చిక్కుల్లో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్

By Hazarath
|

భారత్ ఈ కామర్స్ బిజినెస్ రంగాన్ని ఓ ఊపు ఊపిన ఫ్లిప్ కార్డ్, స్నాప్ డీల్‌లకు ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు. కంపెనీ ఆదాయాలు తగ్గిపోవడంతో పెట్టుబడుల వైపు చూస్తోంది. అయితే పెట్టుబడిదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ దిగ్గజాల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారయింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఈ కంపెనీలు ఇంకా అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు.

Read more: గ్రాఫిక్స్‌తో మాయ చేస్తున్న జంగిల్ బుక్

1

1

ఈ రెండు కంపెనీలు ఫండ్స్ కోసం ఎంతమంది పెట్టుబడిదారులను కలిసినా అనుకున్నంత పెట్టుబడులు రావట్లేదని నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. 15 బిలియన్ డాలర్ల కోసం ఆరు నెలల కాలంలో ఫ్లిప్ కార్డ్ దాదాపు 15 మందికి పైగా పెట్టుబడిదారులతో మంతనాలు జరిపింది. కానీ వారందరి దగ్గర్నుంచి ఫ్లిప్ కార్డ్ కు వ్యతిరేకత ఎదురైనట్టు తెలుస్తోంది.

2

2

ఇక స్నాప్ డీల్ పరిస్థితి కూడా ఇదేనంట. అలీబాబా గ్రూప్, ఫాక్స్ కాన్, అంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డులను ఫ్లిప్ కార్డ్ కలిసి, పెట్టుబడుల కోసం అభ్యర్థించింది. కానీ వారెవరూ ఫ్లిప్ కార్డ్ లో పెట్టుబడి పెట్టడానికి సమ్మతంగా లేన్నట్టు తెలిసింది.

3

3

2014 మొదలు నుంచి 2015 మధ్య వరకూ ఫ్లిప్‌కార్డ్ కొత్త పెట్టుబడిదారుల ఆకట్టుకోవడం కోసం వివిధ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ కొత్త పెట్టుబడుల విషయంలో అంచనాలను ఆ కంపెనీ తాకలేకపోయింది.

4

4

టైగర్ గ్లోబల్, ఖతర్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ, పాత పెట్టుబడిదారుల నుంచి జూలైలో కేవలం 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులను మాత్రమే కంపెనీ రాబట్టుకోగలిగింది. కొత్త పెట్టుబడులు పెంచుకోవడానికి ఈ సంస్థలు తెగ తాపత్రయం పడుతున్నాయి.

5

5

స్నాప్ డీల్ సహా వ్యవస్థపకులు కునాల్ బాల్, రోహిత్ బన్సల్ లు శాన్ ప్రాన్సిస్కోలో కొత్త పెట్టుబడి దారులతో సమావేశాలు జరిపినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ కంపెనీలు పెట్టుబడులు రాబట్టుకోవడానికి పడుతున్న ఇబ్బందులు మార్కెట్లో వాటి అంచనాలను తగ్గిస్తాయని నిపుణులంటున్నారు.

6

6

అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ పోటీని తట్టుకొని, వాటి బిజినెస్ ను పెంచుకోవాలంటే కచ్చితంగా ఈ రెండు సంస్థలు కొత్త పెట్టుబడులను రాబట్టుకోక తప్పదు. ఇప్పుడు తనకున్న అధీకృత మూలధనం రూ.16 వేల కోట్ల కంటే రెండింతల మూలధనాన్ని అమెజాన్ కంపెనీ కలిగి ఉంది.

7

7

ఈ-కామర్స్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థలపై కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు కూడా ఈ స్టార్డప్ కంపెనీలకు అడ్డంకిగా మారాయి. ఈ నిబంధనలపై ఈ సంస్థలకు అవగాహన తక్కువగా ఉండటంతో ఇబ్బందులకు గురవుతున్నాయి.

8

8

ఆన్ లైన్ రిటైల్ లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ మార్చి 29న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

9

9

ఇప్పటివరకూ ఈ కంపెనీలు అధికంగా ఆపర్ చేస్తున్న డిస్కౌంట్స్ ను ప్రభుత్వ నిబంధనలతో తగ్గించడంతో, వినియోగదారులను ఆకట్టుకోలేక ఈ దీపావళి సీజన్‌లో తక్కువ అమ్మకాలను నమోదు చేశాయి. గత నవంబర్ తో పోలిస్తే ఈ మార్చిలో కంపెనీల ఆదాయాలు కూడా పడిపోయాయి.

10

10

మరి అమెజాన్ ను తట్టుకుని ఈ రెండు కంపెనీలు ఈ కామర్స్ మార్కెట్లో నిలబడాలంటే పెట్టుబడులను పెద్ద ఎత్తున సేకరించక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Best Mobiles in India

English summary
Here Write Have Flipkart, Snapdeal hit a valuation wall

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X