టెల్కోలను చావు దెబ్బ కొట్టిన జియో

ఉచిత వాయిస్ కాల్స్ అంటూ జియో చేసిన సంచలనంతో టెల్కోల మధ్య పోటీ విపరీతంగా పెరిగి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూపోతున్నాయి. ఈ ఊపులో డేటా ఛార్జీలు మరింతగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.

Written By:

ఈ ఏడాది టెలికం రంగంలో సంచలనం ఏదైనా ఉందంటే అది రిలయన్స్ జియో మాత్రమే. ఉచిత ఆఫర్లతో టెలికం రంగంలో దూసుకుపోతున్న టెల్కోలను చావు దెబ్బ కొట్టింది. ఉచిత వాయిస్ కాల్స్ అంటూ జియో చేసిన సంచలనంతో టెల్కోల మధ్య పోటీ విపరీతంగా పెరిగి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూపోతున్నాయి. ఈ ఊపులో డేటా ఛార్జీలు మరింతగా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి.

ట్రంప్ ఐఫోన్, ఖరీదెంతో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో ఉచితంపై ట్రాయ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని

ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్, ఎయిర్‌టెల్ జీరో పేరుతో తీసుకొచ్చిన టారిప్ లు చెల్లవన్న నిర్ణయంపై అప్పుడు కంపెనీలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఇప్పుడు జియో ఉచితంపై ట్రాయ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని  అదే టెల్కోలు మండిపడుతున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారీ స్థాయిలో నష్టాలను

జియో ఉచిత ఆపర్ ను మార్చి వరకు పొడిగించడంతో చిన్నా చితకా టెల్కోలు భారీ స్థాయిలో నష్టాలను మూటగట్టుకున్నాయి. ఎయిర్‌టెల్, ఐడియా లాంటి దిగ్గజ కంపెనీలు మాత్రమే కొంతమేర తట్టుకోగలిగాయి. ఇదే ప్రభావం రానున్న కాలంలో కూడా ఉండే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీలు హెచ్చరికలు సైతం చేస్తున్నాయి.

కాల్ డ్రాప్ సమస్య

ఇక ఈ ఏడాది కాల్ డ్రాప్ సమస్య ఖాతాదారులను ముప్పతిప్పలు పెట్టింది. ట్రాయ్ ఈ విషయంలో కంపెనీలకు జరిమానా విధించడం,కంపెనీలు ట్రాయ్ కు ఆ అధికారం లేదని సుప్రీంకోర్టుకు వెళ్లడం తెలిసిన విషయమే.

గత 12 నెలల్లో అదనంగా 3.51 లక్షల టవర్లు

ఈ విషయంలో ట్రాయ్ కి వ్యతిరేకంగా సుప్రీం తీర్పు ఇవ్వడంతో మరిన్ని అధికారాలు కావాలంటే ప్రభుత్వాన్ని కోరింది. దీంతో కంపెనీలు కూడా తమ రూటును మార్చి అదనంగా సెల్ టవర్ల ఏర్పాటుకు పచ్చజెండా ఊపాయి. గత 12 నెలల్లో అదనంగా 3.51 లక్షల టవర్లు కొత్తగా ఏర్పాటు చేశాయి.

కొద్దిగా సద్దుమణిగినా

కాల్ డ్రాప్స్ సమస్య కొద్దిగా సద్దుమణిగినా, రిలయన్స్ జియో కస్టమర్లకు మాత్రం కాల్ డ్రాప్స్ తప్పడం లేదు. దీంతో రిలయన్స్ జియో ఖాతాదారులు వాయిస్ కాల్స్ మర్చిపోయి ఉచిత డేటా మాత్రమే ఎంజాయ్ చేయాల్సి వస్తోంది.

ఇప్పటికే రూ .9.2 లక్షల కోట్లు

దేశంలోని టెలికాం కంపెనీలు ఇప్పటికే రూ .9.2 లక్షల కోట్లు నెట్వర్క్ల విస్తరణ ఖర్చు చేశాయి. ఇందులో స్పెక్ట్రమ్ కోసమే దాదాపు రూ రూ. 3.5 లక్షల కోట్లు వెచ్చించాయి. ఇంత చేసినా పెరిగిన పోటీతో వార్షిక రాబడులు రూ .2.6 లక్షల కోట్లు దాటడం లేదు.

కంపెనీల అప్పుల భారం

దీంతో ఈ సంవత్సరాంతానికి కంపెనీల అప్పుల భారం రూ .4.2 లక్షల కోట్లకు పెరిగి పోయింది. పోటీతో చార్జీలు మరింత తగ్గడంతో కొన్ని కంపెనీలకు అప్పులపై వడ్డీలు చెల్లించడమూ కష్టంగా మారింది.

రిలయన్స్ కమ్యూనికేషన్స్

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది భారత టెలికాం రంగంలో విలీనాలు మరింత జోరుగా ఊపందుకుంటాయని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఈ విలీనానికి నాంది పలికింది

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Here’s what Reliance Jio and Airtel would be offering in 2017 read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting