3 నిమిషాల్లో 100జీబి డౌన్‌లోడ్

|

అమెరికాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ చిప్‌ల తయారీ కంపెనీ ఇంటెల్ తన అప్‌కమింగ్ 5జీ మోడమ్‌కు సంబంధించి ప్రచార పర్వాన్ని ప్రారంభించింది. ప్రస్తుతానికి అడ్వాన్సుడ్ డెవలప్ మెంట్ స్టేజ్‌లో ఉన్న ఈ మోడమ్ 2017 చివరినాటికి కమర్ఫియల్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది.

3 నిమిషాల్లో 100జీబి డేటా డౌన్‌లోడ్ అవుతుంది

Read More : 2000జీబి స్టోరేజ్ కెపాసిటీతో పెన్‌డ్రైవ్

ఈ మోడమ్ 5Gbps వరకు డౌన్‌లోడ్ స్సీడ్‌లను అందుకోగలదని ఇంటెల్ చెబుతోంది. అంటే ఈ మోడమ్ ద్వారా 100జీబి డేటాను కేవలం 3 నిమిషాల లోపల డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నమాట. క్యారియర్ అగ్రిగేషన్, లో లేటన్సీ ఫ్రీక్వెన్సీస్, MMIO వంటి అత్యాధునిక టెక్నాలజీలను ఈ మోడమ్‌లో ఇంటెల్ వినియోగించినట్లు తెలుస్తోంది.

3 నిమిషాల్లో 100జీబి డేటా డౌన్‌లోడ్ అవుతుంది

Read More : రూ.16కే వాడుకున్నంత 4జీ ఇంటర్నెట్

4జీ నెట్‌వర్క్‌ను ప్రపంచదేశాలు పూర్తిగా సమకూర్చుకోకముందే 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఎక్విప్‌మెంట్ ఒక్కొక్కటిగా సిద్దమైపోతోంది అమెరికాలోని ప్రముఖ నెట్‌వర్క్ క్యారియర్లు ఇప్పటికే 5జీ నెట్‌వర్క్ టెస్టింగ్‌ను ప్రారంభించేసాయి.Verizon సంస్ద ఇప్పటికే 10 నగరాల్లో 5జీ సాంకేతికతను సిద్దం చేసేసుకుంది. మరోవైపు AT&T కొన్ని ప్రాంతాల్లో 5జీ టెస్టింగ్‌ను ప్రారంభించేసింది. సామ్‌సంగ్ సైతం 2018 నాటికి దక్షిణకొరియాలో 5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది.

Best Mobiles in India

English summary
Intel Started Publicizing their 5G Modem that Can Deliver Up to 5Gbps Download Speeds. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X