ఎవరికీ తెలియని జియో పాత ప్రస్థానం..షాకింగ్ నిజాలు

By Hazarath
|

దేశంలో ఇప్పుడు ట్రెండింగ్ అంశం ఏదైనా ఉందంటే అది జియోనే.. మరి ఆ జియో ఎలా పుట్టింది. ఎక్కడ నుంచి మరెక్కడికి తన ప్రస్థానాన్ని ముందుకు తీసుకువెళ్లింది. అసలు ఆ కంపెనీ గురించి ప్రపంచానికి తెలిసిన విషయాలు ఏంటీ..ఏ పేరుతో పుట్టి మరే పేరుతో మార్కెట్ ని శాసిస్తోంది. ఇలా ఎన్నో అంశాలు ఇప్పుడు మన ముందుకు వస్తున్నాయి. జియో పాత ప్రస్థానంపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియో యాప్స్‌తో ఇకపై వీటి అడ్రస్ గల్లంతేనా..?

జియో అంటే హిందీలో జీవించు అని అర్థం

జియో అంటే హిందీలో జీవించు అని అర్థం

రిలయన్స్ నుంచి పుట్టిన జియో అంటే హిందీలో అర్థం ఏంటో తెలుసా జీవించు అని. అంబాని అదే చెబుతున్నారు..మీరు మాములుగా జీవించవద్దు ఎంజాయ్ చేస్తూ జీవించడం అని చెబుతున్నారు. ఏన్నో ఏళ్లుగా పాతుకుపోయిన దిగ్గజ ప్రత్యర్థులను ఒకే ఒక అస్త్రంతో చావు దెబ్బ కొట్టారు.

#2

#2

అయితే ఈ జియో ప్రస్థానం ఎక్కడ నుంచి మొదలైంది.. రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ ఎలా రూపుదిద్దుకుంది?అంటే చాలా ఆసక్తికర సమాధానాలు వినిపిస్తాయి. అవి తెలుసుకోవాలంటే 2010లోకి వెళ్లాలి.

#3
 

#3

2010 మే నెలలో నాలుగేళ్ళపాటు పరస్పరం పోటీ పడకూడదన్న ఒప్పందాన్నిముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ రద్దుచేసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములూ విడిపోయే సమయంలో ఆ ఒప్పందం రాసుకున్న సంగతి పాఠకులకు గుర్తుండే ఉంటుంది. దీంతో అనిల్ అంబాని టెలికామ్ వ్యాపారంలో ప్రవేశించేందుకు మార్గం సుగమమైంది.

#4

#4

వెనువెంటనే 2010 జూన్ లో ప్రభుత్వం బ్రాడ్ బాండ్ అండ్ వైర్లెస్ యాక్సెస్ (బిడబ్ల్యుఎ) వేలం నిర్వహిస్తున్నప్పుడు వేలం ధరలు సహేతుక పరిమితి దాటి పోయాయంటూ వోడాఫోన్, అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ కమ్యూనికేషన్స్, టాటా కమ్యూనికేషన్స్ వెనకడుగేశాయి.

#5

#5

అయితే, ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్ అనే ఒకే ఒక సంస్థ మాత్రం రంగంలో నిలబడి 12 వేల 847 కోట్ల 77 లక్షలకు వేలం పాడి దేశవ్యాప్తంగా మొత్తం 22 సర్కిల్స్ కు ఏకైక విజేతగా మారింది. దేశవ్యాప్తంగా ఆ సంస్థ ఒక్కటే వేలంలో రూ. 4,800 కోట్లకు లైసెన్స్ గెలుచుకుంది.

#6

#6

ఆ కంపెనీ ఏంటో ఎవరూ తొంగిచూడకముందే ముఖేశ్ అంబానీకి చెందిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆ వేలం జరిగిన మరుసటి రోజే అందులో 95 శాతం వాటా కొనేసింది.

#7

#7

ఆ తరువాత జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలో వైమాక్స్ లేదా ఎల్టీఈ లేదా 4 జి మొబైల్ టెక్నాలజీ ద్వారా వైర్లెస్ బ్రాడ్ బాండ్ సర్వీసులు అందజేస్తుందని ప్రకటించారు.

#8

#8

అదే సమావేశంలో కంపెనీ మరో ప్రకటన కూడా చేసింది. వచ్చే ఏడాది కాలంలో ఈ సంస్థలో 18 నుంచి 20 వేలకోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పింది. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో సేవలు మొదలుపెట్టకపోయినా సంస్థ మాత్రం తన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు బలోపేతం చేసుకోవటానికి తగిన ఏర్పాట్లలో తలమునకలైంది.

