కార్గిల్ యుద్దం, వాజ్‌పేయి ఆనాటి లేఖలో ఏముంది,నమ్మలేని నిజాలు ఇవే !

పాకిస్తాన్ యుద్ధం నుంచి తప్పుకోకుంటే ఇండియా బాంబులతోనే సమాధానం చెబుతుందని ప్రధాని వాజ్ పేయి చెప్పారా..

|

భారతదేశ సైన్యపు సత్తాను ప్రపంచానికి చాటిన యుద్ధమది. సరిహద్దులను ఆక్రమిస్తున్న పొరుగుదేశాన్ని రణరంగంలో ఓడించిన యుద్ధమది.. అక్రమంగా భూభాగాల్లోకి చొచ్చుకు వచ్చిన ముష్కరులను పొలిమేరలు దాటే వరకు తరిమి తరిమి కొట్టిన యుద్దమది. అదే కార్గిల్ యుద్ధం. ఆ కార్గిల్ యుద్ధంపై నమ్మలేని నిజాలు ఆ మధ్య సంచలనం రేపాయి. పాకిస్తాన్ యుద్ధం నుంచి తప్పుకోకుంటే ఇండియా బాంబులతోనే సమాధానం చెబుతుందని ఆనాటి ప్రధాని వాజ్ పేయి అమెరికా అద్యక్షుడికి లేఖ రాశారనే వాస్తవాలు సంచలనం రేపుతున్నాయి.కార్గిల్ వార్‌పై స్పెషల్ కథనం.

Read more: ఉగ్రపోరులో మీరు మెచ్చిన 10 స్టోరీలు

భారత్ పాకిస్తాన్ ల మధ్య 1999లో జరిగిన కార్గిల్ యుద్దం

భారత్ పాకిస్తాన్ ల మధ్య 1999లో జరిగిన కార్గిల్ యుద్దం

భారత్ పాకిస్తాన్ ల మధ్య 1999లో జరిగిన కార్గిల్ యుద్దం మరిన్ని రోజులు కొనసాగి ఉంటే పెను ప్రమాదమే సంభవించి ఉండేది.యుద్ధ భూమిలో అణుబాంబులు పడి ఉండేవి. పెను నష్టం జరిగి ఉండేదే.అయితే అప్పటికప్పుడు పాకిస్తాన్ ఓటమిని ఒప్పుకోవడంతో యుద్ధం ముగిసి హిరోషిమా ,నాగసాకిల అనుభవాలు పునరావృతం కాలేదు.

తాము వేసే తదుపరి స్టెప్ భయంకరంగా ఉంటుందని

తాము వేసే తదుపరి స్టెప్ భయంకరంగా ఉంటుందని

అసలు విషయం ఏమిటంటే నాడు కార్గిల్ యుద్ధంలో పాక్ తన తప్పు తెలుసుకుని వెనకడుగు వేస్తే సరి లేదంటే తాము వేసే తదుపరి స్టెప్ భయంకరంగా ఉంటుందని నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి రాసిన లేఖను నాటి జాతీయ భద్రతా సలహాదారు బ్రజేష్ మిశ్రా జెనీవాలో అమెరికా అధ్యక్షుడు ప్రతినిధికి అందజేశారు.

వాజ్ పేయి లేఖను అందుకున్న అమెరికా ప్రతినిధి
 

వాజ్ పేయి లేఖను అందుకున్న అమెరికా ప్రతినిధి

వాజ్ పేయి లేఖను అందుకున్న అమెరికా ప్రతినిధి లేఖ అర్థమేంటని మిశ్రాను ప్రశ్నించారు. దీనికి మిశ్రా కాస్త లౌక్యంగానే సమాధానమిచ్చారు. అసలు విషయాన్ని అమెరికా ప్రతినిధికి చెప్పలేదట. అయితే ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్యూలో ఆ లేఖ అర్థాన్ని బ్రజేష్ వెల్లడించారు.తాను చనిపోవడానికి రెండు నెలల ముందు బ్రజేష్ మిశ్రా ఎన్డీటీవికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఈ లేఖపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అణుబాంబుల ప్రయోగం కూడా లేదని చెప్పలేను

అణుబాంబుల ప్రయోగం కూడా లేదని చెప్పలేను

ఏదో విధంగా వారిని తరిమికొట్టేస్తాం అని ఆ లేఖలో వాజ్ పేయి రాసినట్లు ఆయన ఇంటర్యూలో పేర్కొన్నారు. నియంత్రణ రేఖను దాటేందుకు వెనుకాడేది లేదు. అణుబాంబుల ప్రయోగం కూడా లేదని చెప్పలేను అన్న కోణంలోనే వాజ్ పేయి ఆ లేఖ రాశారట.

