మీ ఇంటికే రైల్వే టికెట్లు,డబ్బులు అప్పుడే ఇవ్వొచ్చు, పూర్తి సమాచారం ఇదే !

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై వారు ఐఆర్‌సీటీసీ సైట్‌లో బుక్ చేసే ట్రెయిన్ టిక్కెట్లను డోర్ డెలివరీ రూపంలో పొందవచ్చు.

By Hazarath
|

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై వారు ఐఆర్‌సీటీసీ సైట్‌లో బుక్ చేసే ట్రెయిన్ టిక్కెట్లను డోర్ డెలివరీ రూపంలో పొందవచ్చు. అందుకు గాను నగదును ముందే చెల్లించాల్సిన అవసరం లేదు. టిక్కెట్లను డోర్ డెలివరీ అందుకున్నప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో నగదును చెల్లించవచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇకపై రైల్వే టికెట్ బుకింగ్ వేగవంతం, కొత్త యాప్ రెడీ

డోర్ డెలివరీ పొందే సదుపాయాన్ని

డోర్ డెలివరీ పొందే సదుపాయాన్ని

ఇకపై రైల్వే టిక్కెట్లను డోర్ డెలివరీ పొందే సదుపాయాన్ని ఐఆర్సీటీసీ కల్పించింది. టిక్కెట్లను డోర్ డెలివరీ ద్వారా అందుకున్న తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో నగదు చెల్లించవచ్చు.

వన్ టైం రిజిస్ట్రేషన్

వన్ టైం రిజిస్ట్రేషన్

కాగా, ఐఆర్సీటీసీ సైట్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసే వినియోగదారులు డోర్ డెలివరీ సదుపాయాన్ని పొందాలంటే, మొబైల్ ఓటీపీ ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పటికే ఐఆర్సీటీసీ అకౌంట్లు ఉన్నవారు ఈ సేవను సంబంధిత సైట్ లోకి వెళ్లి ఉపయోగించుకోవచ్చు.

ప్రూఫ్ కింద

ప్రూఫ్ కింద

ప్రూఫ్ కింద పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. టిక్కెట్లను బుక్ చేసే సమయంలో పే ఆన్ డెలివరీ (పీఓడీ) అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

డోర్ డెలివరీ అయిన తర్వాత నగదు

డోర్ డెలివరీ అయిన తర్వాత నగదు

టిక్కెట్టు డోర్ డెలివరీ అయిన తర్వాత సదరు ప్రయాణికుడు నగదు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ పద్ధతిలో రైల్వే టిక్కెట్లను కొనుగోలు చేస్తే అదనంగా కొంత రుసుము వసూలు చేస్తారు.

చార్జీ

చార్జీ

రూ.5 వేల లోపు కొనుగోలుకు రూ.90 వరకు, రూ.5వేలకు పైబడితే రూ.120 చార్జీ కింద వసూలు చేయనున్నారు.

ఐదు రోజుల ముందుగా

ఐదు రోజుల ముందుగా

ఇదిలా ఉండగా, ప్రయాణికులు తమ ప్రయాణానికి గరిష్టంగా ఐదు రోజుల ముందుగా కూడా ఈ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని ఐఆర్సీటీసీ కల్పించింది.

ఒకవేళ క్యాన్సిల్ చేయదలిస్తే.

ఒకవేళ క్యాన్సిల్ చేయదలిస్తే.

ఈ విధానంలో బుక్ చేసిన టిక్కెట్లను ఒకవేళ క్యాన్సిల్ చేయదలిస్తే.. ఆ టిక్కెట్లు డోర్ డెలివరీ అయ్యేలోగానే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకుగాను, క్యాన్సిలేషన్, డోర్ డెలివరీ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

 పీవోడీ విధానం

పీవోడీ విధానం

కాగా, పీవోడీ విధానం ప్రస్తుతం మన దేశంలో ఆరువందల నగరాలు, పట్టణాల్లో అమల్లో ఉంది. 4వేల పిన్ కోడ్‌లలో ఉంటున్న యూజర్లు పీవోడీ సిస్టమ్‌ను ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
IRCTC Starts Cash on Delivery Service for Railway Tickets read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X