#9

#9

ఆ వేలం తర్వాత ఇన్పోటెల్ అనే సంస్థ మిగతా టెల్కోలకు షాకిస్తూ వస్తూనే ఉంది. మూడేళ్ళపాటు అనేక నగరాలలో ప్రయోగాత్మకంగా 4జీని పరీక్షిస్తూనే వచ్చింది తప్ప ఎలాంటి కీలకమైన ప్రకటనా చేయలేదు.

#10

#10

అయితే, 2013 జనవరిలో రిలయెన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ పేరును రిలయెన్స్ జియో గా మార్చింది. అప్పటి నుంచి టెక్ దిగ్గజాలకు షాకిస్తూ వస్తూనే ఉంది.

#11

#11

అదే సమయంలో రిలయన్స్ జియో ఇన్పోకామ్ భారతి ఎయిర్ టెల్ మధ్య ఓ కీలక ఒప్పదం కూడా జరిగింది. భారత్, సింగపూర్ మధ్య సముద్రంగుండా ఉన్న భారతి ఫైబర్ కేబుల్ ను రిలయెన్స్ జియో వాడుకునేలా ఆ ఒప్పందం కుదిరింది.

#12

#12

దాని వలన రిలయెన్స్ జియో కు ఆసియా పసిఫిక్ అంతటా ప్రధాన కేంద్రాలకు అత్యంత వేగవంతమైన కనెక్టివిటీ దొరకటంతోబాటు నేరుగా అనుసంధానమయ్యే వీలుంటుంది. ఇది ముందే ఊహించి ఉండే అవకాశం కూడా లేకపోలేదని మార్కెట్ వర్గాల కథనం 

#13

#13

దీంతో పాటు ఆర్ కామ్ కు దేశవ్యాప్తంగా ఉన్న టెలికామ్ టవర్లు తదితర మౌలిక సదుపాయాలను కలిసి వాడుకునేలా రిలయెన్స్ జియో, రిలయెన్స్ కమ్యూనికేషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు ప్రతిఫలంగా రిలయెన్స్ జియో ఏకమొత్తంగా రూ. 1673 కోట్లు చెల్లించింది.

#14

#14

ఇక మరో కంపెనీ అయిన ఎటిసి ( american tower corporation) తో కూడా ఇదే ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఎటిసి ఇండియా వారి టెలికామ్ టవర్ సదుపాయాన్ని కలిసి వాడుకోవటానికి ఆ సంస్థతో కూడా రిలయెన్స్ జియో ఒక ఒప్పందం చేసుకుంది.

#15

#15

ఇక అక్కడ నుంచి ప్రస్థానం మొదలైందనే చెప్పాలి. ఐఐటి ముంబై లో జరిగిన టెక్ ఫెస్ట్ లో రిలయెన్స్ జియో తన 4 జి నెట్ వర్క్ ను పరీక్షించి చూసింది. వీడియో కాల్స్ ను, జియో టెలివిజన్ సర్వీస్ ను పరీక్షించింది. అప్పుడే మొత్తం 5 వేల పట్టణాలు, నగరాలు, 2 లక్షల 15 వేల గ్రామాలకు విస్తరిస్తామని ముఖేశ్ అంబానీ స్వయంగా ప్రకటించారు.

#16

#16

రిలయెన్స్ జియో దేశవ్యాప్త డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవటంతోబాటు టీవీ రంగంలో బాగా పేరుమోసిన హాత్ వే మాజీ ఎండీ, సీఈవో జయరామన్ ను, మాజీ డెన్ నెట్ వర్క్స్ సీఈవో ఎస్ ఎన్ శర్మ ను ఈ వెంచర్ నడపటం కోసం అప్పట్లో తీసుకున్నారు.

#17

#17

అప్పటినుంచి పరీక్షలు జరుపుతూనే ఉంది. అందులో భాగంగా ఐపిఎల్ ముంబై ఇండియన్స్ మాచ్ ల సందర్భంగా వాంఖేడీ స్టేడియం పరిసరాల్లో రిలయెన్స్ జియో ఉచితంగా 4 జి వైఫై సౌకర్యం కల్పించటం కూడా తెలిసిందే. 

 

 

#18

#18

ఇలా జియో ఎవరికీ తెలియన తన పాత ప్రస్థానాన్ని సాగించింది. ఇప్పుడు జియోగా మారి టెక్ దిగ్గజాల గుండెల్లో కలవరాన్ని పుట్టిస్తోంది. ముందు ముందు ఇది ఏ తీరాలకు చేరుతుందో చూడాలి. 

Best Mobiles in India

English summary
Here Write How Mukesh Ambani’s Reliance Jio Infocomm is set to alter telecom landscape

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X