ఎన్టీటీవీ కన్సల్టింగ్ ఎడిటర్ బర్కాదత్ రాసిన

ఎన్టీటీవీ కన్సల్టింగ్ ఎడిటర్ బర్కాదత్ రాసిన

ఈ వివరాలను ఎన్టీటీవీ కన్సల్టింగ్ ఎడిటర్ బర్కాదత్ రాసిన దిస్ ఆన్ క్వైట్ ల్యాండ్ స్టోరీస్ ఫ్రం ఇండియాస్ ఫాల్ట్ లైన్ పుస్తకంలో ప్రస్తావించారు. ఆనాటి యుద్ధంలో భారత సైన్యం అనుసరించిన వ్యూహాలతో పాటు రచించి అమలు చేయని వ్యూహాలను కూడా బర్కాదత్ ఈ పుస్తకంలో వివరించారు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత విదేశాలతో జరిగిన యుద్ధాలలో

స్వాతంత్య్రం వచ్చిన తరువాత విదేశాలతో జరిగిన యుద్ధాలలో

అయితే భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత విదేశాలతో జరిగిన యుద్ధాలలో కార్గిల్ యుద్ధం నాల్గవది. అంతకుముందు జరిగిన యుద్ధాలన్నింటిలోనూ ఇండియానే విజయాన్ని సాధించింది. అయితే యుద్ధంలో విజయం సాదించినా కానీ ప్రతిసారి దౌత్యంలో ఓడిపోతూ రణరంగంలో సైనికులు సాధించిన విజయాలకు విలువ లేకుండా చేసేవారు మన నాయకులు.

రణరంగంలో విజయంతో పాటు దౌత్యరంగంలో కూడా విజయాన్ని

రణరంగంలో విజయంతో పాటు దౌత్యరంగంలో కూడా విజయాన్ని

కార్గిల్‌ యుద్ధంలో మాత్రం రణరంగంలో విజయంతో పాటు దౌత్యరంగంలో కూడా విజయాన్ని సాధించడం మొదటిసారి. ఇది మన ఆధునిక భారత విజయాలకు నాంది అనే చెప్పవచ్చు. ఈ విషయం స్పష్టంగా అవగతమవ్వాలంటే చరిత్రలోకి వెళ్ళక తప్పదు.

ఆ సంతోషాన్ని భారతీయులు పూర్తిగా అనుభవించకముందే

ఆ సంతోషాన్ని భారతీయులు పూర్తిగా అనుభవించకముందే

1947 ఆగష్టు 15న స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఆ సంతోషాన్ని భారతీయులు పూర్తిగా అనుభవించకముందే కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్‌ మనపై దండెత్తి కాశ్మీర్‌లోని కొంత భూభాగాన్ని ఆక్రమించింది. మన సైన్యం మంచి హుషారుతో పాకిస్తాన్‌ దాడిని త్రిప్పికొడుతున్న సమయంలో నాటి ప్రధాని నెహ్రూ యుద్ధ విరమణ ప్రకటించడమే కాక, ఈ గొడవను ఐక్యరాజ్యసమితిలో పెట్టాడు.

ఐక్యరాజ్య సమితి అనే మూడవ వ్యక్తికి అవకాశం

ఐక్యరాజ్య సమితి అనే మూడవ వ్యక్తికి అవకాశం

భారత సార్వభౌమాధికారంలోకి దూరటానికి ఐక్యరాజ్య సమితి అనే మూడవ వ్యక్తికి అవకాశం కల్పించారు. దానితో ఆక్రమణకు గురైన కాశ్మీర్‌ భూభాగం నేటికీ పాకిస్తాన్‌ అధీనంలో ఉండటమే కాక ఇప్పటికీ రావణకాష్ఠం లాగా రగులుతూనే ఉన్నది.

1962లో చైనా అరుణాచల్‌ప్రదేశ్‌ భూభాగాలపై దండెత్తి రాగా

1962లో చైనా అరుణాచల్‌ప్రదేశ్‌ భూభాగాలపై దండెత్తి రాగా

అనంతరం 1962లో చైనా అరుణాచల్‌ప్రదేశ్‌ భూభాగాలపై దండెత్తి రాగా ఎదుర్కొనటానికి కాళ్ళకు బూట్లు లేని పరిస్థితి మన సైన్యానిది. అయినప్పటికి వీరోచితంగా పోరాడింది మన సైన్యం. మన భూభాగం నుండి చైనాను వెళ్ళగొట్టినప్పటికి మన నాయకత్వం మెతకదనం వలన అప్పటి నుండి ఇప్పటివరకు ఆ భూభాగంలో భారత్ - చైనా సరిహద్దు గొడవ సద్దుమణగలేదు.

