HCL అమరావతికి తరలివస్తోంది !

దేశంలోనే నాలుగో అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలివస్తోంది.

By Hazarath
|

ఆంధ్రుల రాజధాని అమరావతి ఐటీ హబ్ కాబోతోంది. దేశంలోనే నాలుగో అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలివస్తోంది. తన అతిపెద్ద డెవలప్‌మెంట్ సెంటర్లలో ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించాలని హెచ్‌సీఎల్ ప్లాన్స్ వేస్తోంది. దీని కింద మొత్తం రూ.1000 కోట్ల పెట్టుబడులను హెచ్‌సీఎల్ టెక్ పెట్టనుంది.

జియోకి భారీ షాక్..ఎయిర్‌టెల్ రూ.7000 కోట్ల డీల్

hcl

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఈ విషయంపై ఓ అగ్రిమెంట్ కుదుర్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటి అమరావతిలో దీన్ని నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఓ ఐటీ దిగ్గజం పెట్టబోతున్న అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ఇదే అవుతుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

ఉచితంగా యాంటీ వైరస్ టూల్స్ , ఐటీశాఖ కొత్త యాప్

hcl

అయితే ఈ వార్తలపై హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ స్పందించడం లేదు. ఈ డెవలప్ మెంట్ సెంటర్ కోసం అమరావతి పరిసర ప్రాంతాల్లో 30 ఎకరాలకు పైగా భూములు కావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. మరి హెచ్‌సీఎల్ నుంచి వివరణ వచ్చే వరకు ఈ విషయంపై సస్పెన్స్ అలాగే ఉంటుంది.

Best Mobiles in India

English summary
HCL's Rs 1,000-crore development centre to rise from Amaravati read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X