సత్తా చాటిన ఇండియన్, వైఫై వేగం రెండితులు

By Sivanjaneyulu
|

సింగిల్ యాంటీనా పై వైఫై వేగాన్ని రెండితలు పెంచే సరికొత్త నోవల్ టెక్నాలజీని భారత సంతతి శాస్త్రవేత్త హరీష్ కృష్ణస్వామి అభివృద్థి చేసారు. టెలీకమ్యూనికేషన్ ప్రపంచంలో మైలురాయిగా నిలిచిన ఈ ఆవిష్కరణ భవిష్యత్ అవసరాలకు మరింత తోడ్పాటునివ్వనుంది.

wifi

Read More : చావుని లెక్కచేయని ఫోటోగ్రాఫర్లు

కొలంబియా విశ్వవిద్యాలయంలో డైరెక్టర్‌గా సేవలందిస్తోన్న కృష్ణస్వామి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ను పూర్తి చేసారు. నానో-రెసిప్రోకల్ సర్క్యూలేటర్ ఇంకా ఫుల్ - డుప్లెక్స్ రేడియోలను నానోస్కేల్ సిలికాన్ చిప్ లో అమర్చటం ద్వారా ఈ ప్రయోగం విజయవంతమైందని కృష్ణస్వామి తెలిపారు.

wifi

Read More : ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన సింపుల్ స్మార్ట్‌ఫోన్ టిప్స్

గతేడాది కృష్ణస్వామి నేతృత్వంలోని కొలంబియా శాస్త్రవేత్తల బృందం ఫుల్ డుప్లెక్స్ రేడియో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ టెక్నాలజీని విజయవంతగా ఆవిష్కరించగలిగింది. ఈ టెక్నాలజీని నానోస్కేల్ CMOSలో అమలు చేయటం ద్వారా వైర్‌లెస్ రేడియోలో ఒకే ఫ్రీక్వెన్సీ వద్ద ట్రాన్మిషన్, రిసెప్షలను ఎనేబుల్ చేసే అవకాశం లభించింది.

wifi

Read More : సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి బెస్ట్ ఇండియన్ సిటీలు

అయితే, ఈ సిస్టంకు రెండు యాంటీనా అవసరమవుతాయి. తాజా పరిశోధన నేపథ్యంలో ఒకే యాంటీనా సహాయంతో వైఫై కెపాసిటీని డబుల్ చేసుకునే వీలుంటుంది. ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే స్మార్ట్ ఫోన్ యూజర్లకు స్లో వై-ఫై సమస్యలు ఉండనే ఉండవు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X