1965లో పాక్‌ మరల మనపై కాలుదువ్వింది

1965లో పాక్‌ మరల మనపై కాలుదువ్వింది

1965లో పాక్‌ మరల మనపై కాలుదువ్వింది. ఆ సమయంలో మన ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి ‘‘జై కిసాన్‌-జై జవాన్‌'' నినాదంతో గట్టి పట్టుదలతో వ్యవహరించి పాకిస్తాన్‌ను తిప్పికొట్టారు. శాస్త్రీజి రణరంగంలో విజయం సాధించినా మన నాయకత్వం మాత్రం దౌత్యరంగంలో విజయం సాధించలేకపోయింది. చివరకు చర్చలకు రష్యా వెళ్ళి దేశం కాని దేశంలోని తాష్కెంట్‌లో మన ప్రధాని ప్రాణాలను సైతం కోల్పోవలసి వచ్చింది.

మళ్లీ 1971లో ముష్కర పాక్‌ మనపై మూడవసారి చేసిన దాడిని

మళ్లీ 1971లో ముష్కర పాక్‌ మనపై మూడవసారి చేసిన దాడిని

కుక్కతోక వంకర అన్నట్లు మళ్లీ 1971లో ముష్కర పాక్‌ మనపై మూడవసారి చేసిన దాడిని నాటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యూహాత్మకంగా తిప్పికొట్టడమే కాక పాకిస్తాన్‌ అనే దేశాన్ని చీల్చి రెండు ముక్కలు చేసింది. బంగ్లాదేశ్‌ అనే కొత్త దేశానికి ఊపిరి పోసింది. 93వేల మంది పాక్‌ సైనికులు మనకు పట్టుబడ్డారు.

93వేల మంది సైనికులను బేషరతుగా వదలిపెట్టవలసి

93వేల మంది సైనికులను బేషరతుగా వదలిపెట్టవలసి

వీరిని అడ్డం పెట్టుకుని మనం గొంతెమ్మ కోర్కొలు కోరి ప్రయోజనాను పొంది ఉండవచ్చు. కాని దౌత్య రంగంలో అప్రతిష్ఠపాలయ్యే స్థితి భారత్‌కు పునరావృతమైంది. ఇందిరాగాంధీ దౌత్య చర్చలలో మెతకవైఖరితో వెనుకడుగు వేయవలసి వచ్చింది. 93వేల మంది సైనికులను బేషరతుగా వదలిపెట్టవలసి వచ్చింది.

1987లో భారత్‌ - చైనా మధ్య అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర భూభాగం

1987లో భారత్‌ - చైనా మధ్య అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర భూభాగం

ఇక 1987లో భారత్‌ - చైనా మధ్య అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర భూభాగం విషయంలో యుద్ధం లాంటి వాతావరణం ఏర్పడింది. ఈ ప్రతిష్టంభనను అధిగమించడానికి మన విదేశాంగమంత్రి, ప్రధానమంత్రులు (రాజీవ్‌ గాంధీ) బీజింగ్‌ సందర్శించాల్సి వచ్చింది.

1999లో మన కార్గిల్‌ కొండలపై పాక్‌ సేనలు చాపక్రింద నీరులా ప్రవేశించి

1999లో మన కార్గిల్‌ కొండలపై పాక్‌ సేనలు చాపక్రింద నీరులా ప్రవేశించి

అంతా సద్దుమణుగుతున్న సమయంలో 1999లో మన కార్గిల్‌ కొండలపై పాక్‌ సేనలు చాపక్రింద నీరులా ప్రవేశించి ఒక్కసారిగా దాడిని ప్రారంభించారు. కార్గిల్‌ కొండలు పాక్‌ వైపు ఏటవాలుగా (ఎక్కడానికి వీలుగా), మనవైపు 90 డిగ్రీ కోణంలో ఎత్తుగా ఉంటాయి. దానితో పాక్‌ సైనికులు కార్గిల్‌ కొండలను సులభంగా ఆక్రమించి బంకర్లు ఏర్పాటు చేసుకుని సుఖంగా పాతుకుపోయారు.

