ఐటీ రంగాన్ని బెంబేలెత్తిస్తున్న విప్రో,ఇన్ఫోసిస్ లేఖలు

విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ అలాగే ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా ఉద్యోగులకు రాసిన లేఖలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

By Hazarath
|

ఐటీ రంగంలో ఇప్పుడు సరికొత్త ప్రకంపనలు మొదలయ్యాయి. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ అలాగే ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా ఉద్యోగులకు రాసిన లేఖలు ఇప్పుడు సంచలనంగా మారాయి. టాప్ ఐటీ దిగ్గజ కంపెనీ లుఅధిపతులు చేసిన హెచ్చరికలు రానున్న కాలంలో భారతీయ ఐటీ రంగం ఎదుర్కోబోతున్న సంక్షోభాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి.

ఆపిల్ ఐఫోన్ 8పై సరికొత్త నిజాలు

wipro and infosys

నోట్ల రద్దు, అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ను మించి సమస్యలు ఐటి రంగాన్ని పీడిస్తున్నాయన్న వీరు సంకేతాలు అందించారు. ఐటీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా రాజకీయ మరియు ఆర్థిక సంఘర్షణల నేపథ్యంలో తీవ్ర ముప్పు ఎదుర్కోనున్నట్టు ఇద్దరు నేతలు ఉద్యోగులను హెచ్చరించడం ఆసక్తికర అంశం.

ఈ ఏడాది షియోమి నుంచి దూసుకొస్తున్న ఫోన్లు ఇవే !

ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా లేఖ సారాంశం

ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా లేఖ సారాంశం

భవిష్యత్ ఐటీ రంగం ముళ్ల బాటలో నడవాల్సి వుంటుందని, ఎన్నో అడ్డంకులు, అవాంతరాలను అధిగమించాల్సి వుంటుందని ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ హెచ్చరించారు. ఈ సమయంలో ఇన్ఫోసిస్ విలువను మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నామని, ఈ మార్గంలో ఉద్యోగుల శ్రమ, మరింత కృషి అవసరమని అన్నారు.

ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా లేఖ సారాంశం

ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా లేఖ సారాంశం

బ్రెగ్జిట్, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, నోట్ల రద్దు, డిజిటౌజేషన్, సైబర్ సెక్యూరిటీ సమస్యలు, పెద్ద దేశాలను పట్టి పీడిస్తున్న వలసలు, ఉగ్రవాదం తదితర ఎన్నో సమస్యలు నేడు ఐటీ రంగంపై ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు.

లేఖ సారాంశం
 

లేఖ సారాంశం

మనం ముందడుగు వేయకుంటే పోటీ ప్రపంచంలో వెనకబడిపోతాం. ఆటోమేషన్, టెక్నాలజీ విభాగాల్లో మరింతగా అభివృద్ధి చెందాల్సి వుంది. క్లయింట్లకు మరింత సమర్థవంతమైన సేవలను అందించాల్సి వుందని విశాల్ చెప్పారు.

విప్రో ఛైర్మన్ అజీం ప్రేమ్ జీ లేఖ సారాంశం

విప్రో ఛైర్మన్ అజీం ప్రేమ్ జీ లేఖ సారాంశం

2016 లో ఎదునైన అడ్డంకులను, సవాళ్లను విస్మరించలేమంటూ విప్రో ఛైర్మన్ అజిం ప్రేమ్ జీ పేర్కొన్నారు. కానీ, వివాదాలపై దృష్టిపెట్టకుండా కామన్ గ్రౌండ్ పై దృష్టిపెట్టాలంటూ నాలుగు సూత్రాలను ప్రేమ్ జీ ఉద్యోగులకు సూచించారు.

విప్రో ఛైర్మన్ అజీం ప్రేమ్ జీ

విప్రో ఛైర్మన్ అజీం ప్రేమ్ జీ

తోటి మానవులను గౌరవించాలని ప్రకృతి పట్ల కూడా అదే గౌరవం కలిగి ఉండాలన్నారు. అపుడు కామన్ గ్రౌండ్ ను గుర్తించడం సాధ్యమవుతుంది.సమాజాలు, ఆర్థిక వ్యవస్థలు ప్రకృతి అన్నీమానవులతో పెనవేసుకున్న బంధాన్ని, అనుసంధానం గుర్తించాలన్నారు. మన సమస్యలు, వాటి పరిష్కారాలు ఈ సంబంధాలను బలోపేతం చేసుకోవడంలోనే ఉందన్నారు.

లేఖ సారాంశం

లేఖ సారాంశం

ప్రత్యీ ఉద్యోగి విలువలకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలన్నారు. ఈ సందర్భంగా రాజస్తాన్ సందర్శన, అక్కడి ప్రజల కష్టాలను, వారి పోరాటాలను తన లేఖలో విప్రో ఛైర్మన్ ఉదహరించారు. అక్కడ ఓ బాలిక అడిగిన ప్రశ్న తనన ఎంతో ఆలోచింపజేసిందని తెలిపారు.

Best Mobiles in India

English summary
Wipro and Infosys leaders warn employees about disruptions that can impact the IT industry read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X