ఎయిర్‌టెల్‌ను దాటేసిన ఐడియా

వినియోగదారులపరంగా ఐడియా ఎయిర్‌టెల్‌ను దాటేసింది. వొడాఫోన్‌ను విలీనం చేసుకోవడం ద్వారా దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌గా అవతరించింది.

By Hazarath
|

వినియోగదారులపరంగా ఐడియా ఎయిర్‌టెల్‌ను దాటేసింది. వొడాఫోన్‌ను విలీనం చేసుకోవడం ద్వారా దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌గా అవతరించింది. వొడాఫోన్ ఇండియాను తనలో విలీనం చేసుకోవడానికి ఐడియా సెల్యులార్ బోర్డు ఆమోదం తెలిపినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. వొడాఫోన్ ఇండియా మొబైల్ సర్వీసులను తమలో విలీనం చేసుకుని దేశంలో అతిపెద్ద మొబైల్ ఫోన్ కంపెనీగా అవతరించనున్నామని ఐడియా పేర్కొంది.

1 బిలియన్ యాహూ అకౌంట్లు అమ్మకానికి..

idea

దీంతో ఐడియా షేర్లు ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి. మార్కెట్లు 15 శాతం ర్యాలీ నిర్వహిస్తూ లాభాలు పండిస్తున్నాయి. విలీనం తర్వాత అవతరించబోయే కంపెనీలో వొడాఫోన్ 45.1 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉండనుంది. ఈ డీల్ ప్రకారం ఐడియా, వొడాఫోన్లు రెండూ చెరో ముగ్గురు డైరెక్టర్లను నామినేట్ చేసే హక్కులు కలిగి ఉంటాయి.

భారీగా తగ్గిన ఐఫోన్ SE ధర

idea

అయితే చైర్మన్ అపాయింట్ చేసే అధికారం మాత్రం ఐడియా చేతికే వెళ్లిపోయింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ను అపాయింట్ మెంట్ ఇరు ప్రమోటర్లు నిర్ణయించనున్నారు. ఇండస్ టవర్స్ లోని వొడాఫోన్ 42 శాతం వాటాను ఈ డీల్ నుంచి మినహాయించారు.

జియో సీన్ రివర్స్, కష్టమర్ల స్పందన ఎలా ఉందంటే..?

idea

ఈ విలీనం అనంతరం ఏర్పడబోయే కంపెనీకి 40 కోట్ల మంది కస్టమర్లు ఉండనున్నారు. అంటే ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ కంపెనీకే కస్టమర్. ఐడియా, వొడాఫోన్ ల కలయిక టెలికాం సెక్టార్ కు పాజిటివ్ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Best Mobiles in India

English summary
Idea Cellular-Vodafone India announce merger to become country's biggest telecom operator read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X