భారత్‌కు ఎదురుగా వచ్చి యుద్ధం చేసే స్థితి లేదు కాబట్టి

భారత్‌కు ఎదురుగా వచ్చి యుద్ధం చేసే స్థితి లేదు కాబట్టి

అంతేకాక పాక్‌ సైనికులకు ఇటువైపు ఉన్న మన సైనికులు సులభంగా కనబడతారు. దానితో మన సైనికులకు యుద్ధం చేయడం చాలా కష్టతరమైన పరిస్థితి. దీని ఉద్దేశం ఏమిటంటే భారత్‌కు ఎదురుగా వచ్చి యుద్ధం చేసే స్థితి లేదు కాబట్టి యుద్ధరంగాన్ని భారత్ బటాలిక్‌ సెక్టారుకు విస్తరించాల్సి వస్తుంది. అది పాక్ వ్యూహం. ఆనాటి ఆర్మీ చీప్ ముషారప్ పన్నాగం.

ప్రధాని వాజ్‌పేయి సారథ్యంలో మన వ్యూహ బృందం

ప్రధాని వాజ్‌పేయి సారథ్యంలో మన వ్యూహ బృందం

యుద్ధరంగం విస్తరించి, భారతసైన్యం పలుచబడి, యుద్ధం పాకిస్తాన్‌కు అనుకూలంగా మారుతుందనేది పాక్‌ వ్యూహం.అయితే ప్రధాని వాజ్‌పేయి సారథ్యంలో మన వ్యూహ బృందం చర్చించి యుద్ధం కేవలం కార్గిల్‌ వరకే పరిమితం చేయాలని, కేవలం ఎదురుగా వెళ్ళి మాత్రమే తలపడాని నిశ్చయించారు. దీనికోసం పదాతి దళాన్ని వినియోగించారు.

ఈ యుద్ధంలో బోఫోర్స్‌ ఫిరంగులు మనకు ఎంతగానో

ఈ యుద్ధంలో బోఫోర్స్‌ ఫిరంగులు మనకు ఎంతగానో

ఈ యుద్ధంలో బోఫోర్స్‌ ఫిరంగులు మనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ స్థిరమైన వ్యూహంలో మనం ముందుకు వెళ్ళి ఒక్కొక్కటిగా విజయం సాధిస్తుంటే పాక్‌ నివ్వెరపోయింది. ఈ విధంగా మన సైనికులు రణరంగంలో విజయం సాధిస్తుంటే మన ప్రభుత్వం అమెరికా, చైనా మొదలైన అగ్రరాజ్యాలకు మన దౌత్య వేత్తలను పంపించి పాకిస్తాన్‌కు ఎటువంటి మద్దతు లేకుండా ఏకాకిని చేయగలిగింది.

పాక్‌ బిత్తరపోయి తన వ్యూహాన్ని తానే అసహ్యించుకొని

పాక్‌ బిత్తరపోయి తన వ్యూహాన్ని తానే అసహ్యించుకొని

దానితో పాక్‌ బిత్తరపోయి తన వ్యూహాన్ని తానే అసహ్యించుకొని, వెనక్కు తగ్గింది. కార్గిల్‌ కొండలపై ఉన్న పాక్‌ సైనికులు ఎదురుగా వస్తున్న భారత సైనికుల ధాటికి తట్టుకోలేక, పాక్‌ నుండి మద్దతు లభించక ఊపిరాడక, నిర్జీవులైపోయారు. చివరికి 1999 జూలై 26న చివరి పోస్టును మన సైనికులు చేజిక్కించుకొని అక్కడ విజయపతాకం ఎగరేశారు. అదే ఆపరేషన్‌ విజయ్‌ పేరుగా చరిత్ర పుటల్లో మార్మోగిపోయింది.

ఇది జరిగిన కొన్నేళ్లకు పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్

ఇది జరిగిన కొన్నేళ్లకు పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్

ఇది జరిగిన కొన్నేళ్లకు పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ 'కుక్క కాటుకు చెప్పు' దెబ్బ తరహాలోనే కార్గిల్ పోరాటం చోటు చేసుకుందని స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ కీలక పాత్ర పోషించిందని, అందుకు ప్రతీకారంగానే కార్గిల్ వార్ జరిగిందని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు కూడ.

