైన డీల్స్‌తో సిద్ధంగా ఉన్నాయి.

ప్రారంభమైన గూగుల్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్

గూగుల్ క్రోమాకాస్ట్, నెక్సుస్ 6, లెనోవో యోగా టాబ్లెట్, హెచ్‌పి పెవిలియన్ 11-ఎన్108టీయూ ఎక్స్ 360 తదితర కొత్త ఉత్పత్తులు జీఓఎస్ఎఫ్ 2014లో అందుబాటులో ఉన్నాయి.

ఈ ఫెస్టివల్‌లో భాగంగా ‘299 కార్నర్' పేరుతో సరికొత్త విభాగాన్ని గూగుల్ ప్రారంభించింది. మొదటి సారి ఆన్‌లైన్ షాపింగ్‌లో పాల్గొంటున్న వారిని దృష్టిలో ఉంచుకుని భారీ డిస్కౌంట్‌లతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ సెక్షన్‌లో మొబైల్, టాబ్లెట్, కెమెరాలకు సంబంధించిన ఉపకరణాలను రూ.299 ధర పరిధిలో పొందవచ్చు.

జీఓఎస్ఎఫ్ 2014లో అందుబాటులో ఉన్న పలు ఆఫర్లు మీ కోసం...

- రూ.5,999 విలువ చేసే సరికొత్త కైండిల్ ఫైర్‌ను రూ.4,999కే సొంతం చేసుకునే అవకాశం,

- రూ.10,999 విలువ చేసే కైండిల్ పేపర్ వైట్‌ను రూ.8,999కే సొంతం చేసుకునే అవకాశం,

- అమెజాన్ ఇండియా గేమింగ్ కన్సోల్స్ ఇంకా పీసీ గేమ్‌ల పై 60 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది.

- కైండిల్ ఇ-బుక్స్ పై 70 శాతం వరకు తగ్గింపును అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తోంది.

- ప్రముఖ రిటైలర్ ఇన్ఫీబీమ్ అన్ని రకాల ఐఫోన్‌ల పై ఈఎమ్ఐ చెల్లింపు సౌకర్యంతో పాటు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
GOSF 2014 kicks off: Here are some of the best deals. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X