3జీ ఫోన్‌‌లను నిలిపివేస్తున్న ప్రముఖ కంపెనీలు..?

|

జియో 4జీ రాకతో భారత్‌లో 3జీ పోన్లకు కాలం చెలుతున్నట్లు తెలుస్తోంది. 4జీ ఫోన్ మార్కెట్ మరింత ఊపందుకోవటంతో ప్రముఖ తయారీ కంపెనీలు 3జీ ఫోన్‌‌లను నిలిపివేస్తున్నట్లు సమాచారం.

3జీ ఫోన్‌‌లను నిలిపివేస్తున్న ప్రముఖ కంపెనీలు..?

Read More : 300జీబి ఇంటర్నెట్‌ను రూ.249కే అందిస్తోన్న BSNL, ప్లాన్ గురించి 10 ముఖ్యమైన విషయాలు

సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఒప్పో, వివో, లెనోవో - మోటరోలా, హెచ్‌‌టీసీ, మైక్రోమాక్స్, పానాసోనిక్ వంటి బ్రాండ్లు 4జీ ఫోన్లను మాత్రమే మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. వీటిలో కొన్ని బ్రాండ్లు తమ చెంత ఉన్న 3జీ ఫోన్‌‌ల స్టాక్‌ను పూర్తిగా క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

గత రెండు మూడు నెలలుగా

గత రెండు మూడు నెలలుగా

గత రెండు మూడు నెలలుగా 3జీ ఫోన్‌లకు రిటైల్ మార్కెట్లో పూర్తిగా డిమాండ్ తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకు జియో 4జీ సేవలు కూడా ఓ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లు

4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లు

4జీ ఫోన్ మార్కెట్లో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతూ రిలయన్స్, Lyf బ్రాండ్ పేరిట 4G VoLTE స్మార్ట్‌ఫోన్‌లు రూ.2,999 ధర ట్యాగ్ నుంచి అందిస్తోంది.

 

జియో సిమ్‌ను ఉచితంగా

జియో సిమ్‌ను ఉచితంగా

అంతే కాకుండా ప్రతి ప్రతి Lyf ఫోన్ కొనుగోలు పై జియో సిమ్‌ను ఉచితంగా ఆఫర్ చేయటంతో పాటు జియో సేవలను కూడా ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

 

కొత్త ఆర్డర్‌లను ప్లేస్ చేయటం లేదు
 

కొత్త ఆర్డర్‌లను ప్లేస్ చేయటం లేదు

వినియోగదారులు 4జీ ఫోన్‌లనే ఎక్కువుగా లైక్ చేస్తున్న నేపథ్యంలో 3జీ ఫోన్లకు సంబంధించి ఎటువంటి కొత్త ఆర్డర్‌లను తాము ప్లేస్ చేయటం లేదని దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ రిటైలర్ తెలిపింది.

 సామ్‌సంగ్ కేవలం

సామ్‌సంగ్ కేవలం

భారత దేశంలో అత్యధికంగా స్మార్ట్‌ఫోన్లను విక్రియిస్తోన్న సామ్‌సంగ్ కేవలం 3 మోడల్స్ లో మాత్రమే 3జీ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తోంది. మిగిలిన 22 మోడల్స్‌లో 4జీ ఫోన్‌లనే ఆఫర్ చేస్తోంది.

 

చైనా ఫోన్‌ల కంపెనీ ఒప్పో

చైనా ఫోన్‌ల కంపెనీ ఒప్పో

మరోవైపు చైనా ఫోన్‌ల కంపెనీ ఒప్పో 2017 నాటికి 3జీ పోన్లకు స్వస్తి పలికి పూర్తిస్థాయిలో 4జీ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని చూస్తోంది. మరోవైపు హెచ్‌టీసీ కూడా 2017 మార్చినాటికి 3జీ పోన్లకు స్వస్తి పలకాలని చూస్తోంది.

జూన్ తో ముగిసిన త్రైమాసికం నాటికి

జూన్ తో ముగిసిన త్రైమాసికం నాటికి

జూన్ తో ముగిసిన త్రైమాసికం నాటికి జరిగిన స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో భాగంగా 4జీ ఫోన్ ల అమ్మకాల వాటా 65శాతంగా ఉందని, వచ్చే ఏడాది అదే సమయంలో నాటికి ఈ వాటా 90శాతానికి చేరే అవకాశముందని హాంకాంగ్ కు చెందిన కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రిసెర్చ్ తెలిపింది.

Best Mobiles in India

English summary
Jio effect? Smartphone makers Samsung, Micromax and others to launch only 4G phones. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X