చలికాలంలో సరిహద్దు దళాలు తమ తమ పోస్టులను వదిలి

చలికాలంలో సరిహద్దు దళాలు తమ తమ పోస్టులను వదిలి

అయితే సాధారణంగా చలికాలంలో సరిహద్దు దళాలు తమ తమ పోస్టులను వదిలి వెచ్చని ప్రాంతాలకు వెళతాయి. భారత దళాలు అదే పని చేశాయి..కానీ, పాక్ దళాలు పథకం ప్రకారం అక్కడే తిష్ట వేశాయి. అదను చూసి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చాయి..ఈ చొరబాట్ల వ్యవహారం భారత్ కు మే నెలలో తెలిసింది.

దీన్ని కైవసం చేసుకుంటే లడాఖ్ కూడా భారత్

దీన్ని కైవసం చేసుకుంటే లడాఖ్ కూడా భారత్

కార్గిల్ ప్రాంతం వ్యూహాత్మకంగా చాలా కీలకమైంది..ఇది లడాఖ్ ప్రాంతాన్ని కలుపుతుంది. దీన్ని కైవసం చేసుకుంటే లడాఖ్ కూడా భారత్ చేజారుతుంది. ఫలితంగా సియాచిన్ గ్లేసియర్ కు వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోతాయి. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి సియాచిన్ పాక్ వశం అవుతుంది. ఈ కారణంగానే పాకిస్థాన్ ఇంతకు తెగించింది.దుస్సాహసానికి ఒడిగట్టింది..

ఇది అత్యంత ఎత్తులో జరిగిన యుద్ధం

ఇది అత్యంత ఎత్తులో జరిగిన యుద్ధం

మిగతా యుద్ధాలకన్నా కార్గిల్ యుద్ధం అనేక విధాలుగా ప్రత్యేకమైంది. ఇది అత్యంత ఎత్తులో జరిగిన యుద్ధం. పూర్తిగా మంచుకొండల్లో సాగిన పోరాటం. దాదాపు నెల రోజుల పాటు మొక్కవోని దీక్షతో భారత సేనలు పాక్ సేనలతో తలపడ్డాయి.టైగర్ హిల్, టోలోలింగ్ ఇలా హిమ సానువుల్లోని ఒక్కో స్థావరం నుంచి శత్రు దళాలను తరిమి వేశాయి.

విజయం సాధించినా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి

విజయం సాధించినా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి

అయితే ఈ యుధ్దంలో మనం విజయం సాధించినా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ యుద్ధంలో 537 మంది భారత వీర జవాన్లు నేలకొరిగారు. 1363 మంది క్షతగాత్రులయ్యారు. రెండు యుద్ధ విమానాలను, ఒక హెలికాప్టర్ ను నష్టపోయాం.ఒక భారత జవాను శత్రువుకు ఖైదీగా చిక్కాడు..యుద్ధంలో శత్రు దేశం కన్నా మనకే ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది..

తనకు ఈ యుద్ధంతో సంబంధం లేదని బుకాయించిన పాకిస్థాన్

తనకు ఈ యుద్ధంతో సంబంధం లేదని బుకాయించిన పాకిస్థాన్

తొలుత తనకు ఈ యుద్ధంతో సంబంధం లేదని బుకాయించిన పాకిస్థాన్ చివరకు అంగీకరించక తప్పలేదు. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ దోషిగా నిలబడింది. ఉగ్రవాద దేశంగా ముద్ర వేయించుకుంది. దౌత్యపరంగా పాక్ కోలుకోలేని దెబ్బతిన్నది. పాక్ కు చిరకాలం గుర్తుండే గుణపాఠాన్ని ఈ యుద్ధంతో భారత్ నేర్పింది.

ఇంత చరిత్ర కలిగిన కార్గిల్ యుద్ధంలో

ఇంత చరిత్ర కలిగిన కార్గిల్ యుద్ధంలో

ఇంత చరిత్ర కలిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ తన ఓటమిని ఒప్పుకోక పోయి ఉంటే చరిత్ర పుటల నుంచి ప్రపంచ పటం నుంచి కనుమరుగయ్యేది. భారత్ పన్నిన వ్యూహానికి పాకిస్తాన్ లో బూడిద తప్ప ఏం ఉండేది కాదు .తన చావును తను కొని తెచ్చుకోకుండా యుద్ధ రంగం నుంచి వైదొలిగింది. ఇప్పటికైనా పాకిస్తాన్ తన నీచ బుద్ది మానుకోకుంటే ముందు ముందు జరిగేది అదేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Best Mobiles in India

Read more about:
English summary
Here Write Crossing LoC, use of n-weapons were not ruled out during Kargil war

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X