రోజుకు 2 గంటలు పైగా ఫోన్‌తో కుస్తీలు

By Hazarath
|

ఇండియా యువత రోజుకు సగటున 2.2 గంటల పాటు మొబైల్‌ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నారని అంతర్జాతీయ రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ టీఎన్‌ఎస్ సర్వే నివేదిక ఒకటి వెల్లడించింది. భారత్‌లో 16-30 ఏళ్ల వయస్కులు సగటున రోజుకు 2 గంటల 20 నిమిషాల పాటు(ఏడాదికి 34 రోజులు) మొబైల్ ఫోన్లపై ఇంటర్నెట్ కోసం వెచ్చిస్తున్నారని ఈ సంస్థ వెల్లడించింది.

Read more : పీకే వ్యాఖ్యలతో లబోదిబోమంటున్న స్నాప్ డీల్

అయితే ఇది అంతర్జాతీయ సగటు (రోజుకు 3.2 గంటలు/ ఏడాదికి 49 రోజులు) కంటే తక్కువగానే ఉందని వివరించింది. భారత్‌లో 31-45 ఏళ్ల వయస్కులు రోజుకు సగటున 1.8 గంటల పాటు, 46-65 ఏళ్ల వయస్కులు రోజుకు సగటున 1.5 గంటల పాటు మొబైల్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. మరి ఇంతలా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ ఒకవేళనీటిలో పడితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా...ఆ జాగ్రత్తలు ఇస్తున్నాం.. పనిలో పనిగా చూసేయండి.

Read more : 2016లో రాబోతున్న ఫోన్‌లు ఏంటి..?

నీటిలో పడ్డ ఫోన్‌ను తీసిన వెంటనే ఆన్ చేయకూడదు

నీటిలో పడ్డ ఫోన్‌ను తీసిన వెంటనే ఆన్ చేయకూడదు

నీటిలో పడ్డ ఫోన్‌ను తీసిన వెంటనే ఆన్ చేయకూడదు. ఫోన్‌పై ఉండే బటన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెస్ చేయకూడదు.

ఫోన్‌ను ఊపడం, విసరడం వంటివి

ఫోన్‌ను ఊపడం, విసరడం వంటివి

ఫోన్‌ను ఊపడం, విసరడం వంటివి చేయకూడదు. ఏం తెలియకుండా ఫోన్ పార్ట్స్‌ను విడదీయకూడదు.

లోపల నీరు చేరిందేమోనని నోటితో గాలిని

లోపల నీరు చేరిందేమోనని నోటితో గాలిని

లోపల నీరు చేరిందేమోనని నోటితో గాలిని ఊదకూడదు. ఇలా చేస్తే నీరు డివైస్‌లోని సున్నితమైన ప్రదేశాల్లోకి వెళ్లి మరింత డ్యామేజ్‌కు గురి చేస్తుంది.

ఏ పద్ధతిలోనూ ఫోన్‌ను హీట్

ఏ పద్ధతిలోనూ ఫోన్‌ను హీట్

ఏ పద్ధతిలోనూ ఫోన్‌ను హీట్ చేయకూడదు.

నీటిలో పడినప్పటికీ ఇంకా ఆన్‌లోనే

నీటిలో పడినప్పటికీ ఇంకా ఆన్‌లోనే

నీటిలో పడినప్పటికీ ఇంకా ఆన్‌లోనే ఉంటే ఫోన్‌ను వెంటనే ఆఫ్ చేసేయాలి.

ఫ్లిప్ కవర్/బ్యాక్ కేస్, సిమ్, మెమోరీ కార్డు,

ఫ్లిప్ కవర్/బ్యాక్ కేస్, సిమ్, మెమోరీ కార్డు,

ఫ్లిప్ కవర్/బ్యాక్ కేస్, సిమ్, మెమోరీ కార్డు, బ్యాటరీలను తీయాలి

పొడి గుడ్డ లేదా పేపర్ టవల్‌తో ఫోన్ డ్రై అయ్యేంత వరకు

పొడి గుడ్డ లేదా పేపర్ టవల్‌తో ఫోన్ డ్రై అయ్యేంత వరకు

పొడి గుడ్డ లేదా పేపర్ టవల్‌తో ఫోన్ డ్రై అయ్యేంత వరకు తుడవాలి. ఫోన్‌లో ఇతర ప్రదేశాలకు నీరు వెళ్లకుండా జాగ్రత్తగా పట్టుకుని ఈ పని చేయాలి.

బయటికి రాని నీటిని

బయటికి రాని నీటిని

బయటికి రాని నీటిని వాక్యూమ్ సహాయంతో తీసేయాలి.

ద్రవాలను పీల్చుకునే శక్తి బియ్యానికి ఎక్కువగా

ద్రవాలను పీల్చుకునే శక్తి బియ్యానికి ఎక్కువగా

కవర్ చేయబడి ఉన్న సంచిలోని బియ్యంలో ఫోన్‌ను పూర్తిగా కప్పాలి. ద్రవాలను పీల్చుకునే శక్తి బియ్యానికి ఎక్కువగా ఉంది. అందుకే ఈ పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఒకటి లేదా రెండు రోజుల పాటు ఫోన్‌ను అలాగే

ఒకటి లేదా రెండు రోజుల పాటు ఫోన్‌ను అలాగే

ఒకటి లేదా రెండు రోజుల పాటు ఫోన్‌ను అలాగే ఉంచాలి. అనంతరం తీసి ఎప్పటిలాగే ఉపయోగించవచ్చు. అయినప్పటికీ ఫోన్ ఆన్ కాకపోతే ముందు చార్జింగ్ కానివ్వాలి. తర్వాత కూడా ఆన్ కానట్టయితే బ్యాటరీ మార్చి చూడవచ్చు.

ఫలితం లేకపోతే చివరిగా సర్వీస్ సెంటర్‌కే

ఫలితం లేకపోతే చివరిగా సర్వీస్ సెంటర్‌కే

ఫలితం లేకపోతే చివరిగా సర్వీస్ సెంటర్‌కే తీసుకెళ్లడం మంచిది. అయితే ఫోన్ ఆన్ అయి ఉపయోగంలోకి వస్తే మాత్రం దాన్ని కొద్ది రోజులు జాగ్రత్తగా పరిశీలించాలి. అందులోని హార్డ్‌వేర్ అంతా పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తుందో లేదో చూడాలి.

Best Mobiles in India

English summary
Here Write Indian Youth Is Spending 2.2 Hours Per Day On Mobile Devices

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X