ఆరంభం అదిరింది..

By Sivanjaneyulu
|

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన మొట్టమొదటి 'మేడ్ ఇన్ ఇండియా' స్పేస్ షెటిల్‌ను నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) నుంచి విజయవతంగా పరీక్షించింది. ఈ పునర్వినియోగ లాంచ్ వెహికల్‌ను ఇస్రో సోమవారం ఉదయం 7 గంటలకు షార్ కేంద్రం నుంచి ప్రయోగించారు. 6.5 మిటర్ల పొడవుతో పాటు 1.75 టన్నుల బరువును కలిగి ఉన్న ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ (RLV-TD) ధ్వని కంటే 5 రెట్ల వేగంతో నింగిలోకి 70 కిలోమీటర్లు దూసుకెళ్లి 11 నిమిషాల వ్యవధిలోనే బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రన్‌వే పై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

Read More : మోటో జీ4 ప్లస్ vs షియోమీ రెడ్మీ నోట్ 3

ఆరంభం అదిరింది..

ఇస్రో ఈ తరహా రాకెట్‌ను ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో అమెరికా, రష్యా దేశాల సరసన భారత్ కూడా చేరింది. RLV-TDప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందలు తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తొలి పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)కి సంబంధించి 10 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : 2016లో రాబోతున్న 6జీబి ర్యామ్ ఫోన్‌లు ఇవే..?

 పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

ఈ వెహికల్ నిర్మాణం నిమిత్తం భారత ప్రభుత్వం రూ.95 కోట్ల మేర ఖర్చు చేసింది.

 పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

ఈ స్పేస్ షెటిల్ నిర్మాణాన్ని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో పూర్తి చేసారు.

 పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

600 మంది శాస్త్రవేత్తలు 5 సంవత్సరాల పాటు శ్రమించి ఈ నిర్మాణాన్ని పూర్తి చేసారు.

 పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

ఫైనల్ వర్షన్ లాంచ్ వెహికల్ సిద్ధమయ్యేలోపు మరో రెండు టెస్ట్ ప్రయోగాలను విజయవంతం చేయాలని ఇస్రో భావిస్తోంది.

 పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

40 మిటర్ల పొడవులో పూర్తిస్థాయి పునర్వినియోగ వాహక నౌక 2030 నాటికి సిద్దమయ్యే అవకాశముంది.

 పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

యూజబుల్ టెక్నాలజీని ఉపయోగించటం వల్ల ఉపగ్రహాల వ్యయం తగ్గటంతో పాటు అంతరిక్ష మౌలిక వసతుల ఖర్చు కూడా తగ్గుతుందని ఇస్రో చెబుతోంది.

 పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

ప్రస్తుతం వాడుతోన్న సాంప్రదాయ రాకెట్ల ద్వారా కిలో బరువును ఉన్న వస్తువును అంతరిక్షంలోకి పంపాలంటే దాదాపు 20,000 డాలర్లు ఖర్చువుతోందట.

 పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనేది రెక్కలతో కూడిన వాహక నౌక. ఇది భూ ఉపరితలం నుంచి రాకెట్ లా దూసుకువెళుతుంది. అనంతరం గ్లైడర్ లా తిరిగి విమానంలో భూమి పై ల్యాండ్ అవుతుంది.

 పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

పునర్వినియోగ అంతరిక్ష వాహక నౌక (ఆర్ఎల్‌వీ)

ఈ లాంచ్ వెహికల్‌కు సంబంధించి ఫైనల్ వర్షన్ అందుబాటులోకి వచ్చినట్లయితే మనుషులతో కూడిన అంతిరక్ష యాత్రలకు వీటిని ఉపయోగించే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
ISRO successfully test launches India's first-ever indigenous space shuttle. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X